HOW TO APPLY FOR CM RELIEF FUND
సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేయడం ఎలా? - కావాల్సిన పత్రాలు ఏవి?
పేద, మధ్య తరగతి కుటుంబాలకు అండగా సీఎం సహాయనిధి - తగిన పత్రాలు సమర్పించి సీఎంఆర్ఎఫ్ చెక్కు పొందే అవకాశం.
How to Apply For CM Relief Fund : ప్రాణాంతక వ్యాధులు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న పేదలను సీఎంఆర్ఎఫ్(ముఖ్యమంత్రి సహాయ నిధి) ద్వారా ప్రభుత్వం ఆదుకుంటుంది. వైద్య చికిత్స కోసం కొంత మేర ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తుంది. సమాజంలోని బడుగు బలహీన వర్గాలు, తెల్లకార్డుదారులు, దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్‌కు) ఉన్న వారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులు. అయితే చాలా మందికి ఈ పథకం గురించి అంతగా అవగాహన లేదు. కొద్దిమందికి తెలిసినప్పటికీ అప్లై చేసుకునే విధానం తెలియదు. ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొన్ని రకాలైన వ్యాధులకు, సర్జరీలు, ఇతర వైద్య సదుపాయాలను పొందేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేయాల్సి రావొచ్చు. ఆరోగ్యశ్రీ పథకం ఉన్నప్పటికీ అన్ని జబ్బులు వాటి పరిధిలోకి రావు. అలాంటప్పుడు వారు ప్రైవేటు హాస్పిటల్స్‌కు వెళ్లి చికిత్స చేయించుకునే స్తోమత అందరికీ ఉండక పోవచ్చు. కానీ మెరుగైన వైద్య సహాయం తప్పనిసరి కావచ్చు. అలాంటప్పుడు ఉపయోగపడేదే సీఎం సహాయనిధి. ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత సంబంధిత ఖర్చులను తగిన బిల్లలను సమర్పించి సీఎం సహాయనిధి పొందవచ్చు.
సీఎం రిలీఫ్ ఫండ్ కోసం కావాల్సిన డాక్యుమెంట్లు :
హాస్పిటల్ రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రం
పేషెంట్ డిశ్ఛార్జి సమ్మరి
బ్యాంక్ అకౌంట్ నెంబర్
రేషన్ కార్డు వివరాలు
ఇన్ఫేషెంట్ వివరాలు
పైన వివరించిన పత్రాలు సిద్ధం చేసి స్థానిక ఎమ్మెల్యే సిఫార్సు లేఖను జతచేసి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. పూర్తిస్థాయి వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఎమ్మెల్యే ఆఫీస్నకు సమర్పించాలి. ఆయన పర్సనల్ అసిస్టెంట్ ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపిస్తాడు. వారు క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతారు. తర్వాత మూడు, నాలుగు మాసాల్లో ఖర్చు చేసిన డబ్బుల్లో కొంత మేర పేషెంట్ పేరిట చెక్కు రూపంలో విడుదల చేస్తారు.
COMMENTS