Post Office Schemes: Four Post Office Programs, each worth Rs. 400 crore and saving Rs. 400!
Post Office Schemes: పోస్టాఫీస్‌లో 4 అదిరే స్కీమ్స్.. రూ.400 పొదుపుతో చేతికి రూ.కోటి!
Recurring deposit మీరు డబ్బులు దాచుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. పోస్టాఫీస్‌లో పలు రకాల సేవింగ్ స్కీమ్స్ లభిస్తున్నాయి. వీటిల్లో డబ్బులు పెడితే రిస్క్ ఉండదు. కచ్చితమైన రాబడి వస్తుంది.
పోస్టాఫీస్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మిలియనీర్లు కావొచ్చు. ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల టెన్యూర్‌తో మీరు డబ్బులు దాచుకోవచ్చు. స్కీమ్ ప్రాతిపదికన టెన్యూర్, రాబడి వంటి అంశాలు మారుతూ ఉంటాయి. పోస్టాఫీస్‌లోని 4 స్కీమ్స్ గురించి తెలుసుకుందాం.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), రికరింగ్ డిపాజిట్ (ఆర్‌డీ), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్‌సీ), టైమ్ డిపాజిట్ (టీడీ) వంటి వాటి ద్వారా దీర్ఘకాలంలో అధిక మొత్తంలో డబ్బులు పొందొచ్చు.
పీపీఎఫ్ విషయానికి వస్తే.. ఇందులో వార్షికంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. నెలకు రూ. 12,500 (రోజుకు దాదాపు రూ.410 పొదుపు చేయాలి) పెడుతూ వెళ్లొచ్చు. మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. తర్వాత ఐదేళ్ల చొప్పున టెన్యూర్ పొడిగించుకోవచ్చు. ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రస్తుతం 7.1 వడ్డీ వస్తోంది. మీరు ప్రతి ఏటా రూ. 1.5 లక్షలు పెడుతూ వెలితే 25 ఏళ్లలో మీ చేతికి రూ. 1.3 కోట్ల్ వస్తాయి.
రికరింగ్ డిపాజిట్‌లో మీరు ప్రతి నెలా కొంత మొత్తం దాచుకోవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. మీకు ఈ స్కీమ్‌పై 5.8 శాతం వడ్డీ వస్తుంది. మీరు సంవత్సరానికి రూ.1.5 లక్షలు పెడితే 27 ఏళ్లలో మీ చేతికి రూ.99 లక్షలు వస్తాయి.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌లో కూడా డబ్బులు పెట్టొచ్చు. ఈ పథకంపై 6.8 శాతం వడ్డీ వస్తోంది. ఈ స్కీమ్‌లో చేరితో పన్ను మినహాయింపు పొందొచ్చు. వడ్డీ రేటు అనేది స్మాల్ సేవింగ్స్‌పై మూడు నెలలకు ఒకసారి మారే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం త్రైమాసికం చొప్పున వడ్డీ రేటును సమీక్షిస్తుంది.
ఇక టైమ్ డిపాజిట్‌లో కూడా డబ్బులు పెట్టొచ్చు. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6.7 శాతంగా ఉంది. ఐదేళ్ల డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది. మీరు రూ. 15 లక్షలు డిపాజిట్ చేస్తే 6.7 శాతం చొప్పున చూస్తే.. మీరు 25 ఏళ్ల కాలంలో మిలియనీర్ అయిపోవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ విలువ ఏకంగా రూ. 78 లక్షలకు పైగా అవుతుంది.
పోస్టాఫీస్‌లో కేవలం ఈ స్కీమ్స్ మాత్రమే కాకుండా ఇతర పథకాలు కూడా ఉన్నాయి. సుకన్య స్కీమ్ కూడా ఉంది. ఇంకా కిసాన్ వికాస్ పత్ర అనే పథకం కూడా ఉందని చెప్పుకోవాలి. అందువల్ల మీరు మీకు నచ్చిన స్కీమ్‌లో చేరొచ్చు.
COMMENTS