Discard ITR: Tax payers alert.. What is Discard ITR.. These benefits are for you..!
Discard ITR: ట్యాక్స్ పేయర్స్ అలర్ట్.. ఏమిటీ డిస్కార్డ్ ITR.. ఈ బెనిఫిట్స్ మీ కోసమే..!
పన్ను చెల్లింపుదారుల కోసం ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ‘డిస్కార్డ్ ITR’ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ఎలా ఉపయోగపడుతుంది, ఎలా వినియోగించుకోవచ్చో తెలుసుకుందాం.
ఆదాయ పన్ను శాఖ, పన్ను చెల్లింపుదారులు తమ బాధ్యతలను సులువుగా పూర్తి చేసే అవకాశాలను కల్పిస్తోంది. ఎలాంటి తప్పులు దొర్లకుండా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్(ITR) దాఖలు చేసేలా ప్రోత్సహిస్తోంది. ఒకవేళ ఏవైనా పొరపాట్లు దొర్లినా సరిదిద్దుకునే అవకాశాలు కల్పిస్తోంది. తాజాగా పన్ను చెల్లింపుదారుల కోసం డిస్కార్డ్ ITR అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ఎలా ఉపయోగపడుతుంది, ఎలా వినియోగించుకోవచ్చో తెలుసుకుందాం.
డిస్కార్డ్ ఐటీఆర్ ఫీచర్ ద్వారా పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసినా సరే వెరిఫైకాని ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్(ITR)లను పర్మినెంట్‌గా డిలీట్ చేయవచ్చు. ఒరిజినల్, బిలేటెడ్, రివైజ్డ్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌లను డిలీట్ చేసేందుకు ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు.
డిస్కార్డ్ రిటర్న్ అంటే ఏంటి?: ఫైల్ చేసిన ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌లో ఏవైనా లోపాలు, తేడాలు ఉన్నా లేదా మళ్లీ కొత్తగా ఐటీఆర్ ఫైల్ చేయాలన్నా ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుంది. ఇది రివైజ్డ్ రిటర్న్‌ను దాఖలు చేయడం కంటే భిన్నంగా ఉంటుంది. ఇప్పటికే సబ్మిట్ చేసిన ఐటీఆర్‌లో తప్పులను రివైజ్డ్ రిటర్న్ సరిదిద్దుతుంది. అయితే డిస్కార్డ్ రిటర్న్ ఆప్షన్ ఉపయోగిస్తే.. ప్రస్తుత ఐటీఆర్ పూర్తిగా డిలీట్ అవుతుంది, అసలు రిటర్న్ ఫైల్ చేయనట్లు చూపుతుంది.
డిస్కార్డ్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది: ముందు www.incometax.gov.in వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి. తర్వాత ఇ-ఫైల్ విభాగానికి వెళ్లాలి. ఇప్పుడు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్> ఇ-వెరిఫై ఐటీఆర్> డిస్కార్డ్ ఆప్షన్‌లు క్లిక్ చేయాలి. ఇక్కడ ఫీచర్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.
డిస్కార్డ్ ఆప్షన్ ఎన్ని సార్లు యూజ్ చేయవచ్చు?: ITR స్టేటస్ 'అన్‌వెరిఫైడ్' లేదా 'పెండింగ్ ఫర్ వెరిఫికేషన్'లో ఉంటే 'డిస్కార్డ్' ఆప్షన్ ఉపయోగించవచ్చు. స్టేటస్ 'వెరిఫైడ్' లేదా 'పెండింగ్ ఫర్ వెరిఫికేషన్'గా ఉంటే, ఎన్నిసార్లైనా డిస్కార్డ్ ఆప్షన్ ఉపయోగించవచ్చు.
అన్‌వెరిఫైడ్ ITRని డిస్కార్డ్ చేస్తే, తదుపరి ITRని కచ్చితంగా ఫైల్ చేయాలా?: అన్‌వెరిఫైడ్ రిటర్న్‌ను డిస్కార్డ్ చేస్తే, తదుపరి ITRని తర్వాత ఫైల్ చేయాలి. రిటర్న్ డేటాను ముందుగా అప్‌లోడ్ చేస్తే, ఆదాయ రిటర్న్‌ను ఫైల్ చేయాల్సి ఉంటుంది.
అసెస్‌మెంట్ ఇయర్ 2022-23కి ఫైల్ చేసిన ఐటీఆర్ వెరిఫికేషన్ పెండింగ్‌లో ఉంటే డిస్కార్డ్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందా? ఈ ఆప్షన్ అసెస్‌మెంట్ ఇయర్ 2023-24 నుంచి మాత్రమే అందుబాటులోకి వచ్చింది. సెక్షన్‌లు 139(1)/139(4)/139(5) (ప్రస్తుతం, సంబంధిత అసెస్‌మెంట్ ఇయర్ డిసెంబర్ 31 వరకు) కింద ITR ఫైల్ చేయడానికి పేర్కొన్న టైమ్ లిమిట్ గురించి తెలుసుకోవడం మంచిది.
అనుకోకుండా ITRని డిస్కార్డ్ చేస్తే ఏం చేయాలి?: ఒకసారి ఐటీఆర్ డిస్కార్డ్ అయితే, వెనక్కి తీసుకొచ్చే అవకాశం లేదు. అందుకే ఈ ఆప్షన్ ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఐటీ శాఖ సూచిస్తోంది. ఐటీఆర్‌ను డిస్కార్డ్ చేస్తే, పూర్తిగా డిలీట్ అయిపోతుంది. అసలు దాఖలు చేయనట్లు పరిగణిస్తారు.
COMMENTS