TS GOVT EXTENDED LRS SUBSIDY
ఎల్‌ఆర్‌ఎస్ రాయితీ పొడిగింపు - చివరి తేదీ ఎప్పుడంటే?
తెలంగాణ ప్రజలకు గుడ్న్యూస్ - ఎల్ఆర్ఎస్ రాయితీని ఏప్రిల్ 30 వరకు పొడిగించిన ప్రభుత్వం.
Telangana Govt Extended LRS Subsidy Till April 30th : ఎల్‌ఆర్‌ఎస్ రాయితీని నెలాఖరు వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గడువు మార్చి 31వ తేదీ నాటికి ముగిసింది. ప్రభుత్వం ఆశించిన మేరకు స్పందన రాలేదు. దీంతో మొత్తం మీద రెండు లక్షల ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు మాత్రమే పరిష్కారం కాగా వాటి ద్వారా ప్రభుత్వానికి వెయ్యి కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.
మరో 13లక్షలకు పైగా దరఖాస్తులు పరిష్కారం కావాల్సి ఉంది. దీంతో బుధవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నెలాఖరు వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి దాన కిషోర్ ఎల్‌ఆర్‌ఎస్ రాయితీని ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఎల్‌ఆర్‌ఎస్ చేయించుకునే వారికి ఫీజు మొత్తంలో 25శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా దరఖాస్తుల వివరాలను మున్సిపల్ అధికారులు వెల్లడించారు. మొత్తం 154 మున్సిపాలిటీల పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్ అప్లికేషన్లు 15,28,059 ఇందులో 15,894 దరఖాస్తులను తోచిపుచ్చారు. ఇప్పటి వరకు 6,87,428 ఎల్‌ఆర్ఎస్ దరఖాస్తులు ప్రాసెస్ అయ్యినట్లు అధికారులు తెలిపారు.
ఎల్‌ఆర్‌ఎస్ ప్రాసెస్ అయ్యి 8.65 లక్షలు ధరఖాస్తులకు చెంది ఫీ పెండింగ్ ఉన్నట్లు అధికారులు వివరించారు. ఇప్పటి వరకు 2,06,560 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకు చెంది ఫీజు చెల్లింపులు జరిగినట్లు తెలిపారు. ఇందులో 58,032 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకు చెంది ప్రక్రియ ముగిసి ప్రొసీడింగ్స్ ఇచ్చినట్లు వివరించారు.
COMMENTS