DRDO-RAC has 148 scientist vacancies
DRDO: డీఆర్‌డీఓ- ఆర్‌ఏసీలో 148 సైంటిస్ట్ ఖాళీలు.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డీఆర్‌డీఓ (DRDO), ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA), ఇతర విభాగాలలో 148 సైంటిస్ట్-బి పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్ (RAC) ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ నియామకాల ద్వారా భారతదేశంలోని ప్రముఖ రక్షణ ఆర్&డీ, అనుబంధ సంస్థలలో పనిచేయడానికి సైన్స్ విభాగాలలో గ్రాడ్యుయేట్ ఇంజినీర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు: ఖాళీలు
1. డీఆర్‌డీఓలో సైంటిస్ట్-బి- 127 పోస్టులు.
2. ఏబీఏలో సైంటిస్ట్/ఇంజినీర్-బి- 9 పోస్టులు.
3. ఇతర రక్షణ సంస్థలలో ఎన్కాడెడ్ సైంటిస్ట్-బి- 12 పోస్టులు.
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్, సైన్స్ & ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెటీరియల్ సైన్స్ / మెటలర్జికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కెమికల్ ఇంజినీరింగ్, ఏరోనాటికల్/ఏరోస్పేస్ ఇంజినీరింగ్, గణితం, సివిల్ ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, ఎంటమోలజీ, బయోస్టాటిస్టిక్స్, క్లినికల్ సైకాలజీ, సైకాలజీ.
అర్హత: అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో వ్యాలిడ్ గేట్ స్కోర్‌తో పాటు ఇంజినీరింగ్/ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. చివరి సంవత్సరం/ సెమిస్టర్ విద్యార్థులు కూడా అర్హులు.
వయోపరిమితి: జనరల్ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 35 ఏళ్లు; ఓబీసీ- 38ఏళ్లు; ఎస్సీ/ ఎస్టీ వారికి 40 ఏళ్లు మించకూడదు. దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు అదనపు సడలింపు ఉంటుంది.
బేసిక్ పే: నెలకు రూ.56,100.
ఎంపిక ప్రక్రియ: గేట్(GATE) స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు. ఇతరులు రూ.100 ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చివరి తేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన ప్రచురించిన తేదీ నుంచి 21 రోజుల వరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రకటన వెలువడిన తేదీ: 20.05.2025.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS