WATER APPLE MILKSHAKE
టేస్టీ అండ్ హెల్దీ "వాటర్ యాపిల్ మిల్క్‌షేక్" - ఒక్క గ్లాస్ తాగితే ఎండల నుంచి ఫుల్ రిలీఫ్!
-ఆరోగ్యానికి మేలు చేసే వాటర్ రోజ్ యాపిల్ -ఈ సమ్మర్లో ఇలా మిల్క్‌షేక్ చేసుకోండి!
Water Apple Milkshake : రోజురోజుకి ఎండలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడం కోసం మజ్జిగ, నిమ్మరసం, పండ్ల రసాలు వంటివి తీసుకుంటుంటారు. అలాగే ఇంట్లో మిల్క్‌షేక్స్ ప్రిపేర్ చేసుకుంటుంటారు. ఇక మిల్క్‌షేక్స్ అనగానే బనానా, యాపిల్, సపోటా ఇలా రెగ్యులర్‌గా లభించే పండ్లతో ప్రిపేర్ చేస్తుంటారు. కానీ మీకు తెలుసా నీటి శాతం అధికంగా ఉండే వాటర్ యాపిల్‌తో కూడా సూపర్ టేస్టీ మిల్క్‌షేక్ చేసుకోవచ్చు. దీని టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. కేవలం టేస్ట్ మాత్రమే కాదు ఈ పండులోని పోషకాలు ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. మరి లేట్ చేయకుండా ఈ వాటర్ యాపిల్ మిల్క్‌షేక్ ఎలా చేసుకోవాలో ఈ స్టోరీలో చూసేయండి.
కావాల్సిన పదార్థాలు:
రోజ్ యాపిల్స్ - 5
పాలు - 2 కప్పులు
గసగసాలు - 1 టేబుల్‌స్పూన్
తేనె - 2 టేబుల్‌స్పూన్లు
ఉప్పు - చిటికెడు
ఐస్‌క్యూబ్స్ - 4
తయారీ విధానం:
ముందుగా వాటర్ యాపిల్స్‌ను శుభ్రంగా కడిగి తుడవాలి. ఆ తర్వాత రెండు చివర్లు కొద్దిగా తీసేసి స్లైస్‌లుగా కట్ చేసుకుని అందులో ఏమైనా గింజలు ఉంటే తీసేయాలి.
స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాలు పోసి మరిగించుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చి మరుగుతున్నప్పుడు గసగసాలు వేసి కలిపి మరో 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి.
గసగసాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.
పాలు పూర్తిగా చల్లారిన తర్వాత మిల్క్‌షేక్ ప్రిపేర్ చేసుకోవాలి.
మిక్సీజార్‌లోకి కట్ చేసిన వాటర్ యాపిల్స్ ముక్కలు, పూర్తిగా చల్లారిన పాలు, తేనె, ఉప్పు, ఐస్‌క్యూబ్స్ వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి.
ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఓ గ్లాస్‌లోకి తీసుకుని పైన సన్నగా తరిగిన వాటర్ యాపిల్ ముక్కలు, గసగసాలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే వాటర్ యాపిల్ మిల్క్‌షేక్ రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
టిప్స్:
తాజాగా, గట్టిగా ఉన్న వాటర్ యాపిల్స్‌ను ఎంచుకోవాలి. మెత్తగా లేదా పాడైపోయిన వాటిని ఉపయోగిస్తే మిల్క్‌షేక్ రుచి మారుతుంది.
మిల్క్‌షేక్ మరింత క్రీమీగా ఉండాలంటే, కొన్ని జీడిపప్పు పలుకులను నానబెట్టి బ్లెండ్ చేసేటప్పుడు వేసుకోవచ్చు.
మిల్క్‌ను బ్లెండ్ చేసేటప్పుడు అవసరమైతే యాలకుల పొడి లేదా కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసుకుంటే మిల్క్‌షేక్ రుచి మరింత బాగుంటుంది.
తేనె బదులు పంచదార లేదా పటిక బెల్లాన్ని కూడా ఉపయోగించవచ్చు. అయితే ఈ స్వీట్‌ను మీరు తీసుకునే వాటర్ యాపిల్స్‌కు అనుగుణంగా వేసుకోవాలి.
COMMENTS