Vyom Mitra skull-How did it compete with the human brain?
మనిషి మెదడుకు పోటీగా వ్యోమ్‌మిత్ర పుర్రె- ఎలా చేశారు? ఎం పని చేస్తుందంటే?
ISRO Gaganyan: ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు గగన్‌యాన్ ప్రయోగం. గగన్‌యాన్ ద్వారా 2025లో అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపించాలని ఇస్రో సంకల్పించింది. అయితే వ్యోమగాముల కంకటే ముందే ప్రయోగ సురక్షితను పరీక్షించటానికి అంతరిక్షంలోకి వ్యోమ్‌మిత్రను పంపాలని నిర్ణయించారు. వ్యోమగాముల కన్సోల్‌తో చేసే పనుల కోసం వ్యోమ్‌మిత్ర రోబో చేతులను ఎలా వాడుకుంటుంది? అంతరిక్ష వాహనంలో అది వ్యవస్థలను ఎలా కంట్రోల్ చేస్తుంది? భూమ్మీది ఇస్రో బృందంతో ఇచ్చే సిగ్నల్స్‌ను ఎలా రిసీవ్ చేసుకుంటుంది?అనేవి ఈ ప్రయోగంలో పరిశీలించనున్నారు. ఇలా వచ్చిన ఫలితాలను విశ్లేషించి భవిష్యత్తులో మానవ అంతరిక్ష ప్రయాణం మీద పడగల ప్రభావాలను అంచనా వేయనున్నారు.
Half humanoid :
హ్యూమనాయిడ్స్, హాఫ్ హ్యూమనాయిడ్స్ పేరుకు రోబో వ్యవస్థలు, కానీ ఇవి మనుషులను పోలిఉంటాయి. అంతరిక్షంలో కదిలే చేతులు, మొండెం, తల, మెడతో తనకు తానే పనిచేయడం వ్యోమ్‌మిత్ర ప్రత్యేకత. హాఫ్ హ్యూమనాయిడ్‌ను ఆధారంగా చేసుకుని వ్యోమ్‌మిత్ర రోబోకు ఇస్రో శాస్త్రవేత్తలు తుదిరూపునిచ్చారు. మాటిమాటికీ చేసే, అత్యంత ప్రమాద కరమైన పనుల కోసం వాడుకుంటారు.
Astronaut skull:
వ్యోమ్‌మిత్ర(Half humanoid) భాగాల్లో పుర్రె అత్యంత కీలకమైంది. ఇది 200MM X 200MMసైజులో 800గ్రాముల బరువు ఉంటుంది. దీన్ని A1 SI10MG అనే అల్యూమినియం మిశ్రమంతో రూపొందిస్తారు. ఈ పుర్రె చాలా తక్కువ బరువున్నప్పటికీ దృఢంగా ఉంటుంది. ఇస్రో రాకెట్‌ను ప్రయోగించేటప్పుడు పడే బాహ్య కంపనాల ఒత్తిడిలను, భారాలను, వేడిని అల్యూమినియం మిశ్రమ పుర్రె సమర్థంగా తట్టుకుంటుంది. అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిజ్ఞానానికి అనుగుణంగానూ ఈ మిశ్రమాన్ని వినియోగిస్తారు. ఇదే వ్యోమ్‌మిత్ర పుర్రె తయారీలో కీలకమైంది. అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్‌పరిజ్ఞానం మూలంగా జాలీ లాంటి ఆకృతులను పుర్రెలో జొప్పించటం సాధ్యమైంది. పొరలు పొరలుగా 3డీ ముద్రణ పద్ధతిలో డిజైన్ చేశారు. ఫలితంగా ఈ పుర్రె బరువు గణనీయంగా తగ్గింది. ఇలా రూపొందించిన పుర్రెను వినియోగించి సౌర ఫలకాలను శుభ్రం చేయటం, ఉపగ్రహం వెలుపల కదిలిన పరికరాలను ఫిక్స్ చేయటం వంటి పనులను ఇస్రో చక్కబెట్టనుంది.
COMMENTS