Heart Health: Link to heart health, dinner.. Interesting things in research..
Heart Health: గుండె ఆరోగ్యానికి, రాత్రి భోజనానికి లింకు.. పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు..
మనం తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనలేదు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే అనారోగ్యం బారిన తక్కుపడుతుంటాం. అదే అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే ఎక్కువ వ్యాధులు వస్తుంటాయి. ఇది మనందరికీ తెలిసిందే. అయితే ఆహారం తీసుకునే సమయంపై కూడా మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా.? తాజాగా నిర్వహించి ఓ అధ్యయనంలో కూడా ఇదే విషయం వెల్లడైంది.
రాత్రి ఆలస్యంగా భోజనం చేసే వారిలో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అధ్యయనంలో తేలింది. ఫ్రాన్స్‌కు చెందిన పరిశోధకలు భోజన వేళలు, గుండె ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న అంశంపై నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. ఉదయం 8 గంటలకు టిఫిన్, రాత్రి 8 గంటలకు డిన్నర్ చేసే వారిలో గుండె, రక్తనాళాలకు మేలు చేస్తున్నట్టు ఈ పరిశోధనలో తేలింది. ఈ లెక్కన రాత్రి మాత్రమే కాకుండా ఉదయం చేసే టిఫిన్ కూడా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఉదయం టిఫిన్ ఆలస్యమవుతున్న ప్రతి గంటకూ 6% చొప్పున గుండెజబ్బు ముప్పు పెరుగుతున్నట్టు పరిశోధకులు కనుగొన్నారు. అలాగే రాత్రి ఆలస్యంగా భోజనం చేసే వారిలోనూ గుండె సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్లు చెబుతున్నారు. రాత్రి 9 గంటల తర్వాత భోజనం చేసే వారిలో గుండె జబ్బు వచ్చే అవకాశం 282 శాతం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అందుకే రాత్రి తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
ఒకే సమయానికి భోజనం అలవాటు చేసుకోవడం ద్వారా చాలా వరకు గుండె సంబంధిత సమస్యలను తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి లక్షకు సగటున 235 మంది గుండెరక్తనాళ జబ్బు(సీవీడీ)తో మరణిస్తుండగా.. మనదేశంలో సగటున 272 మంది చనిపోతున్నట్టు 2020 నాటి గ్లోబల్ బర్డెన్ డిసీజ్ అధ్యయనం పేర్కొంటోంది. ఇక తీసుకునే ఆహారం పాటు, కొన్ని రకాల జీవన విధానాల్లో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే గుండె ఆరోగ్యంగా ఉంటుందని సూచిస్తున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
COMMENTS