Notification released for admissions to undergraduate courses at Professor Jayashankar Agri University
ప్రొఫెసర్ జయశంకర్ అగ్రి యూనివర్శిటీలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.
తెలంగాణలో అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణలోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్శిటీలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఈఏపీ సెట్ ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తారు.
తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్శిటీల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్శిటీలో అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. పలు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.
తెలంగాణలోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రి యూనివర్శిటీలో అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, కమ్యూనిటీ సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. అగ్రికల్చర్ అనుబంధ కోర్సుల్లో రెగ్యులర్ సీట్లు, స్పెషల్ క్యాటగిరీ, ఎన్నారై సీట్లను భర్తీ చేయనున్నారు. వెస్ట్రర్న్ సిడ్నీ యూనివర్శిటీ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న డ్యుయల్ డిగ్రీ, పీజీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో కూడా ప్రవేశాలు కల్పిస్తారు.
బిఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్…
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్శిటీలో బిఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్‌లో రెగ్యులర్ క్యాటగిరీలో 615 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లకు సెమిస్టర్‌కు రూ. 49,560ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. స్పెషల్ క్యాటగిరీలో 400 సీట్లు ఉండగా వాటికి సెమిస్టర్‌కు రూ.62,500ఫీజు వసూలు చేస్తారు. ఎన్నారై, ఎన్నారై స్పాన్సర్డ్ క్యాటిరీలో 20 సీట్లు ఉన్నాయి. వీటికి సెమిస్టర్‌కు 1500డాలర్ల ఫీజు చెల్లించాలి. అగ్రికల్చర్ యూనివర్శిటీ, ఆస్ట్రేలియాకు చెందిన వెస్టర్న్ సిడ్నీ యూనివర్శిటీ భాగస్వామ్యంలో నిర్వహించే డ్యుయల్ డిగ్రీ కోర్సులో 30 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఉన్నాయి.
కమ్యూనిటీ సైన్స్..
బిఎస్సీ ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్ కోర్సులో 75 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సుకు సెమిస్టర్‌కు రూ.49,560 ఫీజు చెల్లించాలి. స్పెషల్ క్యాటగిరీలో ఉన్న 10సీట్లకు రూ.62,500, ఎన్నారై కోటా 4సీట్లకు 1500డాలర్లు ఫీజు ఉంటుంది.
బిటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్…
బిటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సులో 50 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సుకు సెమిస్టర్‌కు రూ.49,560 ఫీజు చెల్లించాలి. స్పెషల్ క్యాటగిరీలో ఉన్న 10సీట్లకు రూ.62,500, ఎన్నారై కోటా 3 సీట్లకు 1500డాలర్లు ఫీజు ఉంటుంది.
బిటెక్ ఫుడ్ టెక్నాలజీ…
బిటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సులో 50 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సుకు సెమిస్టర్‌కు రూ.49,560 ఫీజు చెల్లించాలి. స్పెషల్ క్యాటగిరీలో ఉన్న 10సీట్లకు రూ.62,500, ఎన్నారై కోటా 2 సీట్లకు 1500డాలర్లు ఫీజు ఉంటుంది.
అన్ని కోర్సులకు హాస్టల్ మెస్ ఛార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్శిటీ దేవంలోనే రెండవ అతి పెద్ద వ్యవసాయ విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందింది. తెలంగాణలో ఐకార్ గుర్తింపు పొందిన ఏకైక యూనివర్శిటీ.
మరిన్ని వివరాలకు 040-24011854, 83329 70271, 83329 70284 నంబర్లను సంప్రదించాలి.
Important Links:
FOR More Details CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS