Want to enjoy spring in summer.. Hello Thailand.. Visa free for another six months..
వేసవిలో వసంతాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.. చలో థాయిలాండ్.. మరో ఆరు నెలలు వీసా ఫ్రీ..
వేసవి కాలంలో పిల్లలకు సుదీర్ఘ సెలవులు వస్తాయి. అంతేకాదు వేసవి తాపం నుంచి ఉపసమనం కోసం దేశ విదేశాల్లోని ప్రకృతి అందాలతో నిండి ఉండే ప్రదేశాలకు వెళ్ళడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు. అయితే ఫ్రెండ్లీ బడ్జెట్ ఉంటె విదేశాలకు వెళ్ళడానికి ఆసక్తిని చూపించే వారి సంఖ్యకూడా తక్కువేం కాదు. అలా విదేశాలలో పర్యటనకు వెళ్లాలనుకునే భారతీయులకు థాయిలాండ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా తర్వాత కుదేలైన పర్యాటక రంగాన్ని గాడిన పెట్టె ప్రయత్నంలో.. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు థాయిలాండ్ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఇప్పటికే తమ దేశానికి వచ్చే పర్యాటక భారతీయులకు ఇస్తున్న వీసా ఫ్రీ నిబంధనను పొడిగిస్తున్నట్లు ఆ దేశం వెల్లడించింది. పర్యాటక వీసా మినహాయింపుని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
దీంతో థాయిలాండ్ వెళ్లాలనుకునే పర్యాటకులకు వీసా అవసరం ఉండదు. పాస్‌పోర్టు ఉన్నవారు ఆ దేశంలో నెల రోజుల పాటు పర్యటించవచ్చు. వాస్తవానికి భారత దేశం, తైవాన్ ల నుంచి తమ దేశంలో వచ్చే పర్యాటకులకు వీసాఫ్రీ నిబంధనను గత ఏడాది2023 నవంబరు 10 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఈ గడువు నేటితో (మే10 వ తేదీ) ముగుస్తుంది. తాము తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలను ఇస్తుండడంతో ఈ వీసా నిబంధనను మరో ఆరు నెలల పాటు భారీయులకు సడలింపు ఇచ్చింది. ఈ మేరకు రాయల్ థాయ్ క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నిబంధన నవంబరు 11, 2024 వరకు అమల్లో ఉండనున్నది.
అయితే భారతదేశం నుంచి థాయ్‌లాండ్‌కు వెళ్ళడానికి 4 గంటలు పడుతుంది. దీని ప్రకృతి అందాలతో అగ్ర పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. ఈ దేశాన్ని ది ల్యాండ్ ఆఫ్ స్మైల్స్ అని పిలుస్తారు. థాయిలాండ్ ఒక ఉష్ణమండల దేశం. ఏడాది పొడవునా ఉష్ణోగ్రత ఉంటుంది. థాయిలాండ్ సందర్శించడానికి వసంతకాలం అంటే మార్చి నుండి మే వరకు ఉత్తమ సమయం. ఈ సమయంలో ఆ దేశంలో ఉష్ణోగ్రతలు 29°C-34°C మధ్య ఉంటాయి.
COMMENTS