MSME: Do you want to launch a company? Request a loan from the Centre.
MSME: మీరు వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా? కేంద్రం అందించే లోన్ కోసం దరఖాస్తు చేసుకోండి
మీరు మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి లోన్ తీసుకోవాలనుకుంటే కొన్ని సంస్థలు సులభంగా రుణాలను అందిస్తుంటాయి. వ్యాపారాన్ని ప్రారంభించాలంటే కేంద్ర ప్రభుత్వం రుణాలను అందిస్తుటుంది.
అందులో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు(ఎంఎస్‌ఎంఈ)ల నుంచి రుణాలు పొందవచ్చు. ఎందుకంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ (MSME) రుణాలు సాధారణంగా స్టార్టప్‌లు, చిన్న వ్యాపారాలు ప్రారంభించే వారికి ఇవ్వబడతాయి. అయితే ఎంఎస్‌ఎంఈ లోన్ తిరిగి చెల్లించే వ్యవధి రుణదాత నుండి రుణదాతకు మారుతూ ఉంటుంది. రుణం కోసం దరఖాస్తుదారుడి ప్రొఫైల్, గతంలో వ్యాపారం ఎలా ఉంది, తిరిగి చెల్లింపు ఎలా జరిగింది అనే దాని ఆధారంగా వడ్డీ రేటు నిర్ణయించడం జరుగుతుంది. పెద్ద, చిన్న వ్యాపారాలు ప్రారంభించే వారికి ఈ రుణాలు పొందవచ్చు.
బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఎంఎస్‌ఎంఈ రుణాలకు నిర్దిష్ట అర్హత ప్రమాణాలను కలిగి ఉన్నాయి. ఈ రుణాల కోసం దరఖాస్తు చేయాలనుకుంటే మీరు చింతించాల్సిన అవసరం లేదు. రుణాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి:
☛ ముందుగా మీరు Udyogaadhaar.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లండి. ఇది ఎంఎస్‌ఎంఈల నమోదు కోసం జాతీయ పోర్టల్.
☛ దీని తర్వాత, ఆధార్ నంబర్, వినియోగదారుని పేరు, ఇతర వివరాలను నమోదు చేసి, ఆపై జనరేట్ OTPపై క్లిక్ చేయండి.
☛ మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేసి, “ధృవీకరించు”పై క్లిక్ చేయండి.
☛ దీని తర్వాత మీరు దరఖాస్తు ఫారమ్ కనిపిస్తుంది. దీనిలో మీరు అవసరమైన అన్ని వివరాలను పూరించాలి.
☛ దరఖాస్తు ఫారమ్‌లో అవసరమైన అన్ని వివరాలను పూరించిన తర్వాత సబ్మిట్‌పై క్లిక్ చేయండి
☛ తర్వాత మీరు నమోదు చేసిన వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదా ఒకసారి చెక్ చేసుకోండి.
☛ తర్వాత సబ్మిట్ కొట్టిన తర్వాత మీరు మీ ఆధార్ కార్డ్‌కి లింక్ చేయబడిన మీ మొబైల్ నంబర్‌కు మళ్లీ OTP వస్తుంది. తర్వాత ఓటీపీని నమోదు చేసి సబ్మిట్‌పై క్లిక్ చేయండి.
☛ తర్వాత దరఖాస్తు కాపీని ప్రింట్ తీసుకోండి.
MSME లోన్ కోసం అవసరమైన పత్రాలు:
☛ దరఖాస్తు ఫారమ్ కాపీ.
☛ గుర్తింపు రుజువు కోసం పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్ అవసరం.
☛ నివాస రుజువు కోసం పాస్‌పోర్ట్, లీజు ఒప్పందం, ట్రేడ్ లైసెన్స్, టెలిఫోన్, విద్యుత్ బిల్లులు, రేషన్ కార్డ్, సేల్స్ ట్యాక్స్ సర్టిఫికేట్.
☛ వయస్సు రుజువు కోసం పాస్‌పోర్ట్, ఓటర్ ఐడి కార్డ్, ఫోటో పాన్ కార్డ్,హైస్కూల్ మార్క్ సీటు
☛ గత 12 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్
☛ వ్యాపార నమోదు సర్టిఫికేట్
☛ యజమాని పాన్ కార్డ్ కాపీ
☛ గత 2 సంవత్సరాల లాభం, నష్టాల బ్యాలెన్స్ షీట్ కాపీ
☛ మీరు కట్టే ట్యాక్స్ పత్రం
రుణాలు ఇచ్చే బ్యాంకులు:
☛ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
☛ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
☛ అలహాబాద్ బ్యాంక్
☛ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
☛ ఐసీఐసీఐ బ్యాంక్
☛ బజాజ్ ఫిన్‌సర్వ్
☛ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్
☛ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
COMMENTS