WHAT TO LEARN IN AI
ఆ రెండు రంగాల్లో ఏఐ విప్లవం - అసలు ఏం నేర్చుకోవాలో తెలుసా?
ఏఐలో ఏం నేర్చుకోవాలి? - ఆ రెండు రంగాల్లో విప్లవంగా ఏఐ - నేర్చుకుంటే మంచి ఫ్యూచర్ - భవిష్యత్ అంతా టెక్నాలజీదే.What to Learn in AI : ప్రస్తుతం భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)దే. ఏ రంగంలో చూసుకున్న ఏఐ పేరు వినిపించకుండా ఉండటం లేదు. అయితే ఎక్కువగా అగ్రికల్చర్, హెల్త్‌కేర్ అనే రెండు ముఖ్యమైన రంగాల్లో వినిపిస్తోంది. మీరు విద్యార్థి అయినా ఉద్యోగి అయినా 2025లో మీ సమయాన్ని, శక్తిని ఈ కీలకమైన రంగాల కోసం వెచ్చిస్తే మాత్రం భవిష్యత్తు అంతా బంగారంమయమే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అగ్రి-టెక్, హెల్త్-టెక్ వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ రంగాల్లో మీ మేధస్సును పెడితే మాత్రం మంచి వృద్ధిని సాధించవచ్చు.
హెల్త్-టెక్ రంగమే ఎందుకు : హెల్త్ కేర్ అంటే కేవలం డాక్టర్లు, ఆసుపత్రులే కాదు. వ్యాధులను ముందుగా గుర్తించడం, వ్యక్తిగత చికిత్సలను అభివృద్ధి చేయడం, అందరికీ వైద్య ఆరోగ్య సేవలను అందుబాటులోకి వచ్చేలా చేయడం. 2025లో డ్రగ్ డిస్కవరీ, మెడికల్ ఇమేజింగ్, పేషెంట్ మానిటరింగ్‌లో ఏఐ ఆవిష్కరణలను నడిపిస్తోంది. ప్రపంచ జనాభా వృద్ధి చెందుతున్నప్పుడు స్మార్ట్ హెల్త్ సొల్యూషన్స్ కోసం డిమాండ్ భారీగా పెరుగుతూ ఉంటుంది.
ఈ రంగంలో ఏ అంశాలపై దృష్టి పెట్టాలో తెలుసా? :
- బయోటెక్, డేటా సైన్స్
- మెడికల్ డయాగ్నొస్టిక్స్ కోసం ఏఐ(ఎక్స్-రేలను చదవడం వంటివి)
- ఆరోగ్య పరికరాలు అభివృద్ధి చేయడం
- టెలీహెల్త్ ప్లాట్‌ఫామ్‌లను అభివృద్ధి చేయడం
ఏఐ ఈ మార్పులో ప్రధానపాత్ర పోషిస్తోంది :
- వాతావరణ ప్యాటర్న్‌లను ఊహించడం
- యంత్రాలను ఆటోమేట్ చేయడం
- పంట ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం
- ఏఐతో నడిచే టూల్స్ రైతులు తక్కువతో ఎక్కువ పండించడానికి సహాయం
- రోబోటిక్స్, డేటా అనలిటిక్స్ పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులు అగ్రి-టెక్‌లో బాగా రాణించడానికి ఎక్కువ అవకాశాలు
ఏ అంశాలపై దృష్టి పెట్టాలి :
- స్మార్ట్ ఫార్మింగ్‌లో ఐవోటీ(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్)
- డేటా అనలిటిక్స్, పర్యావరణ శాస్త్రం
- పంట ఊహ కోసం మెషీన్ లెర్నింగ్
ఎలా ప్రారంభించాలో తెలుసా :
1. పునాది నేర్చుకోండి : నిజమైన ప్రాజెక్టులపై పని చేయండి. పంట దిగుబడిని ఊహించడానికి ఏఐ మోడల్‌ను సృష్టించడం లేదా హెల్త్ యాప్‌ను అభివృద్ధి చేయడం వంటివి మీకు ప్రత్యేకతను ఇస్తాయి.
2. నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకోండి: ఏఐ హాకథాన్‌లను లేదా ఇన్నొవేషన్ చాలెంజ్‌లలో పాల్గొనండి. వ్యవసాయ లేదా మెడికల్ రంగాల్లో విద్యార్థులతో కలసి పని చేయండి.
2025లో విజయం సాధించడానికి ముఖ్యమైన చిట్కాలు :
ప్రాక్టికల్ ప్రాజెక్ట్‌లను చేయండి : పుస్తకాల పరిధిని దాటి వాస్తవ ప్రాజెక్ట్‌లను చేయడం ద్వారా అనుభవాన్ని పెంచుకోండి.
కొత్త టెక్నాలజీలను ఎప్పటికప్పుడు తెలుసుకోండి : ఏఐ, ఐవోటీ, బయోటెక్ లాంటి టెక్నాలజీలపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి.
ఏఐలో స్పెషలైజ్ : డేటా సైన్స్, మెషీన్ లెర్నింగ్‌లో మీ నైపుణ్యాలను మరింతగా మెరుగుపరచుకోండి.
మెంటర్‌లను ఎంచుకోండి : మీ రంగంలో అనుభవజ్ఞులైన వ్యక్తుల నుంచి మార్గదర్శనం పొందండి.
కొలాబరేట్ చేయడం : ఇతర విద్యార్థులు, ప్రొఫెషనల్స్‌తో కలసి పని చేయడం ద్వారా కొత్త విషయాలు నేర్చుకోండి.
గ్లోబల్ ట్రెండ్స్‌పై దృష్టి: ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోంది అనేది తెలుసుకోవడం వల్ల కొత్త అవకాశాలను గుర్తించగలుగుతారు.
సర్టిఫికేషన్ పొందండి: ఏఐ, హెల్త్-టెక్ రంగాల్లో సర్టిఫికేషన్ పొందడం ద్వారా మీ నైపుణ్యాలకు విలువను జోడించుకోవచ్చు.
"మీకు కొత్త ఆలోచనలు ఉంటే వాటిని అభివృద్ధి చేయండి. విద్యార్థి సమూహాలలో భాగస్వామి అవ్వండి. ఏఐ, అగ్రి-టెక్, హెల్త్-టెక్ వంటి సాంకేతికతలపై చర్చించే గ్రూప్స్‌లో చేరండి. మార్కెట్ అవసరాలను అర్థం చేసుకోండి. టెక్నాలజీ ఎక్కడ అవసరం అనేది గుర్తించి, ఆ దిశలో పని చేయండి." - మధు వడ్లమాని ఏఐ మేనేజర్, అడ్వైజర్
COMMENTS