Credit Card: How much money can be drawn with a credit card? Will there be charges if I do it under the limit?
Credit Card: క్రెడిట్ కార్డుతో ఎంత మనీ డ్రా చేయొచ్చు? లిమిట్ లోపు చేస్తే ఛార్జీలు ఉండవా?
Credit Card: మన దేశంలో ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డుల వాడకం పెరిగింది. డెబిట్ కార్డుల లావాదేవీల కంటే క్రెడిట్ కార్డుల ద్వారా చేసినవే ఎక్కువగా ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ సైతం వెల్లడించింది. క్రెడిట్ కార్డుతో వస్తువులను కొనుగోలు చేయొచ్చు. వివిధ సేవలకు ఆన్‌లైన్ ద్వారా పేమెంట్స్ చేయొచ్చు. ఇదే కాకుండా క్రిడెట్ కార్డుతో ఏటీఎంలో నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే, ఇలా ఏటీఎంలో నగదు విత్ డ్రా చేసుకుంటే ఎలాంటి నిబంధనలు, ఛార్జీలు, ఉంటాయో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎంత లిమిట్ ఉంటుంది. లిమిట్ లోపు డ్రా చేస్తే ఛార్జీలు చెల్లించక్కర్లేదా? అనే విషయాలను తెలుసుకుందాం.
విత్ డ్రా ఎంత?:
చాలా బ్యాంకు మీ క్రెడిట్ కార్డు పరిమితిలో 40 శాతం వరకు నగదు విత్ డ్రాకు అనుమతిస్తాయి. మీ క్రెడిట్ కార్డు పరిమితి రూ. 5 లక్షలు ఉందనుకుంటే మీరు ఏటీఎం నుంచి రూ. 1-2 లక్షల వరకు నగతు ఉపసంహరణ చేసుకోవచ్చు. మిగిలిన క్రెడిట్ పరిమితిని కార్డు ఆధారిత ట్రాన్సాక్షన్లకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది.
ఛార్జీలు ఎలా ఉంటాయి?:
క్రెడిట్ కార్డు ద్వాహా నగదు విత్ డ్రా చేసినట్లయితే బ్యాంకులు ట్రాన్సాక్షన్ ఛార్జీలు వసూలు చేస్తుంది. ఇది మీరు విత్ డ్రా చేసిన నగదుపై 2.5 శాతం నుంచి 3 శాతం వరకు ఉంటుంది. మీరు క్రెడిట్ కార్డుతో రూ. 1 లక్ష డ్రా చేసుకుంటే మీరు రూ. 3 వేల వరకు ఛార్జీలు చెల్లించాల్సి రావచ్చు.
వడ్డీ:
క్రెడిట్ కార్డు ద్వారా నగదు విత్ డ్రా చేసినట్లయితే మీరు డబ్బులు తీసుకున్న రోజు నుంచి తిరిగి చెల్లించే వరకు బ్యాంకులు వడ్డీ వసూలు చేస్తుంటాయి. ఈ వడ్డీ రేటు బ్యాంకును బట్టి మారుతుంటుంది. ఈ ఛార్జీలు వార్షికంగా 30 నుంచి 40 శాతం వరకు ఉండొచ్చు.
క్రెడిట్ స్కోరుపై ప్రభావం:
ఏటీఎంలో నగదు విత్ డ్రా చేసుకోవడాన్ని బ్యాంకులు నగదు విత్ డ్రా క్రెడిట్ గా పరిగణిస్తాయి. దీంతో క్రెడిట్ వినియోగ నిష్పత్తి పెరిగి దీని ప్రభావం క్రెడిట్ స్కోరుపై పడుతుంది. సమయానికి తిరిగి చెల్లించలేకపోతే ఆలస్య రుసుములతో పాటు, క్రెడిట్ స్కోరు పతనమయ్యే అవకాశం ఉంటుంది.
అత్యవసరమైతేనే:
అత్యవసర పరిస్థితుల్లో వేర్ అవకాశం లేదు అనుకున్నప్పుడు మాత్రమే మీరు క్రెడిట్ కార్డు ద్వారా ఏటీఎంలో నగదును విత్ డ్రా చేసుకోవాలి. అత్యవసర సమయంలో ఈ సేవలు ఉపయోగపడతాయని చెప్పొచ్చు. అయితే, మీరు తీసుకున్న డబ్బులు గడువు లోపు తిరిగి చెల్లించేలా చూసుకోవాలి. లేదంటే ఆలస్యపు రుసుముల భారం పెరుగుతుంది. ఛార్జీల మోత మోగిపోతుంది.
COMMENTS