SBI: Good news for customers.. SBI has two good news at once.. Chance till August 31.. Hurry up!
SBI: కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఎస్‌బీఐ ఒకేసారి రెండు శుభవార్తలు.. ఆగస్టు 31 వరకే ఛాన్స్.. త్వరపడండి!
SBI: మీరు హోం లోన్ కోసం చూస్తున్నారా? మరి వడ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎలా ఉన్నాయో చూశారా? ప్రభుత్వ బ్యాంక్ అయిన ఎస్‌బీఐ ఇప్పుడు హోం లోన్ తీసుకునేవారికి రెండు శుభవార్తలు అందించింది. హోం లోన్ ప్రాసెసింగ్ ఫీజులో రాయితీ, ఇంకా 50 నుంచి 100 శాతం వరకు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక్కడ ఈ రాయితీ అనేది రెగ్యులర్ హోం లోన్, ఫ్లెక్సీపే, ఎన్‌ఆర్‌ఐ, నాన్- శాలరీడ్, ప్రివిలేజ్, అపాన్ ఘర్ ఇలా వీటన్నింటిపై వర్తిస్తుందని వెల్లడించింది. ఇక హోం లోన్లపై ఈ ప్రాసెసింగ్ ఫీజు రాయితీ, మాఫీ అనేది 2023, ఆగస్టు 31 వరకు అమల్లో ఉంటుందని బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.
ఈ రోజుల్లో బ్యాంకుల్లో లోన్లన్నింటిపై ప్రాసెసింగ్ ఫీజు అనేది ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇది చాలావరకు మనం లోన్ తీసుకునే మొత్తంలో ఒకటి నుంచి రెండు శాతం వరకు ఉంటుంది. ఇది బ్యాంకులను బట్టి మారుతుందని గ్రహించొచ్చు.
ఎస్‌బీఐ హోం లోన్ వెబ్‌సైట్ ప్రకారం.. హోం లోన్ అండ్ టాప్ అప్స్‌పై కార్డు రేటుపై 50 శాతం వరకు ప్రాసెసింగ్ మాఫీ ఉంటుందని పేర్కొంది. ఇక ఇది కనిష్టంగా రూ.2000 వరకు.. గరిష్టంగా రూ. 5 వేల వరకు ఉండొచ్చని తెలిపింది SBI. అదనంగా GST మాత్రం పడుతుందని స్పష్టం చేసింది. ఇక టేకోవర్స్, రీసేల్ అండ్ రెడీ టూ మూవ్ ప్రాపర్టీలపై 100 శాతం ప్రాసెసింగ్ మాఫీ ఉంటుందని బ్యాంక్ వెల్లడించింది. ఇదే సమయంలో ఇన్‌స్టా హోం టాప్ అప్, రివర్స్ మార్టగేజ్, EMD లపై ప్రాసెసింగ్ ఫీజు మాఫీ లేదు.
SBI లో ప్రస్తుతం లోన్ అమౌంట్ మొత్తంపై ప్రాసెసింగ్ ఫీజు అనేది 0.35 శాతం ప్లస్ జీఎస్టీగా ఉండేది. కనిష్టంగా ఇది రూ.2000 ప్లస్ జీఎస్టీ, గరిష్టంగా రూ.10 వేలు ప్లస్ జీఎస్టీ కాగా.. ఇప్పుడు తగ్గింపు ప్రయోజనంతో చాలా మంది లబ్ధి చేకూరనుంది. తగ్గింపును సిబిల్ స్కోరు ఆధారంగా నిర్ణయించింది. ఇక్కడ 750-800 మధ్య సిబిల్ స్కోరు ఉంటే రాయితీ లేకుంటే వడ్డీ రేటు 9.15 శాతం .. రాయితీతో అయితే 8.70 శాతానికి లభిస్తుంది. ఇక్కడ 45 బేసిస్ పాయింట్ల మేర రాయితీ ఉందన్నమాట.
అదే విధంగా సిబిల్ స్కోరు 700-749 మధ్య ఉంటే 55 బేసిస్ పాయింట్ల మేర రాయితీ లభిస్తుంది. ప్రస్తుతం ఇది 9.35 శాతంగా ఉండగా.. కన్సీషన్‌తో 8.80 శాతానికే లభించనుంది. సిబిల్ స్కోరు 650-699 మధ్య ఉంటే హోం లోన్ గ్రహీతలకు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు రాయితీ ఉండదు. అంతకుముందు ఎస్‌బీఐ.. ఎంసీఎల్‌ఆర్ రేట్లను 5 బేసిస్ పాయింట్ల మేర పెంచింది.
COMMENTS