Scholarships: Alert to students.. Apply for these scholarships soon..!
Scholarships: స్టూడెంట్స్‌కు అలర్ట్.. ఈ స్కాలర్‌షిప్స్ కోసం త్వరగా దరఖాస్తు చేసుకోండి..!
స్కూల్, కాలేజీ స్టూడెంట్స్‌కు అలర్ట్. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు విద్యార్థుల కోసం స్పెషల్ స్కాలర్‌షిప్స్ ప్రకటించాయి. వీటికి ఎంపికైన వారికి లక్షల రూపాయలు స్టైఫండ్ లభిస్తుంది. ఈ నిధులతో విద్యార్థులు మంచి కెరీర్‌పై దృష్టి పెట్టవచ్చు. క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేయవచ్చు. అయితే వీటికి అప్లై చేసుకునేందుకు గడువు త్వరలోనే ముగియనుంది. అందుకే సాధ్యమైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవడం మంచిది. ఈ లిస్ట్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్ ఏవో చూద్దాం.
రామన్ కాంత్ ముంజాల్ స్కాలర్‌షిప్ 2023
హీరో ఫిన్‌కార్ప్ సంస్థ మద్దతుతో రామన్ కాంత్ ముంజాల్ ఫౌండేషన్, ‘రామన్ కాంత్ ముంజాల్ స్కాలర్‌షిప్స్’ అందిస్తోంది. ఫైనాన్స్ కోర్సులు చదివే విద్యార్థులు ప్రఖ్యాత కాలేజీల్లో అడ్మిషన్లు పొందేందుకు, ఈ రంగంలో సెటిల్ అయ్యేందుకు ఈ స్కాలర్‌షిప్ సపోర్ట్ చేస్తుంది. BBA, BFIA, B.Com, BMS, IPM, BA ఎకనామిక్స్, BBS, BBI, BAF, B.Sc స్టాటిస్టిక్స్ వంటి ఫైనాన్స్ డిగ్రీ కోర్సులు మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు.దరఖాస్తుదారులు 10 & 12 తరగతుల పరీక్షల్లో కనీసం 80% మార్కులు సాధించి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.4 లక్షల కంటే తక్కువగా ఉండాలి. రామన్ కాంత్ ముంజాల్ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు 3 సంవత్సరాల పాటు ఏటా రూ.5,00,000 వరకు స్టైఫండ్ లభిస్తుంది. దీనికి అప్లై చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15. అర్హత ఉన్నవారు www.b4s.in/it/RMKSP1 పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
విర్చో స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2023
విర్చో స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ (Virchow Scholarship) ప్రోగ్రామ్ కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన, వెనుకబడిన వర్గాల బాలికలకు స్టైఫండ్ అందజేస్తారు. 10 లేదా 12వ తరగతి పాస్ అయ్యి, ప్రస్తుతం 11వ తరగతి లేదా ప్రభుత్వ కాలేజీల్లో గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం చదువుతున్న తెలుగు రాష్ట్రాల బాలికలు మాత్రమే దీనికి అర్హులు. అయితే దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల కంటే తక్కువగా ఉండాలి. విర్చో స్కాలర్‌షిప్‌కు ఎంపికైన వారికి సంవత్సరానికి రూ.15,000 వరకు స్టైఫండ్ అందుతుంది. అర్హత ఉన్నవారు సెప్టెంబర్ 15 వరకు www.b4s.in/it/VISC3 పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
LIC HFL విద్యాధన్ స్కాలర్‌షిప్ 2023
LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ LIC HFL విద్యాధన్ స్కాలర్‌షిప్ ఆఫర్ చేస్తోంది. అల్ప ఆదాయ వర్గాలకు చెందిన విద్యార్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం 11వ తరగతి, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం (2023-24 విద్యా సంవత్సరంలో) చదువుతున్న విద్యార్థులు ఈ స్కీమ్‌కు అర్హులు. అయితే స్టూడెంట్స్ తమ మునుపటి అర్హత పరీక్షలో 60% కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3,60,000 కంటే ఎక్కువ ఉండకూడదు. ఎంపికైన వారికి సంవత్సరానికి రూ.25,000 వరకు స్టైఫండ్ అందుతుంది. అర్హత ఉన్నవారు www.b4s.in/it/LHVC11 పోర్టల్‌లో ఆన్‌లైన్ మోడ్‌లో అప్లై చేసుకోవచ్చు.
COMMENTS