FREE SERVICES AT PETROL PUMP
పెట్రోల్ బంకుల్లో ఈ సౌకర్యాలన్నీ ఫ్రీ - లేదంటే ఓనర్‌కు ఫైన్ మోత మోగిపోద్ది!
పెట్రోల్ పంపులో ఈ సౌకర్యాలన్నీ పూర్తిగా ఉచితం- ఏర్పాటు చేయకపోతే యజమానులపై చర్యలు- ఆ సౌకర్యాలేంటో మీకు తెలుసా?
Free Services At Petrol Pump : సాధారణంగా తమ వాహనాల్లో పెట్రోల్, డిజీల్ అయిపోయినప్పుడ ప్రజలు పెట్రోల్ పంపులకు వెళతారు. అయితే పెట్రోల్ పంపుల్లో కస్టమర్లతో పాటు సామాన్యులు కూడా అనేక సౌకర్యాలు ఫ్రీగా పొందొచ్చని మీకు తెలుసా? అవును మీరు చదివింది నిజమే. పెట్రోల్ పంప్ ఆపరేటర్ సామాన్యులకు కొన్ని సౌకర్యాలు కచ్చితంగా కల్పించాలి. ఉల్లంఘిస్తే వారిపై చర్యలు కూడా తీసుకోవచ్చు. దేశవ్యాప్తంగా పెట్రోల్ పంపుల్లో ఈ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. పెట్రోల్ పంపుల్లో ఉచిత సౌర్యాల గురించి ను ఉత్తర్‌ప్రదేశ్ ఫరూఖాబాద్ జిల్లా అధికారి సురేంద్ర యాదవ్ వెల్లడించారు. అవేంటో తెలుసుకుందామా!
సౌకర్యాలు లోపిస్తే 45రోజులు పెట్రోల్ బంక్ బంద్!
ఫరూఖాబాద్ జిల్లాలో 85 పెట్రోల్ పంపులు ఉన్నట్లు సురేంద్ర యాదవ్ చెప్పారు. పెట్రోల్, సీఎన్‌జీ పంపుల వద్ద టాయిలెట్లు, త్రాగునీరు, టైర్లకు గాలి వంటి ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో లేవని, దానిపై పెంట్రోల్ పంపుల యజమానులకు హెచ్చరికలు జారీ చేశామన్నారు. వినియోగదారులకు ఈ సౌకర్యాలు కల్పించకపోతే జరిమానా విధిస్తామని తెలిపారు. మూడుసార్లు అవకతవకలు లేదా లోపాలు కనిపిస్తే, పెట్రోల్ పంప్ సరఫరా, అమ్మకాలను 45 రోజుల పాటు నిలిపివేస్తామని సురేంద్ర యాదవ్ వెల్లడించారు. జిల్లా అధికారి సురేంద్ర యాదవ్ ప్రకారం పెట్రోల్ పంపుల్లో ఉచిత సేవలు ఇవే.
పెట్రోల్ పంపుల్లో ఇవ్వన్నీ ఫ్రీ!
దేశవ్యాప్తంగా ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం వంటి సంస్థల పెట్రోల్ పంపుల్లో ఈ సౌకర్యాలన్నీ ఉచితకంగా పొందుచ్చు.
పెట్రోల్ పంపులో మీ వాహన టైర్లలో గాలిని ఉచితంగా నింపుకోవచ్చు. దీని కోసం మీరు ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.
పెట్రోల్ పంపుల వద్ద మీకు ఉచితంగా తాగునీరు దొరుకుతుంది. ఇక్కడ RO లేదా వాటర్ కూలర్ సౌకర్యాన్ని అందించడం అవసరం. దీంతో మీరు సులభంగా నీరు త్రాగవచ్చు.
పెట్రోల్ పంపుల వద్ద బాత్రూమ్ సౌకర్యాలు కూడా ఉచితం. మీరు దీన్ని ఎప్పుడైనా ఉపయోగించవచ్చు. ఎవరైనా నిరాకరిస్తే షిఫ్ట్ మేనేజర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
అత్యవసర సమయంలో మీరు పెట్రోల్ పంప్ నుంచి ఉచిత కాల్ చేయవచ్చు. దీనికి ఎటువంటి రుసుము ఉండదు. ఈ సౌకర్యాన్ని పంపు యజమాని అందిస్తాడు.
పెట్రోల్ పంపులో ప్రథమ చికిత్స పెట్టె సౌకర్యం కూడా ఉంది. ఇందులో ముఖ్యమైన మందులు, బ్యాండేజీలు ఉంటాయి, వీటిని మీరు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించవచ్చు. అయితే, మందులు ఉపయోగించే ముందు, గడువు తేదీ నిర్ధరించుకోవడం చాలా ముఖ్యం.
పెట్రోల్ పంపులో ఇంధనం నింపేటప్పుడు అగ్ని ప్రమాదం జరిగితే, అగ్ని భద్రతా పరికరాలు అక్కడ అందుబాటులో ఉంటాయి. మీరు ఉపయోగించవచ్చు. దీనికి కూడా ఎటువంటి రుసుములు ఉండవు.
పెట్రోల్ పంపులో యజమాని పేరు, కంపెనీ పేరు, కాంటాక్ట్ నంబర్ కూడా అందుబాటులో ఉంటాయి. ఏదైనా అవసరం వస్తే పంపును సంప్రదించడానికి ఈ సమాచారం మీకు సహాయపడుతుంది.
నిబంధనలను ఉల్లంఘిస్తే- ఫైన్ మోత మోగుద్ది!
పెట్రోల్-డీజిల్ నింపిన తర్వాత, మీకు బిల్లు ఇస్తారు. సౌకర్యాల్లో ఏదైనా సమస్య ఉంటే బిల్లు ద్వారా దాన్ని సరిదిద్దుకోవచ్చు.
మొదటిసారి ఉల్లంఘనకు - రూ. 10,000 జరిమానా.
రెండోసారి అతిక్రమిస్తే - రూ.25,000 జరిమానా.
మూడోసారి ఉల్లంఘిస్తే - రూ. 10,000 జరిమానా, 45 రోజుల పాటు అమ్మకాలు నిలిపివేయడం.
పెట్రోల్ బంకులు ఇలా మెయింటేన్ చేయాలి!
అన్ని పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ పంపుల వద్ద పురుషులు, మహిళలు, వికలాంగులకు ప్రత్యేక శుభ్రమైన మరుగుదొడ్లు, ర్యాంప్‌లు ఏర్పాటు చేయాలని సురేంద్ర యాదవ్ తెలిపారు. సాధారణ ప్రజలు ఈ సౌకర్యాలను ఉపయోగించడానికి టాయిలెట్లకు తాళాలు ఉండకూడదన్నారు. పెట్రోలియం కంపెనీలు సాధారణ ప్రజల నుంచి టాయిలెట్ శుభ్రతపై అభిప్రాయాన్ని తీసుకునే వ్యవస్థను అభివృద్ధి చేయాలని కూడా ఆయన కోరారు. ఈ మేరకు జిల్లాలోని పెట్రోల్ పంపులకు సమాచారం అందించామని తెలిపారు. కాగా, 1981లో అమల్లోకి వచ్చిన పెట్రోలియం చట్టంలో వివరణాత్మక మార్గదర్శకాలు ఉన్నాయి. ఈ చట్టాన్ని 2002లో సవరించారు.
COMMENTS