ఆఫ్రికా (Africa) దేశం గురించి కొన్ని భయంకర నిజాలు
Some awful facts about the country of Africa : ఈ ప్రపంచంలో ఎక్కువ దేశాలు ఉన్న ఖండం ఏదైనా ఉందంటే అది ఆఫ్రికా (Africa) ఖండం మాత్రమే. ఒక ఆఫ్రికా ఖండంలోనే 54 దేశాలు ఉన్నాయి. యూరప్ దేశం వారు సముద్ర మార్గంలో అన్ని దేశాల కోసం దారి కనుక్కోవడానికి గాలింపు చేసే సమయంలో కనుక్కున్న మొదటి ఖండం ఆఫ్రికా. అప్పటి నుంచి వివిధ దేశాల వారు ఆఫ్రికాలో ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఆక్రమణకు గురి కాకముందు ఆఫ్రికా ఖండంలో పదివేల రాష్ట్రాలు ఉండేవి. ఇక్కడ ఉండే రాష్ట్రాలు అక్కడ ఆధిపత్యం చెలాయిస్తున్న కొన్ని తెగల జాతుల చేతుల్లో ఉండేవి. అన్ని తెగల కంటే ఈజిప్టు ప్రాంతంలో ఉండే తెగలవారు చాలా అభివృద్ధి లో ఉండేవారు. ఈజిప్టులో ఉన్న తెగలవారు తమకున్న తెలివితో భారీ కట్టడాలు నిర్మించారు. దీని కారణంగా ఈజిప్ట్ లో ఉండే తెగల వారి దగ్గర మిగతా ప్రాంతాల్లో ఉండే తెగలవారు బానిసలుగా పని చేసేవారు. ఈ బానిసల తోనే ఈజిప్ట్ తెగలవారు భారీ కట్టడాలు అయిన పిరమిడ్ నిర్మాణాలను నిర్మించుకున్నారు.
జన సాంద్రతలో రెండవ స్థానంలో ఉన్న ఆఫ్రికా ఖండంలో పేదరికం చాలా ఎక్కువ. అలాగే హెచ్ఐవి ఎయిడ్స్ ఆఫ్రికా ఖండంలోని మొట్టమొదటిసారిగా కనుగొనడం జరిగింది. దేశంలో ఉండే 25 మిలియన్ల ప్రజలు ఎయిడ్స్ వ్యాధితో బాధ పడేవారు. వీరిలో 17 మిలియన్ల మంది ఈ హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడి చనిపోయారు. ఈ ఆఫ్రికా ఖండంలో సహజ వనరులు ఎక్కువగా ఉండేవి. ఇక్కడ ఉన్న సహజ వనరులు ఏ ఖండంలోనూ దొరకవు. బంగారం ఉత్పత్తిలో ఆఫ్రికా మొదటి స్థానంలో ఉంది. అంతే కాకుండా వజ్రాల గనులు కూడా ఈ ఖండంలోనే ఎక్కువగా ఉన్నాయి.ఎక్కువమంది ప్రజలు అడవిలో దగ్గర ఉండే నివాసాల్లో జీవనం సాగిస్తూ ఉంటారు అందువల్ల క్రూరమృగాల బారిన పడి చాలా మంది చనిపోతున్నారు.
ఆఫ్రికా (Africa) ఖండం లో నీటి కష్టాలు:
ప్రపంచంలోనే అతి తక్కువ వర్షపాతం కలిగిన ఖండం కూడా ఈ ఆఫ్రికా ఖండమే. భూగర్భ జలాల ద్వారానే వీరు మంచి నీటిని తాగుతున్నారు. వీరు అడవులను ఎక్కువభాగం నరికి వేయడం వల్ల వర్షపాతం చాలా తక్కువగా నమోదు అవుతుంది. అడవులు నరికి వేయడం వల్ల భూగర్భ జలాలు కూడా తగ్గిపోతున్నాయి అని అక్కడ జరిపే పరిశోధనలు చెబుతున్నాయి.ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో త్రాగడానికి నీరు దొరకదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికత కలిగిన దేశంగా ఈజిప్ట్ దేశం ఉంది.
COMMENTS