PM Kisan: PM Kisan money does not go into the accounts of these farmers.. Make sure you are on the list!
PM Kisan: ఈ రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు పడవు.. లిస్ట్‌లో మీరున్నారేమో చూసుకోండి!
PM Kisan: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా లబ్ధి పొందుతున్న రైతులకు అలర్ట్. 15వ విడత నగదు బదిలీకి కేంద్రం సన్నద్ధమవుతోంది. అయితే, ఈసారి భారీగా లబ్ధిదారుల్లో కోత పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరెవరి ఖాతాల్లో డబ్బులు పడవో ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
PM Kisan: దేశంలోని రైతులకు బిగ్ అలర్ట్. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద లబ్ధి పొందుతున్న వారు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అలాగే ఈ స్కీమ్‌లో కొత్తగా చేరాలనుకునే వారు సైతం ఈ విషయాలను చెక్ చేసుకోవాలి. లేకుంటే తీరా సమయానికి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కాలేదని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కేంద్రంలోని ప్రధాని మోదీ నేతృత్వంలోని సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అందిస్తోంది. దీని ద్వారా అర్హత కలిగిన రైతులకు ప్రతి ఏటా రూ. 6 వేల చొప్పున మూడు విడతల్లో అంటే రూ. 2 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది.
పీఎం కిసాన్ పెట్టుబడి సాయం అనేది కొంత మందికి వర్తించదని గుర్తుంచుకోవాలి. అనర్హుల జాబితాలో డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్స్ వంటి వారికి పొలం ఉన్నా డబ్బులు రావు. ఆదాయపు పన్ను చెల్లించే వారికి కూడా భూమి ఉన్నా పీఎం కిసాన్ వర్తించదు. నెలకు రూ.10 వేలు లేదా ఆపైన పెన్షన్ తీసుకునే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా ఈ స్కీమ్ వర్తించదు. అలాగే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పదవిలో ఉన్నా లేదంటే మాజీ రాజకీయ నాయకులకు స్కీమ్ ద్వారా డబ్బులు రావు. మరోవైపు.. అన్ని అర్హతలు కలిగి ఉండి కూడా బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు వంటి వాటిల్లో వివరాలు తప్పుగా ఉన్నా కూడా పీఎం కిసాన్ డబ్బులు రావని గుర్తించాలి.
భార్యాభర్తల్లో ఇద్దరికీ వస్తాయా?
ఒకే ఇంట్లో భార్యాభర్తల పేరుపై పొలం ఉంటే కేవలం ఒకరికి మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు వస్తాయి. ఇద్దరికీ రావు. అలాగే పీఎం కిసాన్ పథకంలో ఉన్న వారు కచ్చితంగా ఇ-కేవైసీ పూర్తి చేసుకోవాలి. లేదంటే డబ్బులు రాకుండా నిలిచిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఆలస్యం చేయవద్దు. పీఎం కిసాన్ స్కీమ్‌లో కొత్తగా చేరాలని భావించే వారు పైన తెలిపిన లిస్ట్‌లో ఉన్నారేమో చెక్ చేసుకోవాలి. ఆ జాబితాలో ఉంటే వారికి రాదు. ఇప్పటికే వస్తున్నట్లయితే, వారి అకౌంట్ తొలగించే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఏటా లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోతుండడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
పీఎం కిసాన్ స్కీమ్ కింద ఇప్పటకే 14 విడతల డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసింది కేంద్రం. ఇప్పుడు 15 విడత డబ్బులు రావాల్సి ఉంది. నవంబర్ లేదా డిసెంబర్‌లో ఈ డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ కావొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. మరోవైపు.. ఈ సారి పెట్టుబడి సాయాన్ని రూ. 9 వేలకు పెంచే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే 15వ విడతలో రైతులకు రూ.3 వేల చొప్పున డబ్బులు జమ కానున్నాయి.
COMMENTS