Cold Drinks for Indigestion: Are you drinking cold drinks to prevent gas in the stomach? Find out how much risk
Cold Drinks for Indigestion: కడుపులో గ్యాస్ సమస్య నివారణకు కూల్ డ్రింక్ తాగుతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసుకోండి.
ఏవయసు వారైనా బయటి ఆహారాలు తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. బయటి ఆహారాన్ని తినడం ద్వారా గ్యాస్-హార్ట్ బర్న్ మొదలవుతుంది. సాధారణంగా బయటి ఆహారాలు కొంచెం ఎక్కువ కారంగా ఉంటాయి. పైగా ఎక్కువ వేయించి తినడం వల్ల గుండెల్లో మంట వచ్చి, ఉక్కిరిబిక్కిరి అవుతుంది. కడుపులో అజీర్తి చేసినప్పుడు కొందరు చల్లని శీతల పానీయాలు తాగుతుంటారు. తద్వారా గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని భావిస్తుంటారు. అలాగే మరికొంతమంది ఉప్పు నీటిని తాగుతుంటారు. ఇది ప్రేగులను శుభ్రం చేసి, కదలికలను సులువు చేస్తుంది. కొందరు కడుపులో అసౌకర్యాన్ని తగ్గించుకోవడానికి చల్లని నీరు కూడా తాగుతారు. అయితే అజీర్తిని నివారించడానికి ఏ నీరు తాగితే ఉపశమనం కలుగుతుంది? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దీనికి సమాధానం ఇక్కడ తెలుసుకుందాం..
యాంటాసిడ్లు వేసుకుంటే..
అజీర్తిని నివారించడానికి యాంటాసిడ్ మందులు వినియోగిస్తుంటారు. కానీ ఇవి అన్ని వేళలా అందుబాటులో ఉండవు. అంతేకాకుండా ఎక్కువ సార్లు యాంటాసిడ్‌లు తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి చాలా మంది ఇంట్లోనే అజీర్తి సమస్య నుంచి ఉపశమనం పొందటానికి ఇంటి చిట్కాలు వినియోగిస్తుంటారు. కోరుకుంటారు. కొందరు జీలకర్ర నీరు తాగడం ద్వారా ఉపశమనం పొందుతారు. అయితే చాలా మంది అజీర్ణం సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు శీతల పానీయాలు, ఆల్కలీన్ వాటర్ వంటివాటి సహాయం తీసుకుంటారు. ఏది ఆరోగ్యానికి మంచిది, ఏది సులభంగా గ్యాస్‌ను తగ్గిస్తుంది?
శీతల పానీయాలు విషంతో సమానం
ఎసిడిటీ ఇబ్బంది పెట్టే సమయంలో శీతల పానీయాలు తాగడం అనేది మంచి అలవాటు కాదు. శీతల పానీయాలలో సోడా ఉంటుంది. ఇది నురుగును కలిగిస్తుంది. ఇలాంటి పానీయాలలో చక్కెర కూడా చాలా అధికంగా ఉంటుందనే విషయం మర్చిపోకూడదు. కొన్నిసార్లు అజీర్ణానికి చక్కెర కూడా కారణమవుతుంది. ఏ శీతల పానీయం అయినా అసిడిటీ సమయంలో తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. అలాగే చల్లటి నీరు కూడా తాగకూడదు. చల్లటి నీరు తాగడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోతాయి. ఇది రక్త ప్రసరణలో అడ్డంకిని సృష్టిస్తుంది. ఇవేవీ అజీర్ణం సమస్యను తగ్గించవు. బదులుగా లేనిపోని సమస్యలను సృష్టిస్తాయి.
వేడి నీళ్ళు తాగితే గుండెల్లో మంట తగ్గుతుందా?
గ్యాస్-హార్ట్ బర్న్ సమస్యను తగ్గించడంలో చల్లని నీరు, శీతల పానీయాల కంటే డిస్టిల్డ్ వాటర్ ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే వేడినీరు మాత్రమే తాగకూడదు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా నిమ్మరసం, అల్లం రసం కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. అలాగే జీలకర్రను వేడినీటితో మరిగించి తాగినా ఫలితం ఉంటుంది. ఈ నీటిని తాగడం వల్ల అజీర్తి నుంచి వేగంగా ఉపశమనం లభిస్తుంది.
COMMENTS