Loan: If the person who took the loan dies.. won't even the rupee be paid? What are the rules?
Loan: అప్పు తీసుకున్న వ్యక్తి చనిపోతే.. రూపాయి కూడా కట్టక్కర్లేదా? రూల్స్ ఎలా ఉన్నాయంటే?
Loan: ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు అనేక రకాల అప్పులు తీసుకుంటారు. ఇల్లు కొనేందుకని, కారు కొనేందుకని, చదువుల కోసమని బ్యాంకుల్లో లోన్ తీసుకుంటారు. ప్రజలకు వ్యక్తిగత రుణ సౌకర్యాన్ని అందిస్తాయి ఫైనాన్షియల్ సంస్థలు ఈ రుణాలపై వడ్డీ వసూలు చేస్తాయి. రుణ గ్రహీత ఈఎంఐ రూపంలో తిరిగి చెల్లిస్తారు. ఇక్కడి వరకు సరిగానే ఉన్నా ఒక వేళ ఇలా లోన్ తీసుకున్న వ్యక్తి బకాయిలు పూర్తిగా చెల్లించకముందే మరణిస్తే ఆ రుణ బాధ్యత ఎవరిది? మిగిలిన బకాయి రుణ మొత్తాన్ని ఎవరు చెల్లిస్తారు? అనే విషయాలను ఓసారి మనం పరిశీలిద్దాం.
అప్పు తీసుకున్న వ్యక్తి మరణించిన సందర్భంలో ఎవరు తిరిగి చెల్లించాలి అనేది ఆ రుణం రకం, దానిపై ఉన్న తాకట్టు ఏమిటో నిర్ణయిస్తుంది. పర్సనల్ లోన్, హోమ్ లోన్, కారు లోన్ లేదా క్రెడిట్ కార్డు విషయంలో ఇది భిన్నంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. గృహ రుణం విషయానికి వస్తే అప్పు తీసుకున్న వ్యక్తి మరణించిన సందర్భంలో మిగిలిన రుణాన్ని అతని వారసులు చెల్లించాల్సి ఉంటుంది. అతను రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించలేని పక్షంలో బ్యాంకులు వారి డబ్బులు తిరిగి తీసుకునేందుకు ఆస్తినివ వేలం వేస్తాయి. మరోవైపు.. గృహ రుణంపై ఇన్సూరెన్స్ చేయింటినట్లయితే బీమా కంపెనీల ద్వారా రివకరీ చేస్తుంటాయి. అలాగే లోన్ ఉమ్మడిగా ఇద్దరి పేరుపై తీసుకున్నట్లయితే ఒకరు మరణిస్తే మరో వ్యక్తి ఆ లోన్ మొత్తం చెల్లించాలి.
కారు లోన్ అంశంలో బ్యాంకులు రుణ గ్రహీత కుటుంబ సభ్యులను సంప్రదిస్తాయి. రుణ గ్రహీతకు చట్టబద్ధమైన వారసుడు ఉంటే అతను కారును ఉంచాలనుకుంటే బకాయిలు చెల్లించాలి. లేదా బ్యాంకు కారును జప్తు చేసి బకాయిలను రికవరీ చేయడానికి విక్రయిస్తుంది. పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు లోన్లకు ఎలాంటి పూచీకత్తు ఉండదు. దీని కారణంగా బ్యాంకులు చట్టపరమైన వారసులు లేదా కుటుంబ సభ్యుల నుంచి బకాయి ఉన్న మొత్తాన్ని తిరిగి పొందలేవు. సహా రుణ గ్రహీత ఉంటే అతను ఈ రుణాన్ని తిరిగి చెల్లించాలి. అయితే, ఇది జరగకపోతే బ్యాంకు దానిని ఎన్‌పీఏగా ప్రకటిస్తుంది. అంటే అది నిరర్ధక ఆస్తిగా పరిగణనించి రైట్ ఆఫ్ చేస్తుంది. కానీ, చట్టబద్ధమైన వారసులు ఉన్నప్పుడు వారి నుంచి వసూలు చేసేందుకే బ్యాంకులు ప్రయత్నిస్తుంటాయి. అందుకు వీలు కానప్పుడు మాత్రమే ఆయా లోన్లను రైట్ ఆఫ్ గా ప్రకటిస్తాయి. బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు దాదాపుగా ఇదే ప్రక్రియను ఫాలో అవుతుంటాయి.
COMMENTS