SBI PPF Account: PPF account in SBI.. Apply online easily like this.. This is the scheme that makes millionaires!
SBI PPF Account: ఎస్‌బీఐలో పీపీఎఫ్ అకౌంట్.. ఆన్‌లైన్‌లో ఇలా ఈజీగా అప్లై చేయండి.. కోటీశ్వరుల్ని చేసే స్కీం ఇదే!
SBI PPF Account: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందినది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అని చెప్పొచ్చు. దీని లాకిన్ పీరియడ్ 15 సంవత్సరాలు. ఆ తర్వాత కూడా 5 సంవత్సరాల చొప్పున పెంచుకుంటూ పోవొచ్చు. ఎవరైనా వ్యక్తి గానీ.. మైనర్ పేరిట గానీ ఖాతాను తెరవొచ్చు. రూ. 100 డిపాజిట్‌తో పోస్టాఫీస్ లేదా బ్యాంకుల్లో ఈ అకౌంట్ తెరవొచ్చు. ఇక ఏడాదికి కనిష్టంగా రూ.500 వరకు, గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. ప్రస్తుతం పీపీఎఫ్ ఖాతాపై 7.1 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది. ఇక వడ్డీని ప్రతి 3 నెలలకు ఒకసారి జమ చేస్తుంటుంది.
అయితే ప్రభుత్వ మద్దతు ఉన్న ఈ పీపీఎఫ్ అకౌంట్‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎలా తెరవొచ్చు. బ్యాంక్‌కు వెళ్లకుండానే ఇంటి దగ్గర్నుంచే ఆన్‌లైన్‌లో ఈ ప్రక్రియ పూర్తి చేయొచ్చు. దీని కోసం మీ ఆధార్ నంబర్‌కు మీ SBI సేవింగ్స్ అకౌంట్ కచ్చితంగా అనుసంధానమై ఉండాలి. ఇంకా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్.. ఆధార్‌తో లింక్ అయి ఉండాలి. ఫోన్ నంబర్‌కు OTP యాక్టివేషన్ కూడా ఉండాలి. ఇవి ఉంటే.. మీరు SBI లో పీపీఎఫ్ ఖాతా ఓపెన్ చేయొచ్చు.
ఖాతా ఎలా తెరవాలంటే?
- తొలుత ఎస్‌బీఐ వెబ్‌సైట్.. www.onlinesbi.com లింక్ ద్వారా SBI ఆన్‌లైన్ అకౌంట్లో లాగిన్ కావాలి.
- లాగిన్ తర్వాత కుడివైపు పైనున్న 'Request and Enquiries' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అందులో డ్రాప్‌డౌన్ మెనూలో 'New PPF Accounts' లింక్ ఎంచుకోవాలి.
- దాంట్లో మీ పేరు, అడ్రస్, పాన్ కార్డ్ నంబర్, CIF నంబర్ స్క్రీన్‌పై చూయిస్తుంది.
- మైనర్ తరఫున అడల్ట్ ఖాతా తెరుస్తున్నట్లయితే.. కింద కనిపిస్తున్న బాక్స్‌లో టిక్ చేయాలి.
- మైనర్ కానట్లయితే.. మీరు ఏ బ్రాంచ్‌లో PPF అకౌంట్ తెరవాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్ పేరు, కోడ్ ఎంటర్ చేయాలి.
- దీంతో పాటు కనీసం ఐదుగురి నామినీల వివరాలు ఎంటర్ చేయాలి.
- వివరాలు ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ ఎంచుకోగానే.. కన్ఫర్మేషన్ డైలాగ్ బాక్స్ ఒకటి స్క్రీన్‌పై కనిపిస్తుంది. కన్ఫర్మ్ చేశాక.. మీ రిఫరెన్స్ నంబర్ కనిపిస్తుంది.
- మీరు ఆ రిఫరెన్స్ నంబర్ గుర్తుంచుకోవాలి. ప్రింట్ పీపీఎఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఆప్షన్ క్లిక్ చేసి.. మీ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- ఇక మీ ఫొటోలు, కేవైసీ డాక్యుమెంట్లతో పాటు మీరు డౌన్‌లోడ్ చేసిన ఫాం తో 30 రోజుల్లోగా మీ దగ్గర్లో ఉన్న బ్రాంచ్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ఈ స్కీంతో కోటీశ్వరులు ఎలాగంటే?
ఒక వ్యక్తి 30 ఏళ్ల వయసులో పీపీఎఫ్ అకౌంట్ తెరిస్తే.. లాకిన్ పీరియడ్ 15 సంవత్సరాలు కాగా.. మరో మూడు దఫాలు ఐదేళ్ల చొప్పున పొడగిస్తే అప్పుడు మొత్తం డిపాజిట్ సంవత్సరాలు 30 ఏళ్లు అవుతుంది. గరిష్టంగా సంవత్సరానికి రూ.1.50 లక్షల చొప్పున 30 ఏళ్లు కడితే మీ ఇన్వెస్ట్‌మెంట్ రూ.45,00,000. ప్రస్తుతం ఉన్న 7.10 శాతం వడ్డీ లెక్కన మెచ్యూరిటీ కల్లా ఇది రూ.1.54 కోట్లు అవుతుంది. ఇక్కడ వడ్డీ రూపంలోనే సుమారు రూ.1.10 కోట్లు వస్తుందన్నమాట. ఏడాదికి రూ.1.50 లక్షలు కట్టాలనేం లేదు. తక్కువలో కూడా కట్టొచ్చు. కానీ లాభం కాస్త తక్కువ ఉంటుంది. మీ సేవింగ్స్‌ను బట్టి డిపాజిట్ చేయొచ్చు. ఇక ప్రభుత్వం వడ్డీ రేట్లు పెంచితే గనుక అధిక లాభం వస్తుంది.
COMMENTS