LPSC: Technical Assistant Jobs in LPSC.
LPSC: ఎల్‌పీఎస్‌సీలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు.
తిరువనంతపురంలోని ఇస్రోకు చెందిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్‌పీఎస్‌సీ).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, ఇతర పోస్టులకు దరఖాస్తులను కోరుతోంది.
పోస్టు పేరు- ఖాళీలు:
1. టెక్నికల్ అసిస్టెంట్ (11)
2. టెక్నీషియన్-బి (11)
3. హెవీ వెహికల్ డ్రైవర్ (ఎ)- (05)
4. లైట్ వెహికల్ డ్రైవర్ (ఎ)- (02)
5. కుక్ (01)
మొత్తం ఖాళీల సంఖ్య: 30.
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, వెల్డర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, టర్నర్, మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, మెషినిస్ట్ తదితరాలు.అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణతతో పని అనుభవం ఉండాలి. డ్రైవర్ పోస్టుకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్/ లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, పబ్లిక్ సర్వీస్ బ్యాడ్జీ తప్పనిసరి.
వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు రూ.44,900-రూ.1,42,400; టెక్నీషియన్-బి పోస్టులకు రూ.21,700-రూ.69,100; ఇతర పోస్టులకు రూ.19,900-రూ.63,200.
పని ప్రదేశాలు: బెంగళూరు, వలియామల.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ తదితరాల ఆధారంగా..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.750; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ సర్వీస్‌మెన్/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు చివరి తేదీ: 10-09-2024.
ముఖ్యాంశాలు:
* ఎల్‌పీఎస్‌సీ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
* ఎంపికైన అభ్యర్థులు బెంగళూరు, వలియామలలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
* దరఖాస్తు గడువు: సెప్టెంబరు 10.
Important Links:
FOR NOTIFICATION CLICKHERE.
FOR WEBSITE CLICKHERE.
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
COMMENTS