Columbus ఇండియాకి సముద్ర మార్గాన్ని కనిపెట్టడానికి వెళ్లి అమెరికాను కనిపెట్టాడు
Columbus went to find a sea route to india But discovered America : వాస్కోడిగామా (vasco da gama) ఇండియాకి సముద్రమార్గాన్ని కనిపెట్టాడు అని అందరికీ తెలుసు. అసలు ఇండియా కి సముద్ర మార్గాన్ని కనిపెట్టాలి అనే ఆలోచన ఎలా వచ్చింది. కొలంబస్ కూడా ఇండియాకి సముద్రమార్గాన్ని కనిపెట్టాలి అనుకున్నాడా? అది కని పెట్టబోయి అమెరికా (America) కనిపెట్టాడా? కొలంబస్ ఇండియా వెళ్ళాలి అన్న ఆలోచన ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆసియా ఖండంలో భాగమైన భారతదేశంలో లభించే మిరియాలు, లవంగాలు, యాలకులు, జాజికాయ, జాపత్రి ఆ కాలంలో ప్రజలు బాగాఇష్టపడేవారు. వాటిని దిగుమతి చేసుకోవడం కోసం ఆసియా ఖండం వెళ్లాలంటే మెడిటేరియన్ సముద్రం మీదుగా వెళ్లి అక్కడ నుండి అరబ్ దేశాల మీదగా చేరుకోవాల్సి వచ్చేది.
అరబ్ దేశంలో ఉండే ముస్లిం రాజులు ఆసియా ఖండంలో ఉండే వర్తక వ్యాపారుల నుండి వచ్చే లాభాలు పొందాలన్న ఉద్దేశంతో యూరోపియన్ కంట్రీస్ ని ఆసియా ఖండం వెళ్లకుండా అడ్డుకునే వారు పోర్చుగీసు వారికి అది పెద్ద తలనొప్పిగా మారింది.
ఆసియా ఖండానికి ఎలాగైనా సముద్రమార్గాన్ని కనిపెట్టాలని కొలంబస్ (Columbus) బయలుదేరాడు. ఆరోజుల్లోనే భూమి బల్లపరుపుగా కాదు గుండ్రంగా ఉందని అందరూ అంగీకరిస్తూ వస్తున్నారు. భూమి గుండ్రంగా ఉంటుంది అనే సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని యూరప్ నుండి పశ్చిమదిశగా బయలుదేరి భూమి చుట్టూ తిరిగి ఆసియా ఖండం యొక్క తూర్పు వైపు చేరుకోవాలని భావనతో కొలంబస్ అట్లాంటిక్ మహాసముద్రంలో తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. కొన్ని రోజుల ప్రయాణం తరువాత కొలంబస్ ఒక ఐలాండ్ కు చేరుకున్నాడు. అది ఇండియాకు సమీపంలో ఉన్న ఐలాండ్ అని భావించి అక్కడ స్పానిష్ జెండాను ఎగురవేశాడు. తరువాత తనకు తెలిసింది ఏమిటంటే అది ఇండియా కు సంబంధించిన ఐలాండ్ కాదని నార్త్ అమెరికా సమీపంలో ఉన్న ఐలాండ్ అని తెలుసుకున్నాడు. ఈ విధంగా కొలంబస్ ఆసియా ఖండానికి సముద్రమార్గాన్ని కనిపెట్టాలని యాత్ర చేస్తున్నప్పుడు అమెరికాను కనిపెట్టడం జరిగింది.
COMMENTS