CBSE: Central Teacher Eligibility Test (CETT (CETT) December -2024
It is known that the Central Teachers Eligibility Test (CET) is conducted every year for those who choose the teaching profession as a career. This exam is conducted by Central Board of Secondary Education (CBSE). The CET exam is conducted twice every year. The latest CET notification for the year December-2024 has been released. The process of CET registrations will continue from September 17 to October 16. The exam will be conducted on December 1 on OMR basis.
details.
Central Teacher Eligibility Test (CETT (2024) December -2024
Exam Pattern: The entire exam consists of two papers. The first paper is for those who want to teach classes one to five, and the second paper is for those who want to teach classes six to nine. Seatet score has a long life validity. The exam will be conducted in 20 languages. The CET score is taken into account in the recruitment of teachers of schools under the Central Government.
Qualifications: Twelve Class, Degree, DEL ED/DED (Special Education), BED, BED (Special Education), BEL ED/ BScED/ BAED/ BScED.
Application Fee: For General/OBC categories Rs.1000 (paper 1 or 2 only), Rs.1200 (both Paper 1 & 2). For SC/ST/Disabled: Rs.500 (Paper 1 or 2 only), Rs.600 (Paper 1 & 2 both).
Examination Centers in Telugu States: Guntur, Tirupati, Vijayawada, Visakhapatnam, Hyderabad, Warangal.
Important Dates:
- Start of Online Application Process: 17.09.2024.
- Last Date for Online Application: 16.10.2024.
- Last Date of Payment of Fees: 16.10.2024.
- Application Amendment Dates: 21.10.2024 to 25.10.2024.
- OMR Based Test Date: 01-12-2024.
- Result Disclosure: January, 2025.
CBSE: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) డిసెంబర్-2024
ఉపాధ్యాయ వృత్తిని కెరీర్‌గా ఎంచుకునే వారి కోసం ప్రతీ ఏటా సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) నిర్వహిస్తోంది. సీటెట్ పరీక్ష ప్రతి ఏడాది రెండుసార్లు జరుగుతుంది. తాజాగా డిసెంబర్-2024 ఏడాదికి సంబంధించిన సీటెట్ నోటిఫికేషన్ విడుదలైంది. సీటెట్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు కొనసాగనుంది. డిసెంబర్ 1న పరీక్షను ఓఎమ్మార్ ఆధారితంగా నిర్వహించనున్నారు.
వివరాలు...
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్) డిసెంబర్-2024
పరీక్ష విధానం: పరీక్ష మొత్తం రెండు పేపర్‌లను కలిగి ఉంటుంది. మొదటి పేపర్ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం, రెండో పేపర్ ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. పరీక్షను 20 భాషలలో నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.
అర్హతలు: పన్నెండో తరగతి, డిగ్రీ, డీఈఎల్‌ఈడీ/ డీఈడీ (ప్రత్యేక విద్య), బీఈడీ, బీఈడీ(ప్రత్యేక విద్య), బీఈఎల్‌ఈడీ/ బీఎస్సీఈడీ/ బీఏఈడీ/ బీఎస్సీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ కేటగిరీలకు రూ.1000(పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.1200(పేపర్ 1 & 2 రెండూ). ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు: రూ.500(పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.600(పేపర్ 1 & 2 రెండూ).
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్.
ముఖ్య తేదీలు:
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.09.2024.
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 16.10.2024.
- ఫీజు చెల్లింపు చివరి తేది: 16.10.2024.
- దరఖాస్తు సవరణ తేదీలు: 21.10.2024 నుంచి 25.10.2024 వరకు.
- ఓఎమ్మార్ ఆధారిత పరీక్ష తేదీ: 01-12-2024.
- ఫలితాల వెల్లడి: జనవరి, 2025.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR APPLY CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS