GATE 2025: Graduate Aptitude Test in Engineering (GATE)-2025.
GATE 2025: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2025.
దేశంలోని ఐఐటీలు, ఇతర సంస్థల్లో ఎంటెక్‌లో ప్రవేశానికి నిర్వహించే ‘గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(గేట్)-2025’ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో జరగనున్నాయి. ఈసారి ఆన్లైన్ పరీక్షల నిర్వహణ బాధ్యత ఐఐటీ రూర్కీ చేపట్టింది. వెబ్‌సైట్‌తో పాటు దరఖాస్తు తేదీలను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. మొత్తం 30 సబ్జెక్టుల్లో పరీక్షలు జరగనున్నాయి.
నియామకాల్లో ప్రాధాన్యం:
• గేట్ స్కోర్‌ను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు సైతం పరిగణనలోకి తీసుకుంటారు. బీటెక్ విద్యార్థులు మూడో సంవత్సరం చదువుతున్న వారూ దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి సంవత్సరం చదువుతున్న డిగ్రీ విద్యార్థులూ(బీఏ, బీకాం, బీఎస్సీ) పోటీపడవచ్చు.
• గేట్ స్కోర్ ద్వారా ఎంటెక్‌లో చేరితే నెలకు రూ.12,400ల చొప్పున స్కాలర్షిప్ అందజేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఆ స్కోర్ ఉన్నవాళ్లకు ప్రవేశాల్లో తొలి ప్రాధాన్యం ఇస్తారు. ఐఐటీలు గేట్ స్కోర్‌తో నేరుగా పీహెచ్‌డీలో కూడా ప్రవేశాలు ఇస్తున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 24- సెప్టెంబర్ 26 తేదీల్లో ఉంటుంది.
ప్రకటన వివరాలు:
• గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2025
‣ అర్హతలు: ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, హ్యూమానిటీస్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
‣ వయసు: అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి లేదు.
‣ దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
‣ ఆంధ్రప్రదేశ్‌లో పరీక్ష నిర్వహించే ప్రాంతాలు: చీరాల, చిత్తూరు, గుంటూరు, కడప, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, అనంతపురం, కర్నూల్, ఏలూరు, కాకినాడ, సూరంపాలెం, రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం.
‣ తెలంగాణలో పరీక్ష నిర్వహించే ప్రాంతాలు: హైదరాబాద్, మెదక్, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్
ముఖ్య తేదీలు:
‣ ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం: 24-08-2024.
‣ ఆన్లైన్ రిజిస్ట్రేషన్/ దరఖాస్తు ప్రక్రియ ముగింపు తేదీ: 26-09-2024.
‣ ఆన్లైన్ రిజిస్ట్రేషన్/ దరఖాస్తు ప్రక్రియ ముగింపు తేదీ (ఆలస్య రుసుముతో): 07-10-2024.
‣ పరీక్ష తేదీలు: వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో జరగనున్నాయి.
ముఖ్యంశాలు:
‣ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE) ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్- పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష.
‣ దీంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో(PSU) ఇంజినీర్ ఉద్యోగాలకు గేట్ స్కోర్ ప్రామాణికంగా తీసుకుంటారు.
‣ ఏటా దేశవ్యాప్తంగా లక్షల మంది ఈ పరీక్షకు హాజరవుతున్నారు.
‣ తాజాగా గేట్-2025 నోటిఫికేషన్, పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యాయి.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
COMMENTS