The biggest lift in the world.. carries hundreds of people at a time.. if you go inside it is a palace..! Do you know where?
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్.. ఒకేసారి వందల మందిని మోస్తుంది.. లోపలికి వెళితే అదొక ప్యాలెస్..! ఎక్కడుందో తెలుసా..?
లిఫ్టులు సాధారణంగా 10-15 మందిని తీసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంటాయి. అయితే ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో అతి పెద్ద లిఫ్ట్‌ను ఏర్పాటు చేశారు. ఇది ఎంతమందినైనా సరే, అలుపు లేకుండా మోస్తుంది. ఈ లిఫ్ట్ చాలా పెద్దది. లోపల చూస్తే అది ప్యాలెస్ కంటే తక్కువ కాదు. అందులో కూర్చోవడానికి సోఫాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ లిఫ్ట్ ఏదో 20-30 మందిని మాత్రమే తీసుకెళ్తుందంటే పొరపాటే..ఎందుకంటే..ఈ భారీ లిఫ్ట్‌లో ఏకకాలంలో ఏకంగా 200 మందికి పైగా ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉందని తెలిస్తే మీరు షాక్ అవుతారు. లిఫ్ట్ బరువు దాదాపు 17 టన్నులు. జియో వరల్డ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ లిఫ్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌గా పరిగణించబడుతుంది .
ముంబైలో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్‌కి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో చూసినట్టుగా లిఫ్ట్ విలాసవంతమైన డోర్ బయట కొంతమంది నిలబడి ఉండటం కనిపిస్తుంది. మొదట్లో అందమైన భవనానికి ఇదే ప్రధాన మార్గం అని త అనుకుంటారు చూసిన వాళ్లంతా. అయితే దాని గేటు తెరుచుకోగానే ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపిస్తుంది. ముందుగా చూసినప్పుడు అదేదో విలాసవంతమైన తలుపు అనుకున్నాం..కానీ, అది లిఫ్ట్ గేటుగా మారింది. మీరు లిఫ్ట్‌లోకి ప్రవేశించిన వెంటనే, మీరు ఒక ప్యాలెస్ లో ఉన్నామనే అనుభూతిని పొందుతారు. ఎక్కువ మంది ప్రజలు ఈ లిఫ్ట్‌లో ప్రయాణించేలా భారీ స్థలం కేటాయించారు. అంతే కాదు లిఫ్ట్‌లో కూర్చోవడానికి సోఫాలు కూడా ఏర్పాటు చేశారు.
https://twitter.com/i/status/1770867418253926457
ప్రపంచంలోనే అతి పెద్ద విలాసవంతమైన లిఫ్ట్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ కాగా, దీనిపై నెటిజన్లు కూడా తీవ్ర స్థాయిలో కామెంట్లు చేస్తున్నారు. వీడియో @Rainmaker1973 హ్యాండిల్‌తో Xలో కూడా షేర్ చేయబడింది.
COMMENTS