LIC Amritbaal: For every thousand Rs. 80 will be added.. LIC is an excellent plan for children..
LIC Amritbaal: ప్రతి వెయ్యికి రూ. 80 యాడ్ అవుతాయి.. పిల్లల కోసం ఎల్ఐసీ అద్భుతమైన ప్లాన్..
పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించాలన్నది ప్రతి తల్లిదండ్రుల లక్ష్యం. అందుకు వారి చదువు విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షిస్తూ కొత్త కోర్సులను చదివిస్తారు. ఖర్చు విషయంలో వెనకాడకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. ఇది అభినందించాల్సిన విషయమే. అలాగే అనుకోని ఆపద వచ్చినప్పుడు పిల్లలకు రక్షణ కల్పించడానికి కూడా చర్యలు తీసుకోవాలి. వారికి ఆర్థిక భరోసా ఇవ్వాలి. అందుకు బీమా పథకాలు ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) పిల్లల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టింది. అలాంటి పథకాల్లోఅమృత్‌బాల్ ఎండోమెంట్ ప్లాన్ ఒకటి. ఆర్థికంగా పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా దీనిని రూపొందించింది. ఈ పథకాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 17న ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో ప్రారంభించింది. పిల్లల ఉన్నత విద్య, ఇతర అవసరాలను తీర్చడానికి ఎంతో ఉపయోపడుతుంది. ఈ పథకం ప్రత్యేకతలు, రిస్క్ కవరేజీ, మెచ్యురిటీ తదితర వివరాలను తెలుసుకుందాం.
30 రోజుల నుంచి 13 ఏళ్ల పిల్లలకు..
30 రోజుల నుంచి 13 ఏళ్ల పిల్లల వరకూ అందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ప్లాన్ కనీస మెచ్యూరిటీ 18 ఏళ్లు, గరిష్టంగా 25 ఏళ్లు ఉంటుంది. పాలసీదారులు 5, 6 లేదా 7 ఏళ్ల స్వల్ప ప్రీమియం చెల్లింపు నిబంధనలను ఎంచుకోవచ్చు. ఇందులో కనీసం రూ. 2 లక్షలు జమ చేయవచ్చు. అలాగే గరిష్ట పరిమితి లేదు. పాలసీ మెచ్యూరిటీ అయిన తర్వాత మొత్తాన్ని ఒకేసారి అందజేస్తారు. లేకపోతే 5, 10, 15 ఏళ్లలో వాయిదాల ప్రకారం తీసుకోవచ్చు.
రాబడి ఇలా..
ఈ ప్లాన్లో మీరు కనీసం రూ. 2లక్షలు జమ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన మొత్తంపై ప్రతి రూ. 1000కి ఏడాదికి రూ. 80 చొప్పున ఎల్ఐసీ యాడ్ చేస్తుంది. రూ. 80 రిటర్న్ మొత్తం ఇన్సూరెన్స్ పాలసీకి అంటే ఇన్సూర్డ్ అమౌంట్‌కు యాడ్ అవుతుందన్నమాట. ఈ హామీతో కూడిన రాబడి ప్రతి ఏటా పాలసీ సంవత్సరం చివర్లో యాడ్ చేస్తుంది. పాలసీ వ్యవధి ముగిసే వరకు ఇది కొనసాగుతుంది.
పాలసీలో డెత్ బెనిఫిట్లకు సంబందించి రెండు ఆప్షన్లు ఉన్నాయి. పాలసీదారులు తమ అవసరాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో ఇంకా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది రిస్క్ కవర్ చేయడం. పాలసీ తీసుకున్న పిల్లల వయస్సు 8 ఏళ్ల కంటే తక్కువగా ఉన్నప్పుడు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ పిల్లలకు పాలసీ తీసుకున్న రోజు నుంచి రెండేళ్ల లేదా వారికి 8 ఏళ్లు వచ్చిన వెంటనే రిస్క్ కవరేజీ ఉంటుంది. ఒకవేళ పాలసీ తీసుకునే సరికే పిల్లల వయసు 8 ఏళ్లు అంత కంటే ఎక్కువ ఉంటే పాలసీ జారీ చేసిన తేదీ నుంచే రిస్క్ కవరేజీ ప్రారంభమవుతుంది.
ఆర్థిక భరోసా..
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది జనవరి 20లో ఎల్ఐసీ జీవన్ ధార II యాన్యుటీ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అనంతరం అమృతబాల్ ఎండోమెంట్ ప్లాన్‌ను కూడా ప్రారంభించింది. వీటి ద్వారా తమ ఖాతాదారులకు పిల్లల విషయంలో సంపూర్ణ ఆర్థిక భరోసా లభిస్తుందని ఎల్‌ఐసీ తెలిపింది.
COMMENTS