Are notifications and calls annoying you when you're busy? Do this..!
Tech Tips: మీరు బిజీగా ఉన్నప్పుడు నోటిఫికేషన్లు, కాల్స్ చిరాకు పెడుతున్నాయా? ఇలా చేయండి..!
Tech Tips: ఏ యాప్‌లకు నోటిఫికేషన్‌లను నిశ్శబ్దం చేయాలో, వేటిని కొనసాగించాలో మీరు నిర్ణయించుకోవచ్చు. మీరు 'మినహాయింపు' జాబితాకు కొన్ని ముఖ్యమైన కాంటాక్ట్‌లను జోడించవచ్చు. తద్వారా మీరు DND మోడ్‌లో కూడా వారి కాల్‌లు లేదా సందేశాలను స్వీకరించవచ్చు. మీరు ఈ మోడ్‌ను నిర్దిష్ట సమయానికి..
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లే మన చేతుల్లో ప్రపంచం అయిపోయింది. షాపింగ్ నుండి బ్యాంకింగ్ వరకు, ముఖ్యమైన కార్యాలయ సమావేశాల నుండి ఆన్‌లైన్ చదువుల వరకు, ప్రతిదీ మొబైల్‌లోనే జరుగుతుంది. ఇది ఖచ్చితంగా అనుకూలమైనదే. కానీ ఈ సౌలభ్యంతో పాటు పెద్ద తలనొప్పి వస్తుంది. అది నిరంతరం వచ్చే కాల్స్, నోటిఫికేషన్లు! ఒక్కసారి ఆలోచించండి. మీరు ఒక ముఖ్యమైన సమావేశంలో ఉండగానో, లేదా రాత్రి బాగా నిద్రపోతున్న సమయంలో, కారు నడుపుతున్న సమయంలో అకస్మాత్తుగా ఫోన్ మోగుతుంది. లేదా సందేశం వస్తుంది. అలాంటి సందర్భాలలో చాలా మంది తమ ఫోన్‌లను ‘ఎయిర్‌ప్లేన్ మోడ్’లో ఉంచుతారు . కానీ అది మీ నెట్‌వర్క్‌ను పూర్తిగా ఆపివేస్తుంది. మీరు ముఖ్యమైన కాల్‌లు చేయలేరు లేదా ఇంటర్నెట్ కనెక్షన్‌ను కూడా పొందలేరు. మరి దీనికి పరిష్కారం ఏమిటి? డూనాట్ డిస్టర్బ్ (DND) మోడ్.
DND మోడ్ అంటే ఏమిటి?
DND మోడ్ అనేది మీ స్మార్ట్‌ఫోన్‌లో ఒక ఫీచర్. ఇది ప్రారంభించబడినప్పుడు మీ ఫోన్‌లో అనవసరమైన కాల్‌లు, నోటిఫికేషన్‌లను నివారించవచ్చు. ఎలాంటి శబ్దం రాకుండా మాకు ఆటంకం కలిగించవు.
DND లక్షణాలు
ఏ యాప్‌లకు నోటిఫికేషన్‌లను నిశ్శబ్దం చేయాలో, వేటిని కొనసాగించాలో మీరు నిర్ణయించుకోవచ్చు. మీరు ‘మినహాయింపు’ జాబితాకు కొన్ని ముఖ్యమైన కాంటాక్ట్‌లను జోడించవచ్చు. తద్వారా మీరు DND మోడ్‌లో కూడా వారి కాల్‌లు లేదా సందేశాలను స్వీకరించవచ్చు. మీరు ఈ మోడ్‌ను నిర్దిష్ట సమయానికి కూడా షెడ్యూల్ చేయవచ్చు.
ఆండ్రాయిడ్ ఫోన్‌లో DND మోడ్‌ను ఎలా ఆన్ చేయాలి?
మీ ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లండి.
సెర్చ్ బార్‌లో “డోంట్ డిస్టర్బ్” అని టైప్ చేయండి లేదా మీరు ఫోన్ పై నుండి క్రిందికి స్వైప్ చేసినప్పుడు కనిపించే క్విక్ సెట్టింగ్‌ల ప్యానెల్‌లో చంద్రవంక ఆకారంలో ఉన్న DND ఐకాన్ కోసం చూడండి.
DND మోడ్‌పై నొక్కి, దాన్ని ఆన్ చేయండి.
మీకు కావాలంటే అక్కడే షెడ్యూల్, అనుకూలీకరించడానికి ఎంపికలు మీకు కనిపిస్తాయి.
ఐఫోన్‌లో DND మోడ్‌ను ఎలా ఆన్ చేయాలి?
మీ ఐఫోన్ మోడల్ ఆధారంగా, స్క్రీన్ పై నుండి క్రిందికి లేదా దిగువ నుండి పైకి స్వైప్ చేయడం ద్వారా కంట్రోల్ సెంటర్‌ను తెరవండి.
అక్కడ “ఫోకస్” ఎంపికపై నొక్కండి.
ఇప్పుడు “DND” పై క్లిక్ చేయండి. దాన్ని ఆన్ లేదా ఆఫ్ చేయండి.
ఆండ్రాయిడ్ లాగే , ఇక్కడ కూడా మీరు సమయం, అవసరాన్ని బట్టి DND ని సెట్ చేసుకోవచ్చు. ‘సెట్టింగ్‌లు’ లోని ‘ఫోకస్’ ఎంపికకు వెళ్లడం ద్వారా మీరు DNDలో నోటిఫికేషన్‌లు కనిపించే ముఖ్యమైన కాంటాక్ట్‌లు లేదా యాప్‌లను ఎంచుకోవచ్చు. దీని వల్ల మీకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా చేసుకోవచ్చు.
COMMENTS