TS 10th Class Results 2025
మరికాసేపట్లోనే పదో తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే!
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల విద్యార్దులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల 2025 ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 30) విడుదల కానున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదగా రవీంద్రభారతి స్టేడియంలో ఫలితాలను ప్రకటించనున్నారు. ఫలితాల వెల్లడి అనంతరం ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా నేరుగా ఫలితాలను చెక్ చేసుకోండి..
తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 30) విడుదల కానున్నాయి. ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠకు ఎదురు చూస్తున్న విద్యార్ధులకు ఈ రోజు వెల్లడికానున్నాయి. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదగా ఫలితాలు వెల్లడించనున్నట్లు విద్యాశాఖ ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంగళవారం (ఏప్రిల్ 30) అధికారికంగా ప్రకటించింది. ఫలితాల వెల్లడి అనంతరం టీవీ 9 తెలుగు అధికారిక వెబ్‌సైట్‌తోపాటు అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in లేదా results.bse.telangana.gov.in లలోనూ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
10th Class Results Website Links:
💥 TG BSE Website: Click Here to Get Results
💥TG BSE Results Website: Click Here to Get Results
💥Manabadi Website: Click Here to Get Results
💥Eenadu Website: Click Here to Get Results
💥Sakshi Website: Click Here to Get Results
రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఇక ఏప్రిల్ 15వ తేదీ నాటికే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా పూర్తైంది. కానీ ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడికాకపోవడంతో విద్యార్ధుల్లో ఆందోళన నెలకొంది. ఈసారి పదో తరగతి విద్యార్ధులకు గ్రేడ్స్ ఇవ్వడానికి బదులు గతంలో మాదిరి విద్యార్ధులకు మార్కులను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి విధివిధాలను రూపొందించడంలో జాప్యం నెలకొనడం మూలంగా టెన్త్ ఫలితాల వెల్లడి ఆలస్యమైంది. ఈ రోజు విడుదలయ్యే ఫలితాల్లో విద్యార్ధులకు వచ్చిన మార్కులతో పాటు సబ్జెక్టుల వారీగా గ్రేడ్స్ కూడా ప్రకటించనున్నారు.
ఈఏడాది రాత పరీక్షలు 80 మార్కులకు, ఇంటర్నల్ మార్కులు 20 మార్కులను నిర్వహించారు. ఈ మేరకు మార్కుల మెమోలను జారీ చేస్తారు. అలాగే వచ్చే ఏడాది నుంచి టెన్త్‌లో ఇంటర్నల్ మార్కులను కూడా తొలగించి, మొత్తం 6 సబ్జెక్టులకు 100 మార్కుల చొప్పున పరీక్షలు నిర్వహించనున్నారు.
10th Class Results Website Links:
💥 TG BSE Website: Click Here to Get Results
💥TG BSE Results Website: Click Here to Get Results
💥Manabadi Website: Click Here to Get Results
💥Eenadu Website: Click Here to Get Results
💥Sakshi Website: Click Here to Get Results
COMMENTS