TG MHSRB: 2,050 Nursing Officer Posts in Telangana
The Medical and Health Services Recruitment Board (MHSRB) has released a notification for the recruitment of 2,050 Nursing Officer (Staff Nurse) posts in the Telangana State Medical and Health Department. Eligible candidates should apply online from September 28 to October 14. A total of 2050 posts will be filled including 1576 staff nurse posts under Public Health and Family Welfare Department/Dedication Directorate, 332 under Telangana Medical Policy Parishad, 80 in MNJ Cancer Hospital, 61 in AYUSH and one staff nurse in IPM. On November 17, a computer-based test will be conducted for the selection of nursing officers. This exam will be conducted in 13 centers including Hyderabad. While there are 80 points for the written exam. The service of contract and outsourcing employees who have worked in state government hospitals and institutions has a weightage of 20 points.
Vacancy Details:
Nursing Officer (Staff Nurse): 2,050 Posts
Vacancies of posts by zones: Zone 1-241, Zone 2-86, Zone 3- 246, Zone 4- 353, Zone 5- 187, Zone 6- 747, Zone 7-114.
Department wise vacancies:
1. Director of Public Health and Family Welfare/ Director of Medical Education: 1,576 Posts.
2. Telangana Vaidya Vidhana Parishad: 332 Posts.
3. AYUSH: 61 Posts.
4. Institute of Preventive Medicine: 01 Post.
5. MNJ Institute of Oncology and Regional Cancer Center: 80 Posts.
Qualifications: General Nursing, Midwifery (GNM) or BSc (Nursing) pass along with details should be registered in Telangana State Nursing Council.
Maximum Age Limit: The minimum age limit for applying for these posts is 18 years. The maximum age limit was increased to 46 years while it was previously 44 years old. There is a relaxation of ten years for the disabled in the maximum age limit. There will be five years relaxation for SC, ST, BC, three years for those with ex-servicemen and NCC certificate and five years relaxation for state government employees.
Pay Scale: Rs.36,750 per month - Rs.1,06,990.
Selection Process: 80 points for written exam. The service of contract and outsourcing employees who have worked in state government hospitals and institutions has a weightage of 20 points.
Written Test: 80 multiple choice questions will be asked in computer based exam. Each question has a mark.
Exam Centers: Hyderabad, Nalgonda, Kodada, Khammam, Kothagudem, Satthupalli, Karimnagar, Mahbubnagar, Sangareddy, Adilabad, Nizamabad, Warangal, Narsampet.
Application, Examination Fee: Rs.700. SC, ST, EWS 500 for disabled, ex-servicemen and women candidates.
Important dates.
Start of Online Applications: 28.9.2024.
Last date for online application: 14-10-2024.
Application Amendment Dates: 16.10.2024 to 17.10.2024.
Exam Date (CBT): 17.11.2024.
Highlights:
- The Medical and Health Services Recruitment Board (MHSRB) has released a notification for the recruitment of 2,050 Nursing Officer (Staff Nurse) posts in the Telangana State Medical and Health Department.
- Eligible candidates should apply online from September 28 to October 14.
TG MHSRB: తెలంగాణలో 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో 2,050 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్‌నర్సు) పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులు సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ/ వైద్యవిద్య డైరెక్టరేట్ పరిధిలో 1576 స్టాఫ్‌నర్సు పోస్టులు, తెలంగాణ వైద్య విధానపరిషత్ పరిధిలో 332, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో 80, ఆయుష్‌లో 61, ఐపీఎంలో ఒక స్టాఫ్‌నర్సుతో కలిపి మొత్తం 2050 పోస్టులను భర్తీ చేయనున్నారు. నవంబరు 17న నర్సింగ్ ఆఫీసర్ల ఎంపికకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాద్ సహా 13 కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుంది. రాతపరీక్షకు 80 పాయింట్లు ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుకు 20 పాయింట్ల వెయిటేజీ ఉంటుంది.
ఖాళీల వివరాలు:
నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్): 2,050 పోస్టులు.
జోన్ల వారీగా పోస్టుల ఖాళీలు: జోన్ 1- 241, జోన్ 2- 86, జోన్ 3- 246, జోన్ 4- 353, జోన్ 5- 187, జోన్ 6- 747, జోన్ 7-114.
శాఖల వారీగా ఖాళీలు:
1. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్/ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్: 1,576 పోస్టులు.
2. తెలంగాణ వైద్య విధాన పరిషత్: 332 పోస్టులు.
3. ఆయుష్: 61 పోస్టులు.
4. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్: 01 పోస్టు.
5. ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్ రీజినల్ క్యాన్సర్ సెంటర్: 80 పోస్టులు.
అర్హతలు: జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) లేదా బీఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో వివరాల నమోదు చేసుకొని ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు కనిష్ఠ వయోపరిమితి 18 ఏళ్లు. గరిష్ఠ వయోపరిమితి గతంలో 44 ఏళ్లు ఉండగా తాజాగా 46 ఏళ్లకు పెంచారు. గరిష్ఠ వయోపరిమితిలో దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్ల సడలింపు, ఎక్స్‌సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ సర్టిఫికెట్ ఉన్నవారికి మూడేళ్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
పే స్కేల్: నెలకు రూ.36,750 - రూ.1,06,990.
ఎంపిక విధానం: రాతపరీక్షకు 80 పాయింట్లు ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుకు 20 పాయింట్ల వెయిటేజీ ఉంటుంది.
రాత పరీక్ష: కంప్యూటర్ ఆధారిత పరీక్షలో 80 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట.
దరఖాస్తు, పరీక్ష రుసుము: రూ.700. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు రూ.500.
ముఖ్య తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 28.9.2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14-10-2024.
దరఖాస్తు సవరణ తేదీలు: 16.10.2024 నుంచి 17.10.2024 వరకు.
పరీక్ష తేదీ (సీబీటీ): 17.11.2024.
ముఖ్యాంశాలు:
- తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో 2,050 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్‌నర్సు) పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
- అర్హులు సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS