Nails Colour: Does nail color really indicate cancer risk? What do the experts say?
Nails Colour: గోళ్ల రంగు నిజంగా క్యాన్సర్ ప్రమాదాన్ని తెలియజేస్తుందా? నిపుణుల ఏమంటున్నారంటే..
ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. రోజు రోజుకీ క్యాన్సర్ బారిన పడిన బాధితుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతోంది. దీనికి కారణం క్యాన్సర్ వ్యాధిని మొదట్లోనే గుర్తించలేక పోవడం. దీంతో రోగి ప్రాణాలను కాపాడడం పెను సవాలుగా మారుతోంది. చాలా క్యాన్సర్ కేసులు అడ్వాన్స్డ్ స్టేజ్ అంటే చివరి దశలో వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యాధి లక్షణాలు గుర్తించబడకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. అయితే ఇప్పుడు క్యాన్సర్ లక్షణాలకు సంబంధించి ఓ కొత్త పరిశోధన బయటకు వచ్చింది. అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. పరిశోధనలు గోళ్లకు.. క్యాన్సర్‌కు మధ్య సంబంధాన్ని గుర్తించారుగోళ్లపై ఎర్రటి చార ఏర్పడటం క్యాన్సర్ లక్షణం అని పరిశోధనలు చెబుతున్నాయి.
గోళ్ల రంగులో మార్పు వస్తే అది ఒంచా పాపిల్లోమా వ్యాధి అని పరిశోధనలో తేలింది. దీని కారణంగా గోరు రంగు మారడం ప్రారంభమవుతుంది. గోరుపై ఎర్రటి గీత ఏర్పడుతుంది. గోరు చివర నుంచి గట్టిపడటం ప్రారంభమవుతుంది. జన్యుపరమైన కారణాల వల్ల ఇది జరగవచ్చు. BAP1 సిండ్రోమ్‌తో బాధపడుతున్న వ్యక్తులు ప్రమాదంలో ఉన్నట్లే. BAP1 సిండ్రోమ్ ఒక జన్యుపరమైన రుగ్మత. దీని కారణంగా శరీరంలో క్యాన్సర్ , క్యాన్సర్ కాని కణితులు ఏర్పడతాయి. ఈ కణితుల వల్ల చర్మం, కంటి, కిడ్నీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
పరిశోధన ఎలా జరిగిందంటే?
35 కుటుంబాలకు చెందిన 45 మందిని పరిశోధనలో చేర్చారు. ఈ 35 కుటుంబాలకు చెందిన వ్యక్తులు BAP1 సిండ్రోమ్‌తో బాధపడుతున్నారు. ఈ సిండ్రోమ్‌తో బాధపడుతున్న 88 శాతం మందిలో ఒంచా పాపిల్లోమా వ్యాధి ఉంది. దీని కారణంగా కణితి ఏర్పడింది. ఇది క్యాన్సర్ లక్షణం. అటువంటి పరిస్థితిలో.. వీరి గోళ్ల రంగు మారుతున్నప్పుడు లేదా గోరు కొన మందంగా మారుతున్నట్లయితే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను చేయాలని శాస్త్రవేత్తలు ప్రజలకు సూచించారు. కుటుంబంలో ఎవరికైనా ఇంతకు ముందు క్యాన్సర్ ఉంటే.. పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. గర్భిణీ స్త్రీలు. ఏదైనా రక్త వ్యాధి ఉన్న రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి.
క్యాన్సర్ కు సంబంధించిన ఇతర లక్షణాలు ఏమిటి?
- ఆకస్మిక బరువు నష్టం
- శరీరంలోని ఏదైనా భాగంలో గడ్డ
- ఎప్పుడూ అలసటగా అనిపించడం
- తేలికపాటి జ్వరం కలిగి ఉండడం
నిపుణులు ఏమంటున్నారంటే
ఢిల్లీ క్యాన్సర్ హాస్పిటల్ మాజీ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ కిషోర్ సింగ్ మాట్లాడుతూ.. భారత్‌లో ఇలాంటి పరిశోధనలు ఇంకా జరగలేదన్నారు. అయితే క్యాన్సర్ రోగులలో గోరు రంగు మారవచ్చు. అలాంటి సందర్భాలు చాలా తక్కువ. గోళ్లలో మార్పులు క్యాన్సర్ లక్షణాలను సుచిస్తాయని పరిశోధన ఫలితాలు చెబుతున్నాయి. అటువంటి పరిస్థితిలో ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరిస్తున్నారు.
COMMENTS