Consanguine marriage: Are people doing consanguine marriages...read this article once..
Consanguine marriage: మేనరికం వివాహాలు చేసుకుంటున్నారా… ఒక్కసారి ఈ ఆర్టికల్ చదవండి..
బయటవారు అయితే ఎలాంటివారో.. ఏంటో తెలీదు.. అదే మన చుట్టాల అమ్మాయి అయితే ఒద్దికగా ఉంటుంది… మన కుటుంబ సంప్రదాయాలు తెల్సు.. బాగా చూసుకుంటుంది.. అందరిలో కలిసిపోతుంది అనుకుంటున్నారా..? అయితే జస్ట్ వెయిట్. మేనరికం, దగ్గర చుట్టాల మధ్య వివాహాలు చేసుకుంటే.. ఆ దంపతుల పిల్లలకు.. జన్యపరమైన వ్యాధులే కాకుండా.. నేత్రాలకు సంబంధించిన సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉందని ఎల్వీప్రసాద్ ఆసుపత్రి జరిపిన లేటెస్ట్ రీసెర్చ్‌లో తెలిసింది. ఈ క్రమంలో వంశపారంపర్యంగా వచ్చే కంటి వ్యాధులపై.. జనాల్లో అవగాహన కోసం.. ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ వారు అధ్యయనానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.
బాగా దగ్గరి బంధుత్వం ఉన్నవారిని.. రక్త సంబంధీకులను వివాహాలు చేసుకుంటే… దంపతుల్లో వంశపారంపర్యంగా కంటి సమస్యలు ఉంటే… పుట్టే పిల్లలకు కార్నియా, రెటీనా వంటి కంటి నరాలకు సంబంధించిన సమస్యలే కాకుండా ఐ ఫోకస్ తక్కువగా ఉండటం, కంటిలో ఒత్తిడి పెరగడం, రేచీకటి, పగలు సమయాల్లో సక్రమంగా చూడలేకపోవడం వంటి సమస్యల ముప్పు అధికంగా ఉందని అధ్యయనంలో తేలింది. కార్నియాలో శుక్లాలు, మచ్చలు, గ్లకోమా, రెటినైటిస్ పిగ్మెంటోసా ప్రాబ్లమ్స్ తలెత్తే ముప్పు ఉందని.. ఇవి కంటి చూపును పూర్తిగా పోగొట్టే ప్రమాదం ఉందని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ వైద్యులు డా.మంజుశ్రీ భాతే వెల్లడించారు.
‘‘ఫ్యామిలీ హిస్టరీలో హెచ్‌ఈడీ ఉన్న కపుల్స్‌కు జన్యు పరీక్షలు అవసరం. దానివల్ల పుట్టే పిల్లలు జన్యుపరమైన కంటి సమస్యల బారిన పడకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందే గుర్తించడం వల్ల ఆపరేషన్స్, మెడిసిన్ ద్వారా నివారించవచ్చు’’ అని మంజుశ్రీ తెలిపారు.
COMMENTS