Reliance Foundation Undergraduate Scholarships 2024-25
Reliance Foundation invites applications for 5000 UG and one hundred PGs for the academic year 2024-2025. Financial incentive will continue till completion of course for selected candidates. These are offered on the basis of merit cum means.
Those who get this opportunity can get encouragement up to Rs.2 lakhs during UG degree period. PG will get up to Rs.6 lakhs. The scholarship can be availed for tuition/hospital fee, laptop, academic books, courses. They also get career support from Reliance Foundation. A certain amount is deposited in the student's bank account every year. Along with cash incentives, soft skills training, workshops, Alamni network connectivity etc. are also available. Those receiving other scholarships can also apply for these.
How to apply
UG or PG first year students have to register complete details on Reliance Foundation website. Passport size photograph, address proof, ten, inter mark documents, bonafide certificate from current college/institution, family annual income details, relevant proof documents in case of disabled should be uploaded. Those who have successfully completed the application will receive information on what date and at what time the online aptitude test will be conducted.
What are the qualifications:
Only those studying in the first year of any UG course on regular basis should apply for these. There is no upper age limit. Those studying online, distance education, remote mode, second and third year courses are not available.
Parents are eligible only if their annual income is less than Rs.15 lakhs. Preference will be given to those under Rs.2.5 lakhs.
There should be 60 percent marks in Inter/Plus 2. There is no opportunity for those who have completed diploma after ten.
At PG level
Those studying Artificial Intelligence, Computer Science, Mathematics and Computing, Electrical, Electronics, Mechanical, Chemical, Renewable and New Energy, Materials Science and Engineering, Life Sciences courses can apply for these in any institution in the country. A total of Rs.6 lakhs will be provided for the duration of the course. 80 percent of this is at the beginning of the academic year, while the remaining 20 percent is professional development, conferences, personal development. Pay for other expenses. Meeting with experts and raising awareness about the relevant field is part of this scholarship.
Enter details
Eligibility question should be completed on Reliance Foundation website. Details of personal, academic and extracurricular activities should be recorded. Two reference letters should be attached. One of these should be academic skills, the other should be personality and leadership qualities. In both essays. One should write a personal statement and the other a statement of purpose. Online aptitude test will also be conducted for them. Answers to 60 multiple questions should be identified within an hour. These are asked from verbal, analytical and logical and numerical abilities (which are conducted in the same way as the UG exam). Industry experts, academicians and those at the leadership level in the relevant department form a team and examine the applications. Interview preparation and webinars will be available for those who are under consideration. A team of experts will conduct the interview in virtual mode. Scholarships are granted to a hundred people.
UG Exam
It is in remote proctored mode. With internet facility computer/laptop holders can take this online exam from home and those who don't can go to any internet center and complete it. Camera and microphone should be kept on. They are monitored. Exam duration is one hour. There will be 60 multiple choice questions. One mark for each question. Verbal, Analytical and Logical and Numerical Ability questions are 20 each from each section. Each section should be completed in 20 minutes. In verbal ability. There will be questions of spotting error, sentence completion, grammar, reading comprehension.
Analytic and logical ability involves questions about problem solving, finding reasons, and finding a solution. In Numerical Ability. Ask from ratio, percentage, number sequence, data interpretation. Online practice test will be made available on the drug website for the exam week. Eligible candidates will be selected on the basis of aptitude test score, academic and personal information. Preference will be given to female students and disabled persons. The details of the selected candidates will be announced in December.
Eligibility: Should be studying PG first year course. Gate score should be between 550-1000. Those who do not take this exam are ineligible despite having CGPA of more than 7.5)
Last date for applications: October 6 (for both UG and PG)
రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్ షిప్ లు 2024-25
2024-2025 విద్యా సంవత్సరానికి 5000 మంది యూజీ, వంద మంది పీజీలకు అవకాశమివ్వడానికి దరఖాస్తులు రిలయెన్స్ ఫౌండేషన్ ఆహ్వానిస్తోంది. ఎంపికైనవారికి కోర్సు పూర్తయ్యేంతవరకు ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది. మెరిట్ కమ్ మీన్స్ ప్రాతిపదికన వీటిని అందిస్తున్నారు.
ఇలా అవకాశం వచ్చినవారు యూజీ డిగ్రీ వ్యవధిలో రూ.2 లక్షల వరకు ప్రోత్సాహం పొందవచ్చు. పీజీ వాళ్లైతే రూ.6 లక్షల వరకు దక్కుతుంది. స్కాలర్షిప్పును ట్యూషన్/ హాస్టల్ ఫీజు, ల్యాప్టాప్, అకడమిక్ పుస్తకాలు, కోర్సుల కోసం వినియోగించుకోవచ్చు. వీరికి రిలయన్స్ ఫౌండేషన్ నుంచి కెరియర్ పరమైన సహకారమూ లభిస్తుంది. ఏటా కొంత మొత్తాన్ని విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. నగదు ప్రోత్సాహకంతోపాటు సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ, వర్క్షాపులు, అలమ్నీ నెట్వర్క్ అనుసంధానం మొదలైనవన్నీ అదనంగా లభిస్తాయి. ఇతర స్కాలర్షిప్పులు పొందుతున్నవారూ వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఎలా చేసుకోవాలి
యూజీ లేదా పీజీ ప్రథమ ఏడాది విద్యార్థులు రిలయెన్స్ ఫౌండేషన్ వెబ్సైట్లో పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలి. పాస్పోర్టు సైజు ఫొటో, అడ్రస్ ప్రూఫ్, పది, ఇంటర్ మార్కుల పత్రాలు, ప్రస్తుత కళాశాల/ సంస్థ నుంచి బోనఫైడ్ సర్టిఫికెట్, కుటుంబ వార్షికాదాయ వివరాలు, దివ్యాంగులైతే సంబంధిత రుజువు పత్రాలు ఇవన్నీ అప్లోడ్ చేయాలి. విజయవంతంగా దరఖాస్తు పూర్తిచేసుకున్నవారికి ఏ తేదీ, ఏ సమయంలో ఆన్లైన్ ఆప్టిట్యూడ్ పరీక్ష నిర్వహిస్తారో సమాచారం అందుతుంది.
అర్హతలేమిటి:
ఏదైనా యూజీ కోర్సు మొదటి సంవత్సరం రెగ్యులర్ విధానంలో చదువుతున్నవారే వీటికి దరఖాస్తు చేసుకోవాలి. గరిష్ఠ వయసు నిబంధన లేదు. ఆన్లైన్, దూరవిద్య, రిమోట్ విధానంలో చదువుతున్నవారికి, ద్వితీయ, తృతీయ సంవత్సరం కోర్సుల వారికి అవకాశం లేదు.
తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.15 లక్షల లోపు ఉంటేనే అర్హులు. రూ.2.5 లక్షల లోపు ఉన్నవారికి ప్రాధాన్యం.
ఇంటర్/ప్లస్ 2లో 60 శాతం మార్కులు ఉండాలి. పది తర్వాత డిప్లొమా పూర్తిచేసుకున్నవారికి అవకాశం లేదు.
పీజీ స్థాయిలో:
దేశంలో ఏదైనా సంస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కెమికల్, రెన్యూవబుల్ అండ్ న్యూ ఎనర్జీ, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, లైఫ్ సైన్సెస్ కోర్సులు చదువుతున్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవధికి మొత్తం రూ.6 లక్షల వరకు అందిస్తారు. ఇందులో 80 శాతం విద్యా సంవత్సరం ప్రారంభంలో, మిగతా 20 శాతం ప్రొఫెషనల్ డెవలప్మెంట్, కాన్ఫరెన్సులు, పర్సనల్ డెవలప్మెంట్... తదితర ఖర్చుల కోసం చెల్లిస్తారు. నిపుణులతో సమావేశం, సంబంధిత రంగంపై అవగాహన పెంచడం ఈ స్కాలర్షిప్పులో భాగం.
వివరాల నమోదు:
రిలయన్స్ ఫౌండేషన్ వెబ్సైట్లో ఎలిజిబిలిటీ క్వశ్చనీర్ను పూర్తిచేయాలి. పర్సనల్, అకడమిక్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వివరాలు నమోదు చేసుకోవాలి. రెండు రిఫరెన్స్ లెటర్లు జతచేయాలి. వీటిలో ఒకటి అకడమిక్ నైపుణ్యాలు, రెండోది వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు తెలిపేది కావాలి. రెండు ఎస్సేల్లో.. ఒకటి పర్సనల్ స్టేట్మెంట్, రెండోది స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ రాసివ్వాలి. వీరికి ఆన్లైన్ ఆప్టిట్యూడ్ పరీక్షనూ నిర్వహిస్తారు. గంట వ్యవధిలో 60 మల్టిపుల్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. వెర్బల్, ఎనలిటికల్ అండ్ లాజికల్, న్యూమరికల్ ఎబిలిటీల నుంచి వీటిని అడుగుతారు (యూజీ పరీక్ష మాదిరిగానే దీన్నీ నిర్వహిస్తారు). ఇండస్ట్రీ నిపుణులు, అకడమిషియన్లు, సంబంధిత విభాగంలో నాయకత్వ స్థాయిలో ఉన్నవారు బృందంగా ఏర్పడి దరఖాస్తులు పరిశీలిస్తారు. ఇలా పరిశీలనలో నిలిచినవారికి ఇంటర్వ్యూ ప్రిపరేషన్, వెబినార్లు ఉంటాయి. నిపుణుల బృందం వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఇందులో మేటి వంద మందికి స్కాలర్షిప్పులు మంజూరు చేస్తారు.
యూజీ పరీక్ష:
ఇది రిమోట్ ప్రోక్టర్డ్ విధానంలో ఉంటుంది. ఇంటర్నెట్ సౌకర్యంతో కంప్యూటర్/ల్యాప్టాప్ ఉన్నవారు ఇంటి వద్ద నుంచే ఈ ఆన్లైన్ పరీక్ష రాసుకోవచ్చు లేనివారు ఏదైనా ఇంటర్నెట్ కేంద్రానికి వెళ్లి పూర్తిచేసుకోవచ్చు. కెమెరా, మైక్రోఫోన్ ఆన్లో ఉంచాలి. వాటిద్వారా పర్యవేక్షణ ఉంటుంది. పరీక్ష వ్యవధి ఒక గంట. 60 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నలకు ఒక మార్కు. వెర్బల్, అనలిటికల్ అండ్ లాజికల్, న్యూమరికల్ ఎబిలిటీ ప్రశ్నలు ఒక్కో విభాగం నుంచీ 20 చొప్పున ఉంటాయి. ప్రతి సెక్షనూ 20 నిమిషాల్లో పూర్తిచేయాలి. వెర్బల్ ఎబిలిటీలో.. స్పాటింగ్ ఎర్రర్, సెంటెన్స్ కంప్లీషన్, గ్రామర్, రీడింగ్ కాంప్రహెన్షన్ ప్రశ్నలు వస్తాయి.
అనలిటిక్ అండ్ లాజికల్ ఎబిలిటీలో సమస్యనువిశేపించడం కారణాలు కనుక్కోవడం, పరిష్కారాన్ని గుర్తించడంపై ప్రశ్నలుంటాయి. న్యూమరికల్ ఎబిలిటీలో.. రేషియో, పర్సంటేజీ, నంబర్ సీక్వెన్స్, డేటా ఇంటర్ప్రైటేషన్ నుంచి అడుగుతారు. పరీక్షకు వారం మందు వెబ్సైట్లో ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్టు అందుబాటులో ఉంచుతారు. ఆప్టిట్యూడ్ టెస్టు స్కోరు, అకడమిక్, పర్సనల్ సమాచారం ఆధారంగా అర్హులను ఎంపికచేస్తారు. విద్యార్థినులు, దివ్యాంగులకు ప్రాధాన్యం. ఎంపికైనవారి వివరాలు డిసెంబరులో ప్రకటిస్తారు.
అర్హత: పీజీ తొలి సంవత్సరం కోర్సు చదువుతుండాలి. గేట్ స్కోరు 550-1000 మధ్య ఉండాలి. ఈ పరీక్ష రాయనివాళ్లెతే 7.5 కంటే ఎక్కువ సీజీపీఏ ఉన్నప్పటికీ అనర్హులే).
దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 6 (యూజీ, పీజీ రెండింటికీ).
Important Links:
FOR APPLY CLICKHERE.
COMMENTS