సముద్రం లోపల ఉన్న రహస్యాలు
Mysteries under the sea : భూమి చుట్టూ జరిగే విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి భూమిపై జరిగే విషయాలు గురించి చాలా సులువుగా తెలుసుకోవచ్చు. కానీ సముద్రం (sea) లోపల ప్రపంచం ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే సముద్రంలో అంత లోతుగా వెళ్లి చూసి వచ్చే వారు చాలా తక్కువ మంది ఉంటారు. సముద్రపు లోతు జలాల్లో మనం ఆశ్చర్యపోయే ఎన్నో మిస్టరీస్ (Mysteries) విషయాలు ఉన్నాయి. ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
భూ గ్రహం మొత్తం 71% సముద్రపు నీటితో నిండి ఉంటుంది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు మనం నివసిస్తున్న భూమి పై సముద్రం చాలా పెద్దది. సముద్రం అనేది ఎంత పెద్ద గా ఉంటుందో మరియు సముద్రపు అంతర్భాగంలో ఏమి జరుగుతోందో ప్రపంచానికి తెలిసింది 5% మాత్రమే. ఇంకా 95% సముద్ర అంతర్భాగంలో ఏమి జరుగుతోందో కనుక్కోలేకపోతున్నారు. మనం చూడటానికి పైకి ప్రశాంతంగా కనిపించే సముద్రం లోపల మనకు తెలియని ప్రపంచమే ఉంది.
Mysteries under the sea Telugu:
సముద్ర అంతర్భాగంలో కొన్ని వేల టన్నుల బంగారం, ప్రమాదకరమైన చేపలు, మనిషి ఎప్పుడూ చూడలేని వింత జంతువులు అన్నీ సముద్రంలోనే జీవనం సాగిస్తున్నాయి.
సముద్రంలో విలువ కట్టలేని ఎంతో బంగారం ఉంది. సుమారు రెండు కోట్ల టన్నుల బంగారం సముద్రపు నీటిలో కరిగి పోయి ఉంది. ఈ నీటి నుండి బంగారం తీయడం అంత సులువైన పని కాదు. ఇలా నీటిలో కరిగిన బంగారమే కాదు సముద్ర అంతర్భాగంలో చాలా బంగారు గనులు, కొండలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా పూర్వకాలంలో సముద్రపు జలాల్లో ప్రయాణించే బంగారం తో కూడిన పెద్ద పడవలు మునిగి పోయి అందులో ఉన్న బంగారం, వజ్రాలు అన్నీ సముద్ర అంతర్భాగంలో కలిసిపోయాయి. ఈ సముద్రం లోని బంగారాన్నంతా బయటకు తీసి భూమిపై ఉన్న ఒక్క మనిషికి సుమారు నాలుగు కేజీల బంగారం ఇవ్వచ్చు. కానీ ఈ బంగారాన్నంతా సముద్రంలో నుంచి బయటకు తీయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంతేకాకుండా ఈ పని చాలా కష్టమైన పని కూడా.
ఈ ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియం ఏమైనా ఉంది అంటే అది సముద్రం అని చెప్పవచ్చు. ఎందుకంటే భూమి పై ఉన్న మ్యూజియంలో చరిత్రకారుల విగ్రహాలు మరియు కళాఖండాలు కంటే సముద్రంలోనే ప్రపంచానికి తెలియని అనేక పురాతన నగరాలు మరియు విగ్రహాలు, పురాతన కళాఖండాలు నీటి అడుగు భాగంలో ఇంకా ఇప్పటికీ అలాగే ఉన్నాయి.
మన వాతావరణంలో ఉండే ఆక్సిజన్ 70 శాతం సముద్రజలాల నుండి వస్తుంది. సముద్రంలో ఉండే మొక్కల ద్వారా ఆక్సిజన్ బయటకు విడుదల అవుతుంది.
సముద్రంలో ఉండే నీటిని మనుషులు త్రాగలేరు. కానీ సముద్రంలో ఉండే ఐస్ బర్గ్ లో 100% మంచి నీరు ఉంటుంది. ఒక పెద్ద సైజు ఐస్ బర్గ్ ను కరిగించి 10 లక్షల మందికి ఐదు సంవత్సరాల వరకు త్రాగు నీటిని అందించవచ్చు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సముద్రంలో ఒక్కొక్క ఐస్ బర్గ్ చాలా పెద్దగా ఉంటుంది. అరబ్ దేశాల్లో వర్షాలు తక్కువగా పడతాయి. దీని కారణంగా వారికి త్రాగు నీరు తక్కువగా లభిస్తుంది. అక్కడ ఉన్న పెద్ద కంపెనీస్ ఐస్ బర్గ్ ను తెప్పించి మంచినీటిని సప్లై చేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
మనం వాడుతున్న ఇంటర్నెట్ కూడా సముద్రం లోపల వేసిన కేబుల్ ద్వారా ప్రపంచానికి అందుతోంది. శాటిలైట్ ద్వారా అందించే ఇంటర్నెట్ కన్నా కేబుల్స్ ద్వారా ఇంటర్నెట్ అందించడం చాలా తక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి ప్రపంచ మొత్తము కేబుల్స్ ద్వారా వచ్చే ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు.సముద్రం లోపల కేబుల్స్ ద్వారా ఇంటర్నెట్ అందించడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. శాటిలైట్ ద్వారా అయితే ఈ ఖర్చు మరింత పెరుగుతుంది.
సముద్రంలో ఉండే షార్క్ చేపలు ఇంటర్ నెట్ కేబుల్స్ కొరికి నష్టం కలిగించే ప్రమాదం ఉంది.
COMMENTS