TELANGANA TENTH SUPPLEMENTARY DATE
మీకు పదో తరగతి జవాబు పత్రం కావాలా? - అయితే ఇలా చేయండి.
బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాలు - అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల దరఖాస్తుకు 16 తుది గడువు - పునఃపరిశీలన, జవాబు పత్రాల నకలు కోసం ఈ నెల 15వ తేదీ తుది గడువు.
How to Apply for Recounting and Reverification After Tenth Class Results 2025 : పదో తరగతి ప్రతి స్టూడెంట్ జీవితంలో కీ రోల్ పోషిస్తుంది. ఈ క్లాస్‌లో సాధించే మార్కులు, సబ్జెక్ట్ నైపుణ్యాలు భవితకు పునాదిగా నిలుస్తాయి. అంతేకాదు పదో తరగతి సబ్జెక్ట్‌ల్లో సాధించే మార్కుల ఆధారంగానే తర్వాత చేరాల్సిన ఉన్నత విద్య కోర్సుపై ఓ క్లారిటీ వస్తుంది. ఇంతటి కీలకమైన టెన్త్ క్లాస్ 2025 రిజల్ట్స్ బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫిలతాల్లో కొందరు ఫెయిల్ అయ్యారు. మరికొందరు తక్కువ మార్కులు వచ్చాయని బాధపడుతుంటారు. తమ అంచనాలకు భారీగా తేడా అనిపిస్తే రీ వాల్యూయేషన్‌ను ఆశ్రయిస్తారు.
పది తప్పిన విద్యార్థులకు వచ్చే నెల 3 నుంచి 13వ తేదీ వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు. స్టూడెంట్స్ ఈ నెల 16 తేదీలోపు పరీక్ష రుసుం చెల్లించాలని, రుసుములను ఆయా స్కూల్లో హెడ్ మాస్టర్లకు చెల్లించాలని చెప్పారు. రూ.50 ఆలస్య రుసుంతో సబ్జెక్టు పరీక్ష జరిగే ముందు 2 రోజుల వరకు చెల్లించవచ్చని అన్నారు. మార్కుల పునఃలెక్కింపునకు ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున బ్యాంకు చలానా తీసి ఫారమ్ పూర్తి చేసి దాన్ని ఈ నెల 15వ తేదీలోపు హైదరాబాద్‌లోని ప్రభుత్వ పరీక్షల విభాగానికి పోస్టు ద్వారా నేరుగా పంపాలని పేర్కొన్నారు.
అలాగే పునఃపరిశీలన, జవాబు పత్రాల నకలు కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చెల్లించాలని కృష్ణారావు అన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను హెడ్ మాస్టర్లతో ధ్రువీకరించి ఆయా జిల్లాల డీఈఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో సమర్పించాలని, అందుకు ఈ నెల 15వ తేదీ తుది గడువని తెలిపారు.
అమ్మాయిలదే పైచేయి :
తెలంగాణ పదో తరగతి పరీక్షల్లో ఈసారి రికార్డు స్థాయిలో 92.78 % మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కరోనా రెండు సంవత్సరాల కాలాన్ని మినహాయిస్తే ఇప్పటివరకు తెలంగాణలో ఇదే అత్యధిక ఉత్తీర్ణత శాతం. మొత్తం 4,96,374 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో 4,60,519 మంది ఉత్తీర్ణులయ్యారు. గత సంవత్సరం కన్నా ఈసారి 1.47 శాతం ఉత్తీర్ణత పెరిగింది. సీఎం రేవంత్ రెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఫలితాలను విడుదల చేశారు. బాలుర ఉత్తీర్ణత 91.32 శాతం కాగా అమ్మాయిలు 94.26 శాతం మంది పాస్ అయ్యారు. మహబూబాబాద్ జిల్లా 99.29 శాతంతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తరువాత సంగారెడ్డి (99.09%), జనగామ 98.81 శాతంతో 2, 3 స్థానాల్లో నిలిచాయి. వికారాబాద్ జిల్లా 73.97 శాతంతో అట్టడుగున నిలిచింది.
COMMENTS