HDFC Bank: HDFC Bank's key announcement.. Good news for customers!
HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక ప్రకటన.. కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త!
HDFC UPI: భారతదేశంలో దిగ్గజ బ్యాంకుగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) తన కస్టమర్లకు శుభవార్త తీసుకొచ్చింది. కొత్త సేవల్ని ప్రవేశపెట్టింది. ఈ నిర్ణయంతో చాలా మంది కస్టమర్లకు ఊరట కలుగుతుందని చెప్పొచ్చు. ఇంటర్ ఆపరబులిటీ సేవల్ని తాజాగా లాంఛ్ చేసింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI), సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ మధ్య ఇప్పుడు ఇంటర్ ఆపరబులిటీ సర్వీసులు లాంఛ్ చేసింది. ఇలాంటి సేవల్ని దేశంలో ప్రవేశపెట్టిన తొలి బ్యాంక్‌గా నిలిచింది హెచ్‌డీఎఫ్‌సీ.
CBDC పైలెట్ ప్రోగ్రామ్ కింద బ్యాంక్ ఇప్పటికే లక్ష మంది కస్టమర్లను.. 1.7 లక్షల మంది వరకు మర్చంట్లను ఇందులో రిజిస్టర్ చేసింది. ఇకపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లు.. వారి CBDC వాలెట్ డబ్బుల్ని యూపీఐ క్యూఆర్ కోడ్‌తో కూడా ఉపయోగించుకోవచ్చు. వివిధ రకాల QR కోడ్స్‌ను స్కాన్ చేయాల్సిన పని కూడా లేదు. మర్చంట్లు కూడా ప్రస్తుత క్యూఆర్ కోడ్స్ మార్చాల్సిన అవసరం లేదు. ఒక క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంచొచ్చు.
ఇంటర్ ఆపరబులిటీ UPI QR Code వల్ల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మర్చంట్స్ (CBDT ప్లాట్‌ఫాంలో రిజిస్టర్ అయిన వారు) కస్టమర్స్ దగ్గర్నుంచి పేమెంట్స్ డిజిటల్ రూపీ కరెన్సీ రూపంలో స్వీకరించొచ్చు. దీంతో CBDC రోజువారీ వినియోగం పెరుగుతూ వస్తుందని చెప్పొచ్చు. దిల్లీ, భువనేశ్వర్, ముంబయి, చండీగఢ్, అహ్మదాబాద్, బెంగళూరు, గుహవాటి, గ్యాంగ్‌టక్ సహా పలు ప్రాంతాల్లో డిజిటల్ రూపీ సేవలు అందించనుంది.
ఇక ఇప్పుడు చాలా ముందు చూపుతో తీసుకొచ్చిన ఈ సర్వీసులతో చాలా మందికి ఊరట దక్కుతుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ టెక్నాలజీ అండ్ డిజిటల్ బ్యాంకింగ్, పేమెంట్స్ కంట్రీ హెడ్ పరాగ్ రావు తెలిపారు. 2022 నవంబర్ 1 నుంచే.. RBI హోల్‌సేల్ మార్కెట్లలో CBDC సర్వీసుల్ని పైలెట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించింది. రిటైల్ మార్కెట్లో డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి వచ్చాయి.
COMMENTS