Railway Super App: Railway 'Super App' is coming.. All facilities at one place.
Railway Super App: రైల్వే ‘సూపర్ యాప్’ వస్తోంది.. అన్ని సౌకర్యాలు ఒకే చోట.
భారతీయ రైల్వేలు దేశానికి గుండెకాయలాంటిది. దేశంలోని ఒక మూలను మరొక మూలకు కనెక్ట్ చేయడంలో ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. గత కొన్నేళ్లుగా రైల్వే అనేక సమస్యలకు టెక్నాలజీ ద్వారా పరిష్కారాలను కనుగొంటోంది. ప్రతి సమస్యకు ప్రత్యేక యాప్ ఉండటం వల్ల ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుందని భారతీయ రైల్వే శాఖ గుర్తించింది. అందుకే ఓ సూపర్ యాప్‌ని డెవలప్ చేస్తున్నారు అధికారులు. ఈ సూపర్ యాప్ రైల్వే అందించే అన్ని సేవలను ఒకే చోట ప్రజలకు అందించబోతోంది. దీంతో ప్రయాణికులకు చాలా సౌకర్యంగా ఉంటుంది.
భారతీయ రైల్వే ఈ సూపర్ యాప్ సాంకేతికంగా చాలా అధునాతనంగా ఉంటుందని అధికారులు తెలిపారు. దాదాపు అన్ని సేవలను ఒకే దాని క్రిందకు తీసుకురావడానికి పని చేస్తోంది. దీని ద్వారా ఒకే చోట టికెట్ బుకింగ్, రైలు ట్రాకింగ్ వంటి అనేక సేవలు పొందవచ్చు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు దీన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది కాకుండా, భారతీయ రైల్వే టికెట్ వాపసు కోసం 24 గంటల సేవను కూడా ప్రారంభించబోతోంది. దీనివల్ల టికెట్ రద్దు సౌకర్యం మరింత సౌకర్యవంతంగా, వేగంగా ఉంటుంది.
ప్రస్తుతం, IRCTC రైల్ కనెక్ట్ యాప్ భారతీయ రైల్వేలలో అత్యంత ప్రజాదరణ పొందిన మొబైల్ అప్లికేషన్. ఇది దాదాపు 10 కోట్ల డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది. ఇది కాకుండా, Rail Madad, UTS, Satark, TMS Nirikshan, IRCTC Air మరియు Port Read వంటి అనేక ఇతర యాప్‌లు కూడా పని చేస్తున్నాయి. ఈ యాప్‌లన్నింటినీ ఒకే అప్లికేషన్‌లోకి చేర్చేందుకు రైల్వే ప్రయత్నిస్తోంది. కోల్‌కతా మెట్రో మొబైల్ యాప్‌ను 4 లక్షల మందికి పైగా ఉపయోగిస్తున్నారు. దీనిని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ (CRIS) అభివృద్ధి చేసింది. ప్రయాణికులకు చాలా సౌకర్యవంతంగా ఉంది. సూపర్ యాప్ కూడా వన్ స్టాప్ సొల్యూషన్ కావాలని అభివృద్ధి చేస్తున్నట్లు సీనియర్ అధికారి తెలిపారు.
COMMENTS