Does diabetes hurt? - If you take figs like this, it's normal to hit your stomach with sugar!
డయాబెటిస్ బాధిస్తోందా? - అంజీర్లను ఇలా తీసుకుంటే ఒంట్లో షుగర్ దెబ్బకు నార్మల్!
Anjeer Benefits in Telugu: ప్రస్తుతం మధుమేహం చిన్నాపెద్దా తేడా లేకుండా అందరినీ బాధిస్తోంది. ఇది ఒక్కసారి వస్తే ఇక జీవితాంతం మందులు తప్పక వాడాల్సిందే! అందుకే దీనిని నివారించుకునేందుకు చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే డయాబెటిస్‌ను కంట్రోల్లో ఉంచుకునేందుకు అంజీర్లను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ సమయంలో తింటే ఊహించని ఫలితాలు లభిస్తాయని అంటున్నారు. అంజీర్ ఎప్పుడు తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
మధుమేహం రోగులు అంజీర్ పండ్లను తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని వైద్యులు అంటున్నారు. అంజీర్ పండ్లలో పొటాషియం పోషకాలు ఎక్కువగా ఉంటాయని.. ఇందులో ఉండే క్లోరోజెనిక్ ఆమ్లం రక్తంలో చక్కెర స్థాయులను తగ్గించడంలో సహాయపడుతుందని అనేక అధ్యయనాలు నిరూపించాయని చెబుతున్నారు.
2019 Nutrition Research జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. రోజూ రెండు అంజీర్ పండ్ల తినడం వల్ల షుగర్(రిపోర్ట్) నియంత్రణలో ఉంటుందని కనుగొన్నారు. దీంతో పాటు అంజీర్లను తీసుకోవడం వల్ల గుండె సమస్యలు, క్యాన్సర్ లాంటి రోగాలు రాకుండా కాపాడుతాయని స్పష్టం చేస్తున్నారు. ఈ పరిశోధనలో Punjab Agricultural Universityలో Food Science and Technologyలో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రొఫెసర్ డాక్టర్ S. C. Sharma పాల్గొన్నారు.
ఈ ప్రయోజనాలు కూడా:
మలబద్ధకం సమస్య ఉన్నవారు: అంజీర్ పండ్లతో మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారు రోజూ పరగడుపునే నానబెట్టిన రెండు అంజీర్ పండ్లను తినాలని సూచిస్తున్నారు. ఇవి ప్రేగు కదలికలను సరిచేసి.. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయని వివరిస్తున్నారు. అలాగే, పొట్ట ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందని అంటున్నారు.
బరువు తగ్గేందుకు సాయం:
చాలా మంది బరువు తగ్గేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, అంజీర్ పండ్లలో పుష్కలంగా లభించే ఫైబర్.. బరువు తగ్గాలనుకునే వారికి ఉత్తమ ఆహారమని చెబుతున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో అంజీర్ పండ్లను తింటే బరువు తగ్గడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. అలా అని మరీ ఎక్కువగా తింటే బరువు పెరిగిపోతారని.. రోజుకు రెండుకు మించి తినకూడదని తెలుపుతున్నారు.
రక్తపోటు అదుపులో:
అంజీర్ పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తపోటు స్థాయులను సరిగ్గా ఉంచేలా సహాయపడతాయని వైద్యులు చెబుతున్నారు. అత్తి పండ్లను తినడం వల్ల శరీరంలో పెరిగిన ట్రైగ్లిజరైడ్ స్థాయిలు కూడా తగ్గుతాయని పేర్కొన్నారు. కరోనరీ ధమనుల్లో అడ్డంకులను నివారిస్తుందని.. ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని తెలిపారు.
హార్మోన్ అసమతుల్యత:
ప్రతిరోజూ పరగడపున అంజీర్ పండ్లను తినడం వల్ల హార్మోన్ల అసమతుల్యత సమస్య తొలగిపోతుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మెనోపాజ్ సమయంలో ఉన్న మహిళలు, రుతుక్రమ సమస్యలతో బాధపడే అమ్మాయిలు హార్మోన్ల అసమతుల్యత సమస్యల బారిన పడుతూ ఉంటారు. వారంతా కచ్చితంగా అంజీర్ పండ్లను తింటే మంచిదని సూచిస్తున్నారు.
ఎలా తీసుకోవాలి?:
రెండు అంజీర్లను రాత్రి నిద్రపోయే ముందు నీటిలో నానబెట్టాలి. వీలైతే వాటిలో బాదం, వాల్ నట్స్ కూడా వేసి నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని తినడం వల్ల పైన చెప్పిన ప్రయోజనాలు పొందవచ్చని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
COMMENTS