Can't pay off debts quickly? Too much trouble? Follow these tips to solve your problem!
అప్పులు త్వరగా తీర్చలేకపోతున్నారా? చాలా ఇబ్బందిగా ఉందా? ఈ టిప్స్ పాటిస్తే మీ ప్రాబ్లమ్ సాల్వ్!
Simple Strategies To Clear Debts Faster : ఆర్థిక అత్యవసర సమయంలో తీసుకున్న అప్పులు తీర్చలేక ఇబ్బందిపడుతున్నారా? ఎలా తీర్చాలో తెలియక సతమతమవుతున్నారా? అలాంటి వారు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే! ఆర్థిక నియంత్రణ పాటిస్తూ కొన్ని సమర్థవంతమైన వ్యూహాలను పాటిస్తే, సులువుగా అప్పుడు తీర్చవచ్చు. అప్పులు ఉన్న వారు వారి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న, అదనపు ఆదాయమార్గాలను అన్వేషించడం నుంచి అనవసర ఖర్చులు తగ్గించుకుని, ఆర్థిక నియంత్రణ సాధించడానికి ఈ చిట్కాలు మీకు సహాయపడతాయి.
1. ఆర్థిక పరిస్థితిపై స్పష్టత:
మనలో చాలా మంది సరైన లెక్కలు లేకుండా ఖర్చు చేస్తాం. అలా చేయడం వల్ల మనం ఎంత ఖర్చు చేస్తున్నామో, ఎంత సేవ్ చేయాలో అన్న ఆలోచన రాదు. అందుకే ఆదాయం, ఖర్చులు, అప్పుల వివరాలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోండి. అందుకోసం ఖర్చుల రికార్డ్ మెయింటైన్ చేస్తూ మీ వద్ద ఉన్న అప్పును కూడా స్పష్టంగా రాసుకోండి. మీరు ఉద్యోగి అయితే మీ శాలరీ ఎంత, ఇతర ఆదాయ వనరులు ఏమైనా ఉన్నాయా లేవా అనే దానికి స్పష్టత పొందండి. అలా చేస్తే మీ ఆర్థిక పరిస్థితిపై మీకు ఓ అవగాహన వస్తుంది.
2. మొదట తీర్చాల్సిన అప్పులను గుర్తించండి:
ముందుగా మీకు ఎన్ని రకాల అప్పులు ఉన్నాయో స్పష్టంగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా అధిక వడ్డీకి తీసుకున్న అప్పులను తీర్చడం ప్రయారటీగా పెట్టుకోండి. అయితే, కొన్ని సందర్భాల్లో తొందరగా తిరిగి చెల్లిస్తామని ప్రామిస్ చేసిన అప్పులను తీర్చడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే అప్పు ఇచ్చే వారికి మీపై నమ్మకం పోతే, ఆర్థిక అత్యవసరాల్లో అప్పు పుట్టదు.
3. అదనపు ఆదాయ వనరులను అన్వేషించండి:
మీరు ఉద్యోగం చేస్తే, శాలరీతో పాటు సైడన్ ఇన్కమ్ సంపాదించడం ద్వారా అప్పులను త్వరగా తీర్చవచ్చు. దీనికోసం, మీకు రోజులో ఎంత సమయం ఖాళీగా ఉంటారో, ఆ సమయంలో మీరు ఏ పని చేయగలరో తెలుసుకోవాలి. ఈ రోజుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా అందుబాటులో ఉంది. మీ అర్హతలకు సరిపోయే పార్ట్‌టైమ్ జాబ్‌ను ఎంచుకోండి. ఒకవేళ మీకు, మీకు వ్యాపారం చేసే ఆలోచన ఉంటే, తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయండి. తక్కువ పెట్టబడితో ఎక్కువ లాభాలను పొందే అనేక చిన్న తరహా పరిశ్రమలను మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అలాంటి వాటిపై దృష్టిపెట్టండి. మీరు చేయలేకపోతే కుటుంబ సభ్యుల చేత చేయించగలరో ఆలోచించండి.
4. ఖర్చులు తగ్గించుకోండి:
అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా మీరు పెద్ద మొత్తంలో రుణాన్ని తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. అనవసరమైన ఖర్చులు అంటే సందర్భం లేకపోయినా బట్టలు కొనడం, అనవసరంగా ప్రయాణాలు చేయడం, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడం, ఇవి డబ్బును వృథా చేస్తాయి. ముఖ్యంగా అప్పులు తీరే వరకు ఇలాంటి అనవసర ఖర్చులను తగ్గించుకోవడం చాలా ముఖ్యం.
5.వడ్డీ రేట్ల భారాన్ని తగ్గించుకోండి:
మీ వివిధ రుణాలను ఒక రకమైన లోన్‌గా మార్చుకోవం వల్ల వడ్డీ రేట్ల భారం తగ్గుతుంది. ఉదాహరణకు, మీరు ఒక బ్యాంకు నుంచి పర్సనల్ లోన్ తీసుకున్నారని అనుకుందాం. అదే సమయంలో వేరే బ్యాంకు నుంచి కారు లోన్ తీసుకుని ఉంటే, ఆ రెండు బ్యాంకులు వడ్డీ రేట్లను విడివిడిగా వసూలు చేస్తాయి. అందువల్ల రెండు రుణాలను ఒక బ్యాంకు నుంచి తీసుకుని వడ్డీ రేట్ల భారాన్ని తగ్గించుకునే సదుపాయాన్ని ఎంచుకోండి.
6. ప్రణాళికను రూపొందించండి:
మీరు ప్రతి నెలా ఎంత అప్పు చెల్లించాలనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకోండి. ఆ ప్రణాళికను క్రమం తప్పకుండా అనుసరించండి. మీ ఆదాయం, ఖర్చులపై స్పష్టత ఉండాలి. ఉదాహరణకు, మీరు 100 రూపాయలు సంపాదిస్తే, కొంత ఇంటి అవసరాలకు, మరికొంత ఆసుపత్రి ఖర్చుల కోసం కేటాయించాలి. ప్రతి నెలా కొంత మొత్తాన్ని రుణాలు చెల్లించడానికి కేటాయించాలి. ఇలా క్రమపద్ధతిలో లెక్కలు వేసుకుంటే అప్పుల భారం అంత భారంగా అనిపించదు. కొద్ది రోజుల్లో మనకు తెలియకుండానే అప్పులు వేగంగా తగ్గిపోతాయి
7. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే కొత్త రుణాలు తీసుకోండి:
మీరు అప్పులు చెల్లిస్తున్నప్పుడు, మళ్లీ కొత్త రుణాలు తీసుకోకండి. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటేనే లోన్ తీసుకోండి. లేదంటే అప్పుల భారం వల్ల అనవసర ఆలోచనలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుతం చాలా మంది యువకులు అప్పుల మీద అప్పులు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
COMMENTS