How much money can be kept in banks.. How much are most people keeping?
బ్యాంకుల్లో ఎన్ని డబ్బులు దాచుకోవచ్చు.. ఎక్కువ మంది ఎంత దాచుకుంటున్నారంటే?
FD News: మీరు బ్యాంకులో డబ్బులు దాచుకోవాలని చూస్తున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి. ఎంత కాలం ఉంచాలి.. వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి.. దేంట్లో ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి.. ఇలా దీనిపై మీకు ఒక అవగాహన వస్తే భవిష్యత్తులో డబ్బులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉంటారు.
Bank FDs: కొంతకాలంగా RBI రెపో రేట్లను పెంచుతున్న వేళ చాలా వరకు బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మీరు బ్యాంకులో డబ్బులు దాచుకోవాలని భావిస్తే ముందుగా చాలా విషయాలు తెలుసుకోవాలి. ఏ బ్యాంకులో వడ్డీ రేటు ఎంత ఉంది? మెచ్యూరిటీ సమయంలో చేతికి ఎంత వస్తుంది? వంటి అంశాలపై కన్నేయాలి. అలాగే పెనాల్టీలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. ఇలా బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేయాలనుకునేవారు పలు విషయాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇదే సమయంలో బ్యాంక్ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి.. బ్యాంక్ దివాలా తీస్తుందా? అంతా బానే ఉందా.. వంటి అంశాలను కూడా చెక్ చేసుకోవాలి. ఇక జనాలు ఎక్కువగా ఎంత మొత్తం బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటున్నారో కూడా తెలుసుకుందాం.
చాలా వరకు జనం బ్యాంకుల్లో రూ. 15 లక్షల లోపు డబ్బులను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారు. ఇంకా చాలా మంది ఏడాది నుంచి మూడేళ్ల వరకు టెన్యూర్‌తో డబ్బు దాచుకుంటున్నారని తెలిసింది. కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ రిపోర్ట్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
టర్మ్ డిపాజిట్స్ విషయంలో ఎక్కువగా పట్టణ ప్రాంతాలు, మెట్రోల్లోని వారే ఉన్నారు. మొత్తం FD ల్లో వీరి వాటానే 80 శాతం వరకు ఉంటుంది. 35 నుంచి 40 శాతం వరకు బ్యాంక్ డిపాజిట్లపై 7 శాతం నుంచి 8 శాతం వరకు వడ్డీ రేటు వస్తోంది. ఎక్కువ మంది మాత్రం రూ. లక్ష నుంచి 15 లక్షల రూపాయల వరకు డబ్బులు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు.
బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవాలని అనుకునే వారు మరో విషయం కూడా చెక్ చేసుకోవాలి. సాధారణంగా బ్యాంక్ డిపాజిట్లకు పూర్తి సెక్యూరిటీ ఉండదు. రిస్క్ ఉంటుందన్నమాట.
బ్యాంక్ దివాలా తీస్తే మన డబ్బులకు రక్షణ ఉండదు. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ స్కీం ఉంది. కానీ దీని ద్వారా పూర్తి డబ్బులు రావు. రూ. 5 లక్షల వరకు మాత్రమే వెనక్కి చెల్లిస్తుంటాయి. అంటే మీరు బ్యాంకులో రూ.10 లక్షలు పెట్టారనుకోండి ఆ సమయంలో బ్యాంక్ దివాలా తీస్తే మీ చేతికి గరిష్టంగా రూ. 5 లక్షలు మాత్రమే రావొచ్చు. అందుకే బ్యాంక్ స్థితిగతుల్ని తెలుసుకోవడం ఉత్తమం.
COMMENTS