NEET Ranker Success Story : Worked as a laborer in the morning.. studied at night.. as expected.. scored a good rank in NEET..
NEET Ranker Success Story : పొద్దున పూట కూలీ పని చేశా.. రాత్రి పూట చదివా.. అనుకున్నట్టే.. నీట్‌లో మంచి ర్యాంక్ కొట్టానిలా..
ఇందులో గొప్ప ఏముంది అనుకుంటున్నా..? ఈతని కుటుంబ నేపథ్యంలో చూస్తే.. మీకే అర్ధం అవుతుంది. కఠిన పేదరికంలో ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తన లక్ష్యం కోసం విరామం ఎరుగకుండా శ్రమించిన ఆ కుర్రాడి చిన్ననాటి కల ఎట్టకేలకు నెరవేర్చుకున్నాడు.
పొద్దున పూట కూలీగా పనిచేస్తూనే..
కుటుంబం పూటగడవటం కోసం కూలీ పనులకు వెళుతూనే చదవుకున్న ఆ కుర్రాడు తీవ్ర పోటీ ఉన్న పరీక్షలో సత్తా చాటాడు. దేశవ్యాప్తంగా 20 లక్షలకు పైగా రాసిన నీట్ యూజీ పరీక్షలో జమ్మూకశ్మీర్‌కు చెందిన ఉమర్ అహ్మద్ గనై మంచి మార్కులు సాధించి ప్రశంసలు అందుకుంటున్నాడు. గత రెండేళ్లుగా రోజువారీ కూలీగా పనిచేస్తున్న ఉమర్ అహ్మద్ నీట్ ఫలితాల్లో 720 మార్కులకు గానూ 601 మార్కులు సాధించి ఆదర్శంగా నిలిచాడు.
పొద్దున పూట కూలీగా.. సాయంత్రం వేళ..
ఉగ్రదాడులు, ఎన్‌కౌంటర్‌లతో జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా పేరు చాలా మందికి సుపరిచితమే. ఎప్పుడు ఎలాంటి ఘటన చోటుచేసుకుంటుందో తెలియని ఆ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల ఉమర్ అహ్మద్ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. తన కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో రోజూ రూ.600 చొప్పున పక్క గ్రామాల్లో కూలీ పనులకు వెళుతూనే చదువు కొనసాగించాడు. గత రెండేళ్లుగా పొద్దున పూట కూలీగా.. సాయంత్రం వేళ పరీక్ష కోసం సన్నద్ధమయ్యాడు. ఈ క్రమంలో ఇటీవల వెలువడిన నీట్ పరీక్ష ఫలితాల్లో ఉమర్ మంచి స్కోర్ సాధించాడు.
ఎప్పుడూ.. ఇది వృథా కాదు..
ఈ 19 ఏళ్ల కుర్రాడి..తన కల నెరవేరడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. బంధువులు, చుట్టుపక్కలవారు సంతోషం వ్యక్తం చేస్తూ అతనికి అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఉమర్ మాట్లాడుతూ.. గత రెండేళ్లు చాలా కష్టంగా గడిచింది. పొద్దున పూట కూలీగా పనిచేస్తూనే సాయంత్రం సమయాల్లో చదువుకున్నాను. ఈ రోజు నాకష్టానికి ప్రతిఫలం దక్కింది. కష్టపడి పనిచేయండి. అది ఎప్పుడూ వృథా కాదు అని అన్నాడు. నేను భవిష్యత్‌లో మంచి డాక్టర్ రాణించి.. పేదలకు సేవచేయడంతో పాటు.. నా లాంటి పేద విద్యార్థులకు చదువుకు సహాయం చేస్తానన్నారు.
COMMENTS