మెంతులతో కలిగే ప్రయోజనాలివే
These are the benefits of fenugreek: మెంతులు ఎన్నో ఆరోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేస్తాయి. శరీరంలో తగినంత వేడిని ఉత్పత్తి చేసి జీర్ణవ్వవస్థను మెరుగుపరుస్తాయి. మధుమేహం, అధిక బరువు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలకు మెంతులు ఔషధంగా పనిచేస్తాయి.
ఈ సందర్భంగా మెంతులతో కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- పీసీఓడీ, అధిక కొలెస్ట్రాల్, షుగర్ వ్యాధి, అధిక బరువు సమస్యలను తగ్గించడంలో మెంతులు బాగా సహాయపడతాయి.
- రాత్రిపూట మెంతులను పెరుగులో నానబెట్టి ఉదయాన్నే తీసుకోవాలి. అలా చేస్తే శరీరంలో విషాన్ని బయటికి పంపించి ఆరోగ్యంగా ఉంచడానికి బాగా ఉపయోగపడతాయి.
- మెంతులను పెరుగులో కలుపుకొని తీసుకుంటే మలబద్ధకం, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి.
- మెంతులను నేతిలో వేయించి, కొద్దిగా సైందవ లవణాన్ని కలిపి మజ్జిగలో తీసుకున్నట్లయితే విరేచనాలు తగ్గుతాయి.
- మెంతులు, బెల్లం కలిపి ముద్దలా చేసుకుని తినాలి. వాటికి తల్లిపాలను వృద్ధి చేసే గుణం కూడా ఉంటుంది.
- కఫానికి, వాతానికి వ్యతిరేకంగా మెంతులు పనిచేస్తాయి.
- జిడ్డుగా ఉండే చుండ్రు తగ్గించడానికి కూడా మెంతులు బాగా పనిచేస్తాయి.
- నడుము నొప్పి, సయాటికా, కీళ్ల నొప్పి, కండరాల నొప్పితో బాధపడుతున్న వారికి మెంతులు ఉపశమనం కలిగిస్తాయి.
- మెంతులతో తయారు చేసిన 'టీ' ని తాగితే శ్వాస సంబంధ వ్యాధులు తగ్గుతాయి.
COMMENTS