What is Zero-Click Hack?
Cyber Threat: ఎలాంటి క్లిక్ లేకుండా మొబైల్‌ను ఎలా హ్యాక్ చేస్తారు? జీరో-క్లిక్ హ్యాక్ అంటే ఏమిటి?
నేటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. మనం రోజంతా కాల్స్, సోషల్ మీడియా స్క్రోలింగ్ లేదా మెసేజింగ్ యాప్‌లతో గడుపుతాము. కానీ మనం డిజిటల్‌పై ఎంత ఎక్కువగా ఆధారపడుతున్నామో, సైబర్ నేరాలు కూడా అంతగా పెరుగుతున్నాయి. మోసగాళ్ల కొత్త మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. వాటిలో అత్యంత ప్రమాదకరమైన పద్ధతుల్లో ఒకటి ‘జీరో క్లిక్ హ్యాక్’. దీని ద్వారా స్కామర్లు మీరు ఏ లింక్‌పై క్లిక్ చేయకుండానే మీ డేటాను దొంగిలిస్తున్నారు.
నేటి డిజిటల్ యుగంలో మనం గంటల తరబడి మొబైల్ యాప్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లపై గడుపుతాము. అది వ్యక్తిగత లేదా వృత్తిపరమైన పని అయినా. కానీ మన డిజిటల్ ఉనికి పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసాల ముప్పు కూడా పెరుగుతోంది. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు ఈ మాల్వేర్ ద్వారా వాట్సాప్‌ను హ్యాక్ చేస్తున్నారు. ఫిషింగ్, డేటా దొంగతనం, మాల్వేర్ దాడులు ఇప్పుడు సర్వసాధారణం అయిపోయాయి. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని, తెలియని ఫైల్‌లపై క్లిక్ చేయడం, కొత్త కొత్త యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం లాంటివి చేయవద్దని టెక్ నిపుణులు సలహా ఇస్తున్నారు.
జీరో-క్లిక్ హ్యాక్ అంటే ఏమిటి?
రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఇజ్రాయెల్ స్పైవేర్ ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 మంది వ్యక్తుల డేటా దొంగిలించారు. ఈ హ్యాకింగ్ టెక్నిక్ కింద వినియోగదారుడు ఏ లింక్‌పై క్లిక్ చేయవలసిన అవసరం లేదు. హ్యాకర్లు వాట్సాప్, ఈమెయిల్స్ లేదా మల్టీమీడియా ఫైల్స్‌లను ఉపయోగించుకుని స్పైవేర్‌ను ఇన్‌స్టాల్ చేస్తారు. ఈ స్పైవేర్ ఫోన్‌లోకి ప్రవేశించిన వెంటనే, వినియోగదారుడి ప్రైవేట్ సమాచారం దొంగిలించడం మొదలు పెడతారు.
జీరో-క్లిక్ హ్యాక్ అనేది ఒక అధునాతన సైబర్ దాడి. ఇది సాధారణ ఫిషింగ్ దాడుల మాదిరిగా కాకుండా ఈ దాడులు చేస్తారు. దీని ద్వారా మీ వాట్సాప్‌ను హ్యాక్ చేసి వ్యక్తిగత డేటాను దొంగిలిస్తారు. ఇది మీ మొబైల్‌ను సైలెంట్ కిల్లర్‌లాగా హ్యాక్ చేస్తుంది. మెసేజింగ్ యాప్‌లు, ఇమెయిల్ క్లయింట్‌లు, మల్టీమీడియా ప్రాసెసింగ్ ఫంక్షన్‌లలో దాగి ఉన్న ఫైల్‌లను హ్యాకర్లు ఉపయోగించుకోవచ్చు. వారు ఒక హానికరమైన ఎలక్ట్రానిక్ మెసేజ్‌ను పంపుతారు. అది ఓపెన్ చేయకున్నా సిస్టమ్‌కు సోకుతుంది. ఎందుకంటే వాట్సాప్ ఎక్కువగా వినియోగిస్తుండటంతో వాట్సాప్ అకౌంట్‌ను టార్గెట్‌గా చేసుకుని మీ మొబైల్‌పై దాడి చేసి వ్యక్తిగత డేటాను సేకరిస్తారు హ్యాకర్లు. అందుకే మీ వాట్సాప్‌కు ఏదైనా తెలియని లింక్స్ వస్తే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు టెక్ నిపుణులు. అలాంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయవద్దు. అలా క్లిక్ చేస్తే మీ వివరాలు హ్యాకర్లకు త్వరగా తెలిసిపోతాయి. ఇలాంటి అనుమానాలు ఉంటే పోలీసులకు గానీ, సైబర్ నిపుణులకు గానీ సమాచారం అందించడం మంచిదంటున్నారు నిపుణులు. మీ ఫోన్ ఎటువంటి కారణం లేకుండా స్లో అవుతుంటే, బ్యాటరీ త్వరగా అయిపోతుంటే, లేదా మీకు తెలియని నంబర్ల నుండి నిరంతరం సందేశాలు వస్తుంటే, ఇవి మీ ఫోన్ హ్యాక్ అయిందని సంకేతాలు కావచ్చు.
వాట్సాప్ యూజర్లపై దాడి:
ఇటీవల వాట్సాప్ జీరో-క్లిక్ హ్యాక్ ద్వారా చాలా మంది వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్ కంపెనీ పారగాన్ సొల్యూషన్స్ అభివృద్ధి చేసిన స్పైవేర్ ఉపయోగించి ఈ దాడి జరిగింది. ఈ స్పైవేర్ జర్నలిస్టులు, సామాజిక సంస్థల సభ్యులతో సహా చాలా మంది వ్యక్తుల డేటాను యాక్సెస్ చేసింది. ఈ హ్యాక్‌కు సంబంధించి మెటా పారగాన్‌కు లీగల్ నోటీసు రాగా, వినియోగదారులకు భద్రత కల్పిస్తుందని హామీ ఇచ్చింది.
జీరో క్లిక్ హ్యాక్‌ను ఎలా నివారించాలి?
➦ మీ ఫోన్‌లోని అన్ని యాప్‌లను ఎల్లప్పుడూ అప్‌డేట్‌గా ఉంచండి. ఇది పాత బగ్‌లను పరిష్కరిస్తుంది. కొత్త భద్రతా లక్షణాలను అందిస్తుంది.
➦ మీ ఫోన్ బ్యాటరీ అకస్మాత్తుగా వేగంగా ఖాళీ కావడం ప్రారంభిస్తే లేదా ఫోన్‌లో ఏవైనా వింత మార్పులు గమనించినట్లయితే, అప్రమత్తంగా ఉండండి.
➦ తెలియని నంబర్ల నుండి సందేశాలు లేదా కాల్‌లను నివారించండి. అలాగే ఏదైనా అనుమానాస్పద కార్యాచరణ జరిగితే వెంటనే సైబర్ నిపుణుడిని సంప్రదించండి.
➦ వాట్సాప్, ఇమెయిల్‌లో వచ్చిన అవాంఛిత అటాచ్‌మెంట్‌లను వాటిని ధృవీకరించకుండా తెరవవద్దు.
➦ హ్యాకర్లు హానికరమైన ఫైల్‌ను పంపుతారు. దానిని సిస్టమ్ లేదా యాప్‌లు స్వయంచాలకంగా ప్రాసెస్ చేస్తాయి.
➦ దీని తరువాత హ్యాకర్లు మీ సందేశాలు, కాల్‌లు, ఫోటోలు, మైక్రోఫోన్, కెమెరాను యాక్సెస్ చేస్తారు.
➦ ఈ దాడి పూర్తిగా ఎలాంటి రిమోట్ లేకుండా జరుగుతుంది.
COMMENTS