Awesome scheme from SBI.. More profit for customers.. Chance till August 15!
SBI నుంచి అద్భుత స్కీం.. కస్టమర్లకు ఎక్కువ లాభం.. ఆగస్ట్ 15 వరకే ఛాన్స్!
SBI Amrit Kalash Deposit: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఎన్నో స్పెషల్ స్కీమ్స్ అందిస్తున్న విషయం తెలిసిందే. వీటిల్లో ఒక స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం అమృత్ కలశ్ అత్యధిక వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఇక ఇది ఆగస్టు 15నే ముగియనుంది. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం.
SBI Schemes: ఎస్‌బీఐ తన కస్టమర్ల కోసం ఎప్పుడూ కొత్త కొత్త పథకాలు ప్రారంభిస్తుంటుంది. వాటిల్లోనే కొన్ని పాపులర్ స్కీమ్స్ ఉంటాయి. ఇక ఇటీవలి కాలంలో చాలా బ్యాంకులు ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల్ని లాంఛ్ చేస్తున్నాయి. వీటిల్లో ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రభుత్వ రంగానికి చెందిన ఎస్‌బీఐ కూడా స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్స్ తీసుకొచ్చాయి. ఇక వీటిల్లో సాధారణ FD పథకాలతో పోలిస్తే ఎక్కువ వడ్డీ వస్తుంది. అలాంటి ఒక స్కీమ్ ఎస్‌బీఐ అమృత్ కలశ్ డిపాజిట్ స్కీమ్. ఈ పథకం గడువు ఇప్పటికే ముగియాల్సి ఉండగా.. మరోసారి పొడిగించింది కూడా. దీంతో కస్టమర్లకు దీంట్లో చేరేందుకు మరికొన్ని రోజులు అవకాశం లభించింది.
తొలుత ఎస్‌బీఐ అమృత్ కలశ్ డిపాజిట్ స్కీమ్ 2023, మార్చి 31 వరకే ఉంటుందని ప్రకటించింది. తర్వాత కొద్ది రోజుల వరకు ఈ స్కీం అందుబాటులో లేదు. కస్టమర్ల నుంచి విశేష స్పందన వచ్చిన ఈ పథకాన్ని ఏప్రిల్‌లో మళ్లీ తీసుకొచ్చింది. తర్వాత 2023, జూన్ 30 వరకు గడువు పొడిగించింది. ఆ తర్వాత మళ్లీ గడువును ఆగస్టు 15 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత మళ్లీ పొడిగిస్తుందో లేదో తెలియదు.
ఇక ఈ స్కీం విషయానికి వస్తే గడువు మొత్తం 400 రోజులుగా ఉంది. ఇందులో సాధారణ ప్రజలకు 7.1 శాతం, సీనియర్ సిటిజెన్లకు 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. సాధారణ FD స్కీమ్స్‌లో దీని కంటే తక్కువ వడ్డీ వస్తుంది. ఇండియన్ సిటిజెన్లు సహా NRI కస్టమర్లకు కూడా ఈ పథకం అందుబాటులో ఉంది. SBI సీనియర్ సిటిజెన్ల కోసం మరో ప్రత్యేక FD స్కీమ్ SBI WE CARE FD ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంట్లో కూడా అత్యధిక వడ్డీ అందుతోంది.
ఇక భారతీయ స్టేట్ బ్యాంక్‌లో ఇతర సాధారణ వడ్డీ రేట్ల విషయానికి వస్తే 7 రోజుల నుంచి 45 రోజుల వరకు సాధారణ పౌరులకు 3 శాతం, సీనియర్ సిటిజెన్లకు 3.5 శాతం వడ్డీ వస్తుంది. 46 నుంచి 179 రోజుల వ్యవధి ఉన్న FD ళపై సాధారణ ప్రజలకు 4.5 శాతం, సీనియర్ సిటిజెన్లకు 5 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక ఏడాది నుంచి రెండేళ్ల వ్యవధి ఉన్న FDపై సీనియర్ సిటిజెన్లకు 7.3 శాతం, ఇతరులకు 6.8 శాతం వడ్డీ వస్తుంది. రెండు నుంచి మూడేళ్ల వ్యవధి ఉన్న ఎఫ్‌డీపై సాధారణ ప్రజలకు 7 శాతం, సీనియర్ సిటిజెన్లకు 7.5 శాతం వడ్డీ అందుతోంది.
COMMENTS