Personality Test: The style of holding the mobile.. Tells what kind of person you are.. That's how you tell.
Personality Test: మొబైల్‌ను పట్టుకునే స్టైల్.. మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. అదెలాగో తెల్సా
ఒకరి వ్యక్తిత్వం గురించి తెలుసుకోవడానికి, వారితో కొంత సమయం గడిపితే చాలని కొందరు సైకాలజిస్టులు అంటుంటారు. అయితే ఇప్పుడు వారి పుట్టినరోజు, కంటి చూపు, చేతి హావభావాలు, చిరునవ్వు, ఇతర అంశాలతో కూడా మనిషి వ్యక్తిత్వాన్ని చెప్పొచ్చునని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే మీరు మీ మొబైల్‌ను పట్టుకునే విధానం కూడా మీ వ్యక్తిత్వాన్ని చెప్పేస్తుంది. అదెలాగంటారా.?
రెండు చేతులతో ఫోన్‌ను ఉపయోగిస్తే:
మొబైల్ ఫోన్‌ను రెండు చేతులతో ఉపయోగించే వ్యక్తులు సమర్థవంతమైన, త్వరగా నిర్ణయం తీసుకోవడంలో ముందుంటారు. ఈ వ్యక్తులు ఏ పరిస్థితి వచ్చినా.. దానికి అనుగుణంగా మారిపోతారు. అందువల్ల వీరు ప్రతీ రంగంలోనూ విజయాలు సాధిస్తారు. దృఢమైన వ్యక్తిత్వం వల్ల కొందరితో సన్నిహితంగా ఉండలేకపోతారు.
ఫోన్‌ని ఒక చేతిలో పట్టుకుని, స్క్రోల్ చేస్తే:
ఫోన్‌ని ఒక చేతిలో పట్టుకుని, స్క్రోల్ చేసే వ్యక్తులు అధిక విశ్వాసాన్ని కలిగి ఉంటారు. అందువల్ల, అతను జీవితంలో రిస్క్ తీసుకోవడానికి భయపడడు. ఈ వ్యక్తులు చాలా తెలివైనవారు, విజయవంతమైన జీవితాన్ని గడపగలరు. ఏ వ్యక్తినైనా అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది.
ఒక చేతిలో ఫోన్, మరో చేతి చూపుడు వేలితో స్క్రోల్ చేస్తే:
ఇలా మొబైల్ ఉపయోగించే వ్యక్తులు జీవితంలో సృజనాత్మక ఆలోచనలు కలిగి ఉంటారు. ఎక్కువగా ఏకాంతాన్ని ఇష్టపడే వ్యక్తులు. వారికి సిగ్గు ఎక్కువ. కొత్త వ్యక్తులతో సంబంధాలను పెట్టుకోలేరు.
ఒక చేతిలో ఫోన్‌ని పట్టుకుని, మరో చేతి బొటనవేలుతో స్క్రోల్ చేస్తే:
ఇలా ఫోన్‌ని ఉపయోగించే వ్యక్తులు తెలివైన, సహేతుకమైనవారు. ఈ వ్యక్తులు మొత్తం పరిస్థితిని విశ్లేషించి, తద్వారా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ వ్యక్తులు ఆలోచించి ప్రవర్తించడం వల్ల మోసపోయే అవకాశం తక్కువ. ఈ వ్యక్తుల జీవితంలో ప్రేమ ప్రధాన లోపం. భాగస్వామితో వాగ్వవాదాలకు ఎక్కువగా గురికావడం త్వరగా సంబంధాన్ని కోల్పోయేలా చేసుకుంటారు.
COMMENTS