FD Rates: Investing in Fixed Deposit? New FD rates from leading banks for you
FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ప్రముఖ బ్యాంకుల కొత్త ఎఫ్‌డీ రేట్లు మీకోసం
ఇండియాలో చాలా మంది ప్రజలు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో (FD) మనీ ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతారు. కష్టపడి సంపాదించిన డబ్బుకు స్థిరమైన, సురక్షితమైన రాబడిని అందించే మార్గాలుగా ఎఫ్‌డీలు పాపులర్ అయ్యాయి. ఇటీవల కాలంలో ఈ రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే కరోనా సమయం నుంచి ఆర్‌బీఐ వరుసగా కీలక రెపో రేట్లను పెంచుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రభావంతో బ్యాంకులు కూడా వివిధ వడ్డీ రేట్లను పెంచాయి. దీంతో ఎఫ్‌డీ రేట్లు మరింత ఆకర్షణీయంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇండియాలోని ప్రభుత్వ, ప్రైవేట్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అందిస్తున్న ఎఫ్‌డీ రేట్ల గురించి తెలుసుకుందాం.
** ప్రభుత్వ రంగ బ్యాంకులు:
* బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
ఈ బ్యాంక్ 1 సంవత్సరం కంటే తక్కువ కాలానికి చేసిన డిపాజిట్లకు 7%, 1 నుంచి 2 సంవత్సరాలకు 6.75%, 2 నుంచి 3 సంవత్సరాలకు 6%, 3 నుంచి 5 సంవత్సరాలకు 5.75% వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు ఏప్రిల్ 17 నుంచి అమల్లోకి వచ్చాయి.
* బ్యాంక్ ఆఫ్ బరోడా
బ్యాంక్ ఆఫ్ బరోడా 1 సంవత్సరం కంటే తక్కువ డిపాజిట్లకు 5.75%, 1 నుంచి 2 సంవత్సరాలకు 7.25%, 2 నుంచి 3 సంవత్సరాలకు 7.05%, 3 నుంచి 5 సంవత్సరాలకు 6.5% వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు మే 12 నుంచి అమల్లోకి వచ్చాయి.
* బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఈ బ్యాంక్ 1 సంవత్సరం కంటే తక్కువ ఎఫ్‌డీకి 5.5%, 1 నుంచి 2 సంవత్సరాలకు 7%, 2 నుంచి 3 సంవత్సరాలకు 6.75%, 3 నుంచి 5 సంవత్సరాలకు 6.5% వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు మే 26 నుంచి అమల్లోకి వచ్చాయి.
* కెనరా బ్యాంక్
కెనరా 1 సంవత్సరం కంటే తక్కువ కాలానికి చేసిన డిపాజిట్లకు 6.5%, 1 నుంచి 2 సంవత్సరాలకు 7.25%, 2 నుంచి 3 సంవత్సరాలకు 6.85% అందిస్తోంద. అదే 3 నుంచి 5 సంవత్సరాలకు 6.8% వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. ఈ రేట్లు ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వచ్చాయి.
* సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఈ బ్యాంక్ వన్ ఇయర్ టెన్యూర్‌తో వచ్చే ఎఫ్‌డీలకు 5.5%, 1 నుంచి 2 సంవత్సరాలకు 7.1% వడ్డీ అందిస్తోంది. 2 నుంచి 3 సంవత్సరాలకు 6.5%, 3 నుంచి 5 సంవత్సరాలకు 6.25% వడ్డీని పొందవచ్చు. ఈ రేట్లు మే 10 నుంచి అమల్లోకి వచ్చాయి.
* ఇండియన్ బ్యాంక్
ఇండియన్ బ్యాంక్ 1 సంవత్సరం కంటే తక్కువ డిపాజిట్లకు 4.75%, 1 నుంచి 2 సంవత్సరాలకు 7.15%, 2 నుంచి 3 సంవత్సరాలకు 6.7%, 3 నుంచి 5 సంవత్సరాలకు 6.25% వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు మార్చి 4 నుంచి అమల్లోకి వచ్చాయి.
* ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
ఈ బ్యాంక్ వన్ ఇయర్ ఎఫ్‌డీలకు 5.35%, 1 నుంచి 2 సంవత్సరాలకు 7.25%, 2 నుంచి 3 సంవత్సరాలకు 6.8% వడ్డీ ఆఫర్ చేస్తోంది. 3 నుంచి 5 సంవత్సరాలకు చేసిన ఎఫ్‌డీలపై వినియోగదారులు 6.5% అందుకోవచ్చు. ఈ రేట్లు ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వచ్చాయి.
* పంజాబ్ నేషనల్ బ్యాంక్
ఈ బ్యాంక్ 1 సంవత్సరం కంటే తక్కువ డిపాజిట్లకు 5.8%, 1 నుంచి 2 సంవత్సరాలకు 7.25%, 2 నుంచి 3 సంవత్సరాలకు 7%, 3 నుంచి 5 సంవత్సరాలకు 6.5% వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.
* పంజాబ్ & సింధ్ బ్యాంక్
పంజాబ్ & సింధ్ బ్యాంక్ 1 సంవత్సరం కంటే తక్కువ డిపాజిట్లకు 6%, 1- 2 సంవత్సరాలకు 7.1%, 2- 3 సంవత్సరాలకు 6.75%, 3- 5 సంవత్సరాలకు 6.25% వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు ఏప్రిల్ 20 నుంచి అమల్లోకి వచ్చాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1 సంవత్సరం కంటే తక్కువ డిపాజిట్లకు 5.75%, 1 నుంచి 2 సంవత్సరాలకు 7.1%, 2 నుంచి 3 సంవత్సరాలకు 7%, 3 నుంచి 5 సంవత్సరాలకు 6.5% వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వచ్చాయి.
* UCO బ్యాంక్
యూకో బ్యాంక్ 1 సంవత్సరం కంటే తక్కువ డిపాజిట్లకు 6%, 1 నుంచి 2 సంవత్సరాలకు 7.05%, 2 నుంచి 3 సంవత్సరాలకు 6.3%, 3 నుంచి 5 సంవత్సరాలకు 6.2% వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు జూన్ 12 నుంచి అమల్లోకి వచ్చాయి.
* యూనియన్ బ్యాంక్
ఈ బ్యాంక్ 1 సంవత్సరం కంటే తక్కువ డిపాజిట్లకు 5.25%, 1 నుంచి 2 సంవత్సరాలకు 7%, 2 నుంచి 3 సంవత్సరాలకు 6.5%, 3 నుంచి 5 సంవత్సరాలకు 6.7% వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు మే 23 నుంచి అమల్లోకి వచ్చాయి.
** ప్రైవేట్ రంగ బ్యాంకులు:
* యాక్సిస్ బ్యాంక్
1 సంవత్సరం లోపు డిపాజిట్లపై 6%, 1 నుంచి 2 సంవత్సరాలకు 7.1%, 2 నుంచి 3 సంవత్సరాలకు 7.05%, 3 నుంచి 5 సంవత్సరాలకు 7% వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు మే 18 నుంచి అమల్లోకి వచ్చాయి.
* బంధన్ బ్యాంక్
బంధన్ బ్యాంక్ 1 సంవత్సరం కంటే తక్కువ డిపాజిట్లకు 4.5%, 1 నుంచి 2 సంవత్సరాలకు 8%, 2 నుంచి 3 సంవత్సరాలకు 7.25%, 3 నుంచి 5 సంవత్సరాలకు 7.25% వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు ఫిబ్రవరి 6 నుంచి అమల్లోకి వచ్చాయి.
* కాథలిక్ సిరియన్ బ్యాంక్
కాథలిక్ సిరియన్ బ్యాంక్ 1 సంవత్సరం కంటే తక్కువ డిపాజిట్లకు 4.25%, 1 నుంచి 2 సంవత్సరాలకు 7.35%, 2 నుంచి 3 సంవత్సరాలకు 5.75%, 3 నుంచి 5 సంవత్సరాలకు 5.75% వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.
* సిటీ యూనియన్ బ్యాంక్
సిటీ యూనియన్ బ్యాంక్ 1 సంవత్సరం కంటే తక్కువ డిపాజిట్లకు 6.5%, 1 నుంచి 2 సంవత్సరాలకు 7%, 2 నుంచి 3 సంవత్సరాలకు 6.5%, 3 నుంచి 5 సంవత్సరాలకు 6.25% వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వచ్చాయి.
* DCB బ్యాంక్
DCB బ్యాంక్ 1 సంవత్సరం కంటే తక్కువ డిపాజిట్లకు 6.25%, 1 నుంచి 2 సంవత్సరాల వరకు 8%, 2 నుంచి 3 సంవత్సరాలకు 8%, 3 నుంచి 5 సంవత్సరాలకు 7.75% వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు మే 8 నుంచి అమల్లోకి వచ్చాయి.
* ధనలక్ష్మి బ్యాంక్
ధనలక్ష్మి బ్యాంక్ 1 సంవత్సరం కంటే తక్కువ డిపాజిట్లకు 6.5%, 1 నుంచి 2 సంవత్సరాలకు 7.25%, 2 నుంచి 3 సంవత్సరాలకు 6.5%, 3 నుంచి 5 సంవత్సరాలకు 6.6% వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు జూన్ 2 నుంచి అమల్లోకి వచ్చాయి.
* ఫెడరల్ బ్యాంక్
ఫెడరల్ బ్యాంక్ 1 సంవత్సరం కంటే తక్కువ డిపాజిట్లకు 6%, 1 నుంచి 2 సంవత్సరాలకు 7.25%, 2 నుంచి 3 సంవత్సరాలకు 6.75%, 3 నుంచి 5 సంవత్సరాలకు 6.6% వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు మే 17 నుంచి అమల్లోకి వచ్చాయి.
* HDFC బ్యాంక్
HDFC బ్యాంక్ 1 సంవత్సరం కంటే తక్కువ డిపాజిట్లకు 6%, 1 నుంచి 2 సంవత్సరాలకు 7.1%, 2 నుంచి 3 సంవత్సరాలకు 7.2%, 3 నుంచి 5 సంవత్సరాలకు 7.25% వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు మే 29 నుంచి అమల్లోకి వచ్చాయి.
* ICICI బ్యాంక్
ICICI బ్యాంక్ 1 సంవత్సరం కంటే తక్కువ డిపాజిట్లకు 6%, 1 నుంచి 2 సంవత్సరాలకు 7.1%, 2 నుంచి 3 సంవత్సరాలకు 7.1%, 3 నుంచి 5 సంవత్సరాలకు 7% వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు ఫిబ్రవరి 24 నుంచి అమల్లోకి వచ్చాయి.
* IDBI బ్యాంక్
IDBI బ్యాంక్ 1 సంవత్సరం కంటే తక్కువ డిపాజిట్లకు 5.75%, 1 నుంచి 2 సంవత్సరాల వరకు 7.15%, 2 నుంచి 3 సంవత్సరాల వరకు 6.5%, 3 నుంచి 5 సంవత్సరాలకు 6.5% వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు జూన్ 14 నుంచి అమల్లోకి వచ్చాయి.
* IDFC ఫస్ట్ బ్యాంక్
IDFC ఫస్ట్ బ్యాంక్ 1 సంవత్సరం కంటే తక్కువ డిపాజిట్లకు 6.75%, 1 నుంచి 2 సంవత్సరాలకు 7.75%, 2 నుంచి 3 సంవత్సరాలకు 7.75%, 3 నుంచి5 సంవత్సరాలకు 7% వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చాయి.
* IndusInd బ్యాంక్
ఈ బ్యాంక్ 1 సంవత్సరం కంటే తక్కువ డిపాజిట్లకు 6.35%, 1 నుంచి 2 సంవత్సరాలకు 7.75%, 2 నుంచి 3 సంవత్సరాలకు 7.5%, 3 నుంచి 5 సంవత్సరాలకు 7.5% వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు జూన్ 2 నుంచి అమల్లోకి వచ్చాయి.
* J & K బ్యాంక్
J & K బ్యాంక్ 1 సంవత్సరం కంటే తక్కువ డిపాజిట్లకు 6%, 1 నుంచి 2 సంవత్సరాలకు 7.1%, 2 నుంచి 3 సంవత్సరాలకు 7%, 3 నుంచి 5 సంవత్సరాలకు 6.5% వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు మే 11 నుంచి అమల్లోకి వచ్చాయి.
* కర్ణాటక బ్యాంక్
కర్ణాటక బ్యాంక్ 1 సంవత్సరం లోపు డిపాజిట్లకు 5.25%, 1 నుంచి 2 సంవత్సరాలకు 7.3%, 2 నుంచి 3 సంవత్సరాలకు 6.5%, 3 నుంచి 5 సంవత్సరాలకు 6.5% వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వచ్చాయి.
* కోటక్ బ్యాంక్
కోటక్ బ్యాంక్ 1 సంవత్సరం కంటే తక్కువ డిపాజిట్లకు 7%, 1 నుంచి 2 సంవత్సరాలకు 7.2%, 2 నుంచి 3 సంవత్సరాలకు 7%, 3 నుంచి 5 సంవత్సరాలకు 6.5% వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు మే 11 నుంచి అమల్లోకి వచ్చాయి.
* కరూర్ వైశ్యా బ్యాంక్
కరూర్ వైశ్యా బ్యాంక్ 1 సంవత్సరం కంటే తక్కువ డిపాజిట్లకు 6.5%, 1 నుంచి 2 సంవత్సరాలకు 7.3%, 2 నుంచి 3 సంవత్సరాలకు 7%, 3 నుంచి 5 సంవత్సరాలకు 6.25% వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చాయి.
* RBL బ్యాంక్
RBL బ్యాంక్ 1 సంవత్సరం కంటే తక్కువ డిపాజిట్లకు 6.05%, 1 నుంచి 2 సంవత్సరాలకు 7.8%, 2 నుంచి 3 సంవత్సరాలకు 7.5%, 3 నుంచి 5 సంవత్సరాలకు 7.1% వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.
* సౌత్ ఇండియన్ బ్యాంక్
సౌత్ ఇండియన్ బ్యాంక్ 1 సంవత్సరం లోపు డిపాజిట్లకు 6%, 1 నుంచి 2 సంవత్సరాలకు 7.4%, 2 నుంచి 3 సంవత్సరాలకు 7%, 3 నుంచి 5 సంవత్సరాలకు 6.5% వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు మార్చి 21 నుంచి అమల్లోకి వచ్చాయి.
* తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ 1 సంవత్సరం కంటే తక్కువ డిపాజిట్లకు 8%, 1 నుంచి 2 సంవత్సరాలకు 7.25%, 2 నుంచి 3 సంవత్సరాలకు 6.75, 3 నుంచి 5 సంవత్సరాలకు 6.5% వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు ఫిబ్రవరి 10 నుంచి అమల్లోకి వచ్చాయి.
* TNSC బ్యాంక్
TNSC బ్యాంక్ 1 సంవత్సరం కంటే తక్కువ డిపాజిట్లకు 6%, 1 నుంచి 2 సంవత్సరాలకు 7.5%, 2 నుంచి 3 సంవత్సరాలకు 6.6%, 3 నుంచి 5 సంవత్సరాలకు 6.5% వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చాయి.
* యెస్ బ్యాంక్
యెస్ బ్యాంక్ 1 సంవత్సరం లోపు డిపాజిట్లకు 6.25%, 1 నుంచి2 సంవత్సరాలకు 7.75%, 2 నుంచి 3 సంవత్సరాలకు 7.75%, 3 నుంచి 5 సంవత్సరాలకు 7% వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు మే 02 నుంచి అమల్లోకి వచ్చాయి.
** స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు
* AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1 సంవత్సరం కంటే తక్కువ డిపాజిట్లకు 6.75%, 1 నుంచి 2 సంవత్సరాలకు 7.5%, 2 నుంచి 3 సంవత్సరాలకు 7.75%, 3 నుంచి 5 సంవత్సరాలకు 7.5% వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు జూన్ 5 నుంచి అమల్లోకి వచ్చాయి.
* ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1 సంవత్సరం కంటే తక్కువ డిపాజిట్లకు 6.25%, 1 నుంచి 2 సంవత్సరాలకు 8.5%, 2 నుంచి 3 సంవత్సరాలకు 8.5%, 3 నుంచి 5 సంవత్సరాలకు 7.5% వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు జూన్ 5 నుంచి అమల్లోకి వచ్చాయి.
* ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1 సంవత్సరం కంటే తక్కువ డిపాజిట్లకు 6.25%, 1 నుంచి 2 సంవత్సరాలకు 8.11%, 2 నుంచి 3 సంవత్సరాలకు 8.51%, 3 నుంచి 5 సంవత్సరాలకు 8.25% వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు మే 25 నుంచి అమల్లోకి వచ్చాయి.
* జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1 సంవత్సరం కంటే తక్కువ డిపాజిట్లకు 7%, 1 నుంచి 2 సంవత్సరాల వరకు 8.5%, 2 నుంచి 3 సంవత్సరాలకు 7.35%, 3 నుంచి 5 సంవత్సరాలకు 7.25% వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు మే 30 నుంచి అమల్లోకి వచ్చాయి.
* సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1 సంవత్సరం కంటే తక్కువ డిపాజిట్లకు 6%, 1 నుంచి 2 సంవత్సరాలకు 8.25%, 2 నుంచి 3 సంవత్సరాలకు 8.5%, 3 నుంచి 5 సంవత్సరాలకు 9.1% వడ్డీ రేట్లు అందిస్తుంది. ఈ రేట్లు జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.
* ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1 సంవత్సరం కంటే తక్కువ డిపాజిట్లకు 6.5%, 1 నుంచి 2 సంవత్సరాలకు 8.25%, 2 నుంచి 3 సంవత్సరాలకు 7.75%, 3 నుంచి 5 సంవత్సరాలకు 7.2% వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.
COMMENTS