Small Savings Schemes: Saving in Post Office Scheme? Know this new rule
Small Savings Schemes: పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో పొదుపు చేస్తున్నారా? ఈ కొత్త రూల్ తెలుసుకోండి
Small Savings Schemes | పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో పొదుపు చేస్తున్నవారికి అలర్ట్. ఇటీవల ఓ కొత్త రూల్ అమలులోకి వచ్చింది. ఆ రూల్ గురించి తెలుసుకోండి.
1. కేంద్ర ప్రభుత్వం ఇటీవల చిన్న మొత్తాల పొదుపు పథకాల (Small Savings Schemes) వడ్డీ రేట్లను పెంచింది. దీంతో ఈ పథకాలు ఆకర్షణీయంగా మారాయి. ఎలాంటి రిస్క్ ఉండదు కాబట్టి అధిక వడ్డీ రేట్లు (Interest Rates) ఇచ్చే చిన్న పొదుపు పథకాలు ఆకర్షణీయంగా మారాయి.
2. అయితే, మనీలాండరింగ్, టెర్రరిస్ట్-ఫైనాన్సింగ్ కార్యకలాపాలను నిరోధించడానికి ఈ పథకాలలో పెట్టుబడి పెట్టే వ్యక్తులపై ఒక కన్నేసి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇండియా పోస్ట్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు నో యువర్ క్లైంట్ (KYC) ప్రక్రియను పూర్తి చేయడానికి అవసరమైన డాక్యుమెంటేషన్‌ను పూర్తి చేయాలని ఇటీవల సర్క్యులర్‌లో జారీ అయింది.
3. ఈ సర్క్యులర్ ప్రకారం ఇండియా పోస్ట్‌లో ఖాతాలను కలిగి ఉన్న కస్టమర్లను మూడు విభాగాలుగా గుర్తిస్తారు. అందులో లో రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్ అని ఉంటాయి. రూ.50,000 వరకు మెచ్యూరిటీ విలువ కలిగిన సర్టిఫికెట్లు కలిగి ఉండటం లేదా పొదుపు ఖాతాలలో ప్రస్తుతం ఉన్న బ్యాలెన్స్ రూ.50,000 మించకుండా ఉన్నవారిని తక్కువ రిస్క్ కేటగిరీగా గుర్తిస్తారు.
4. ఇక రూ.50,000 నుండి రూ.10 లక్షల వరకు పెట్టుబడులు ఉన్నవారు మీడియం రిస్క్ కేటగిరీలో ఉంటారు. రూ.10 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టేవారు హై-రిస్క్ కేటగిరీలో ఉంటారు. మూడు కేటగిరీల్లో పెట్టుబడిదారులు రెండు పాస్‌పోర్ట్-సైజ్ ఫోటోగ్రాఫ్‌లు, ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ సమర్పించాలి. అడ్రస్ ప్రూఫ్ కూడా తప్పనిసరి. అడ్రస్ ప్రూఫ్ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్, యుటిలిటీ బిల్స్ లాంటి డాక్యుమెంట్స్ ఏవైనా సమర్పించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. జాయింట్ అకౌంట్ హోల్డర్ల విషయంలో కూడా ప్రతీ ఇన్వెస్టర్ కేవైసీ పూర్తి చేయాలి. అధిక-రిస్క్ కేటగిరీ పెట్టుబడిదారుల కోసం, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, ఆదాయపు పన్ను రిటర్న్‌లు, వారసత్వ ధృవీకరణ పత్రాలు, బహుమతులు లేదా సేల్ డీడ్‌లు, వీలునామాలు, ఆదాయాన్ని ప్రతిబింబించే ఏదైనా పత్రాలను రుజువుగా అందించడం తప్పనిసరి.
6. డిపాజిటర్ మైనర్ అయితే సంరక్షకుడి కేవైసీ, ఇన్‌కమ్ ప్రూఫ్ అవసరం. లో రిస్క్ కేటగిరీలోని వారు ప్రతీ ఏడేళ్లకు, మీడియం రిస్క్‌లోని వారు ప్రతీ ఐదేళ్లకు, హై రిస్క్ కేటగిరీల్లోని వారు ప్రతీ రెండేళ్లకు కేవైసీని మళ్లీ సమర్పించాలి. ఇప్పటికే ఉన్న ఇండియా పోస్ట్ డిపాజిట్‌దారులు 2023 సెప్టెంబర్ 30 లోగా తమ ఆధార్ నెంబర్ సమర్పించాలి. గతంలోనే ఆధార్ ప్రూఫ్ ఇస్తే అవసరం లేదు.
7. ఇక ఏదైనా ఖాతాలో బ్యాలెన్స్ రూ.50,000 మించినా, ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ ఖాతాలోని అన్ని క్రెడిట్‌ల మొత్తం రూ.1 లక్ష దాటినా లేదా ఒక నెలలో ఖాతా నుంచి ట్రాన్స్‌ఫర్ లేదా విత్‌డ్రాయల్ రూ.10,000 దాటినా పాన్ నెంబర్ సమర్పించాలి. డిపాజిటర్ డాక్యుమెంటేషన్‌ను సమర్పించడంలో విఫలమైతే ఖాతాను ఫ్రీజ్ చేస్తారు.
COMMENTS