Has your smartphone been stolen? This Google feature will give them a heads up..!
Smart Phone: మీ స్మార్ట్ ఫోన్ దొంగలించారా? ఈ గూగుల్ ఫీచర్‌తో వారికి చుక్కలే..!
ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం భారీగా పెరిగింది. ప్రతి ఇంట్లో రెండు నుంచి మూడు స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ అనేది రోజు వారీ అవసరంగా మారింది. ఈ అవసరాన్నే తస్కరులు ఆసరాగా చేసుకుంటున్నారు. జనాలతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో సింపుల్‌గా ఫోన్ దొంగలిస్తున్నారు. అయితే ఇలా దొంగలించిన ఫోన్స్ తస్కరులకు పనికిరాకుండా ఉండేలా గూగుల్ కొత్త ఫీచర్ లాంచ్ చేసింది.
దొంగిలించిన ఫోన్‌లను దాదాపుగా పనికిరానివిగా మార్చాలనే లక్ష్యంతో గూగుల్ ఆండ్రాయిడ్-16తో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. యాంటీ-థెఫ్ట్ ఫీచర్‌ను లాంచ్ చేయడం ద్వారా ఓనర్ అనుమతి లేకుండా రీసెట్ చేసిన పరికరాల్లోని అన్ని కార్యాచరణలను పరిమితం చేసేలా మెరుగైన భద్రతా ఫీచర్లు ఈ అప్‌డేట్‌లో ఇస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మొబైల్ దొంగతనాన్ని అరికట్టడానికి గూగుల్ చేస్తున్న విస్తృత ప్రయత్నంలో ఈ చర్య ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దొంగిలించిన పరికరాలను పనికిరాకుండా చేయడం ద్వారా దొంగతనానికి ప్రోత్సాహాన్ని తగ్గించాలని గూగుల్ భావిస్తోంది. ఈ ఫీచర్ ఈ సంవత్సరం చివర్లో ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
ఇటీవల ది ఆండ్రాయిడ్ షో ఐ/ఓ ఎడిషన్ సందర్భంగా ఈ కొత్త ఫీచర్‌ను ఆవిష్కరించింది. ఇది ప్రాథమికంగా ఫ్యాక్టరీ రీసెట్ ప్రొటెక్షన్‌ను పెంచుతుంది . దొంగిలించబడిన ఫోన్‌లను నిరుపయోగంగా మార్చడానికి రూపొందించబడిన భద్రతా ఫీచర్. ఈ అప్‌డేట్‌లో గూగూల్ ఆండ్రాయిడ్ 15లో ఎఫ్ఆర్‌పీకు అనేక మెరుగుదల చేసింది. ఈ కొత్త అప్‌డేట్ గురించి గూగుల్ అధికారికంగా ఏమీ చెప్పలేదు. వినియోగదారుడు రీసెట్ చేసి మునుపటి లాక్ స్క్రీన్ లాక్ లేదా గూగుల్ ఖాతా ఆధారాలను నమోదు చేసే వరకు ఫోన్‌లోని అన్ని యాక్టివిటీలను బ్లాక్ చేస్తుంది. దొంగిలించిన పరికరాలను ఫోన్ కాల్స్, ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించడానికి అనుమతించే ప్రస్తుత నిర్మాణం కంటే ఇది భద్రతా లక్షణాన్ని మరింత కఠినమైన రీతిలో అమలు చేయడం విశేషమని నిపుణులు చెబుతుననారు.
ఈ జూన్‌లో ఆండ్రాయిడ్ 16 ప్రారంభ విడుదలతో ఎఫ్ఆర్‌పీ అప్‌డేట్ రాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆండ్రాయిడ్ పోలీస్ పేరుతో అందుబాటులో ఉండే ఈ ఫీచర్ సంవత్సరం చివరిలో విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఆండ్రాయిడ్ 16లో మెటీరియల్ 3 డిజైన్ అనేది ఆకట్టుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫీచర్ ద్వారా గూగుల్-ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లకు డైనమిక్ రంగులు, ప్రత్యేక యానిమేషన్‌లు వస్తాయని పేర్కొంటున్నారు. ఆండ్రాయిడ్ 16లో అనేక కొత్త ఫీచర్లు, సెట్టింగ్‌లను కూడా తీసుకువస్తుందని స్పష్టం చేస్తున్నారు.
COMMENTS