Chicken Vs Eggs: Chicken Vs Eggs..Which of these is the best to eat?
Chicken Vs Eggs: చికెన్ Vs గుడ్లు.. వీటిల్లో ఏది తింటే బెస్ట్?
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు అనేవి చాలా అవసరం. శరీరానికి ముఖ్యంగా ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో అవసరం. ప్రోటీన్ వల్ల శరీరంలోని అనేక భాగాలు ఆరోగ్యంగా పని చేస్తాయి. ప్రోటీన్ నిండి ఆహారాల్లో చికెన్, గుడ్లు రెండూ ముందు ఉంటాయి. అయితే చాలా మందిలో ఉండే సందేహం ఏంటంటే.. చికెన్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందా? గుడ్లలో ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుందా? అలాగే ఏది తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రెండింటిలో ఎందులో ఎక్కువగా పోషకాలు, ప్రోటీన్ లభిస్తాయో? ఏది తింటే ఆరోగ్యానికి మంచిదో… ఇప్పుడు తెలుసుకుందాం.
గుడ్లు:
ప్రతి రోజూ ఓ కోడి గుడ్డు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో అనేక రకాలైన విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు లభిస్తాయి. ప్రతి రోజూ ఓ గుడ్డు తింటే.. డాక్టర్‌కు చాలా దూరంగా ఉండొచ్చు. అదే గుడ్డులోని ప్రోటీన్ విషయానికి వస్తే.. ఒక పెద్ద గుడ్డులో ఆరు గ్రాముల ప్రోటీన్ వరకూ లభిస్తుంది. చికెన్‌తో పోలిస్తే ఇందులో ప్రోటీన్ కాస్త తక్కువగా ఉంటుంది.
చికెన్:
చికెన్ తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కూడా శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఇక ప్రోటీన్ విషయానికి వస్తే.. కోడి మాంసంలో లీన్ ప్రోటీన్ అనేది అధికంగా ఉంటుంది. చికెన్ బ్రెస్ట్‌లో ప్రోటీన్ అధికంగా లభిస్తుంది. కొవ్వు శాతం అనేది తక్కువగా ఉంటుంది. ఇది మన రోజువారీ అవసరాలను తీరుస్తుంది. తక్కువ కొవ్వు, లీన్ ప్రోటీన్లు తినడం వల్ల శరీరానికి చాలా మంచిది. బాడీ ఫిట్‌గా ఉంటుంది.
ఈ రెండింటిలో ఏది బెస్ట్:
ఈ రెండూ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ రెండింటిలో కూడా ప్రోటీన్ అనేది మెండుగా లభిస్తుంది. పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి. చికెన్‌లోని ప్రోటీన్ మీకు లభించాలి అంటే.. స్కిన్ తీసేసి తినాలి. అప్పుడే పోషక విలువలు లభిస్తాయి. చర్మంతో తినడం వల్ల బాడీలో కొవ్వు చేరుతుంది. అలాగే విటమిన్లు, మినరల్స్, ఫాస్పరస్, నియాసిన్, సెలీనియం, విటమిన్లు అవసరమైనవి అందుతాయి. అయితే గుడ్డులో కూడా మంచి పోషకాలే లభిస్తాయి. ఇందులో లూటీన్, జియాక్సంతిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. చికెన్ తినేవారు వారంలో రెండు, మూడు సార్లు తీసుకుంటే చాలు. గుడ్డు తినాలి అనుకునేవారు రోజూ ఒకటి తీసుకుంటే బెటర్.
(NOTE: ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు APTEACHERS9.com బాధ్యత వహించదు.)
COMMENTS