Car Offers: Discounts in lakhs on cars at the end of the year.. Super offers on these luxury models
Car Offers: ఇయర్ ఎండ్‌లో కార్లపై లక్షల్లో డిస్కౌంట్.. ఈ లగ్జరీ మోడళ్లపై సూపర్ ఆఫర్స్
మహీంద్రా కంపెనీ టాప్-రేటెడ్ మోడల్స్ ఎక్స్‌యూవీ 300(XUV300), ఎక్స్‌యూవీ400 (XUV400)లపై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది.
2023 సంవత్సరం ముగింపునకు వచ్చేశాం. మరి కొన్ని వారాల్లో ఈ ఏడాదికి బైబై చెబుతూ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకనున్నాం. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన కంపెనీలు ఇయర్ ఎండింగ్ ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. ఆటోమొబైల్ సంస్థలు కూడా సేల్స్ పెంచుకోవడానికి ఎంపిక చేసిన మోడల్స్‌పై బంపరాఫర్లను అందిస్తున్నాయి. తాజాగా మహీంద్రా కంపెనీ ఈ జాబితాలో చేరింది. సంస్థ పోర్ట్ ఫోలియోలోని టాప్-రేటెడ్ మోడల్స్ ఎక్స్‌యూవీ 300(XUV300), ఎక్స్‌యూవీ400 (XUV400)లపై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 400: కంపెనీ నుంచి అత్యధికంగా అమ్ముడైన మోడల్ XUV400. దీనిపై కస్టమర్లు ఇప్పుడు రూ.4.2 లక్షల వరకు ఆఫర్స్ పొందవచ్చు. కాంప్లిమెంటరీ ఎక్స్టెన్షన్ వారంటీ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్, కార్పొరేట్ డిస్కౌంట్స్‌తో పాటు అదనపు యాక్సెసరీస్ ప్రయోజనాలను పొందవచ్చు.
ఫీచర్స్: మహీంద్రా ఎక్స్‌యూవీ 400 వెహికల్ 1.5-లీటర్ GDI ఇంజిన్‌తో పని చేస్తుంది. యూరో-స్పెక్ వెర్షన్లో 1.5-లీటర్ GDI డైరెక్ట్-ఇంజెక్షన్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 7 సీటర్ కారు. ఇంటీరియర్ డిజైన్ XUV 500 మాదిరిగానే ఉంటుంది. ఫీచర్స్ కొంత ప్రీమియం ఎక్స్పీరియన్స్ అందిస్తాయి.
మహీంద్రా ఎక్స్‌యూవీ 300: ఈ మోడల్‌పై గరిష్టంగా రూ.1.72 లక్షల వరకు డిస్కౌంట్ ఉంది. డీజిల్ వెర్షన్లో భారీ ఆఫర్ ఉన్న టాప్ వేరియంట్ ఇదే కావడం గమనార్హం. ఎక్స్‌యూవీ 300 W6, ఎక్స్‌యూవీ 300 W4 వంటి తక్కువ స్పెక్స్ మోడల్స్‌పై రూ.1.4 లక్షల వరకు ఆఫర్ ఉంది. అంతేకాకుండా కంపెనీ XUV300 అన్ని వేరియంట్లపై ఇయర్ ఎండ్ ఆఫర్లను అందిస్తోంది. టర్బో, డీజిల్ యూనిట్లతో సహా మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ప్రయోజనాలను పొందేందుకు వినియోగదారులకు అవకాశం కల్పించింది.
అయితే ట్రిమ్స్, స్టాక్స్ లభ్యతపై ఆధారపడి, ఎంపిక చేసిన వేరియంట్లపై మాత్రమే ఆఫర్లు ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది. అధికారిక డీలర్‌షిప్‌ను లేదా కంపెనీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆఫర్స్ వివరాలపై పూర్తి సమాచారం పొందవచ్చు.
ఫీచర్స్: మహీంద్రా ఎక్స్‌యూవీ 300లో 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 115 బీహెచ్పీ బ్రేక్ హార్స్ పవర్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు 300 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 6-స్పీడ్ మ్యానువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ సిస్టమ్ ఉంటుంది. ఇంటీరియర్ డిజైన్‌లో భాగంగా డ్యుయల్ టోన్ క్యాబిన్, 7-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి.
మరికొన్ని మోడల్స్ పై ఆఫర్స్: హెచ్‌టీ ఆటో రిపోర్ట్ ప్రకారం.. మహీంద్రా బొలెరో, బొలెరో నియో, మారాజ్జో(Marazzo) వంటి మోడల్స్‌పై కంపెనీ ఇయర్ ఎండ్ ఆఫర్ ప్రకటిచినట్లు సమాచారం. ఈ మోడల్స్‌పై ₹3.50 లక్షల వరకు ఆఫర్ పొందవచ్చు. అయితే ఎక్స్‌యూవీ700, స్కారిపియో-ఎన్, స్కారిపియో క్లాసిక్, థార్ వంటి ఫ్లాగ్షిప్ మోడలపై కంపెనీ ఎలాంటి ఆఫర్స్ ప్రకటించలేదు.
COMMENTS